For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సాక్ష్యం సినిమా ప్రపంచంలోనే ఫస్ట్.. మినీ బాహుబలిలా ఉంటుంది.. బెల్లంకొండ శ్రీను

  By Rajababu
  |
  Saakshyam Movie Team Interview

  ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా అల్లుడు శీనుతో తెలుగు చిత్రసీమలో హీరోగా అడుగుపెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ ప్రతీ సినిమాతో పరిణతి చెందుతున్నాడు. ఆయన నటించిన జయ జానకి నాయక చిత్రం ఘనవిజయం అందుకొన్నది. తాజాగా శ్రీవాసు దర్శకత్వంలో సాక్ష్యం అనే విభిన్నమైన కథతో శ్రీనువాస్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సాక్ష్యం గురించి బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

  ప్రపంచంలోనే తొలిసారి

  ప్రపంచంలోనే తొలిసారి

  జయ జానకి నాయకా పూర్తి కాకముందే దర్శకుడు శ్రీవాస్ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. కథ నచ్చడంతో ఈ సినిమా చేయాలని నిర్ణయించుకొన్నాను. తొలిసారి పంచభూతాలు (నీరు, నిప్పు, గాలి, ఆకాశం, నేల)ను ఉపయోగించుకొని సినిమా చేయడం ఇండియాలోనే కాదు.. ప్రపంచంలోనే మొదటిసారి అనుకొంటా. మా సినిమా చూసిన తర్వాత తర్వాత ఇలాంటి సినిమాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది.

  అద్భుతమైన కథ

  అద్భుతమైన కథ

  సాక్ష్యం సినిమా చాలా అద్భుతమైన కథ. ఈ సినిమా కథ చెప్పినప్పుడే మరో సినిమాలో నటించవద్దని అడిగాడు. అందుచేతనే మరో సినిమాను ఒప్పుకోలేదు. కొత్త పాయింట్‌తో కథ చేసుకోవడంతో ఈ స్టోరిని లవ్ చేశాను. సుమారు 150 రోజులు పనిచేశాను. నా కెరీర్‌లో ఎక్కువ గుర్తుండి పోయే చిత్రం.

  పక్కా కమర్షియల్ సినిమా

  పక్కా కమర్షియల్ సినిమా

  సాక్ష్యం చిత్రం పక్కా కమర్షియల్ చిత్రం. స్క్రీన్ ప్లే తెలుగు సినిమాల మాదిరిగానే ఉంటుంది. వావ్ అనే విధంగా సినిమా తెర మీద కనిపిస్తుంది. ఐదు ఫైట్స్ కూడా అద్బుతంగా ఉంటాయి. ప్రతీ ఫైట్ క్లైమాక్స్ ఫైట్ మాదిరిగానే ఉంటుంది. ఫైట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండమని నాన్న హెచ్చరించారు.

  అడ్వంచరస్‌గా

  అడ్వంచరస్‌గా

  అల్లుడు శీను చిత్రంతో నాకు ఎక్కువ మంది చిన్న పిల్లలు ఫ్యాన్స్ అయ్యారు. వారి కోసం ఇంట్రడక్షన్ సీన్‌లో నేను అడ్వంచరస్ చేశాను. దుబాయ్‌కి వెళ్లి శాండ్ బోడింగ్, ఫై బోడింగ్, బీఎంఎస్ సైక్లింగ్, ఏపీవీ రైడింగ్ లాంటి అంశాలలో శిక్షణ పొందాను.

  రిస్క్ చేయకపోతే బాహుబలి..

  రిస్క్ చేయకపోతే బాహుబలి..

  నేను యాక్షన్ సీన్లలో నటించేటప్పుడు పీటర్ హెయిన్స్ రిస్క్ చేయవద్దని వారించాడు. మగధీర సమయంలో నాకు కొంత రిస్క్ ఎదురైంది. అందుకే వద్దు అంటున్నానని పీటర్ చెప్పాడు. అప్పుడు మగధీరలో రిస్క్ చేయకపోతే బాహుబలి వచ్చేదా అని పీటర్ మాస్టర్‌ను అడిగాను. కొత్తగా ఏదైనా చేయకపోతే స్పెషాలిటీ ఏముంటుంది.

  కొత్తగా పంచభూతాల కాన్సెప్ట్

  కొత్తగా పంచభూతాల కాన్సెప్ట్

  లుక్, సౌండ్, ఇతర అంశాలతో చక్కటి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఉంటుంది. నేను వీడియో గేమ్ డెవలపర్‌ పాత్రను పోషిస్తున్నాను. పంచభూతాలను ఉపయోగించుకొని చేసిన అంశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తాయి. అందుకు దర్శకుడికి థ్యాంక్స్. ప్రతీ సినిమాకు రేంజ్ పెంచుకొంటూ పోవడం మంచిదే.

  నలుగురు విలన్లు

  నలుగురు విలన్లు

  సాక్ష్యం చిత్రంలో జగపతిబాబు, రవికిషన్, అశుతోష్ రాణా, కన్నడలో ప్రముఖ నటుడు మధు గురుస్వామి లాంటి టాప్ యాక్టర్లు విలన్ పాత్రలు పోషించారు. శరత్ కుమార్, మీనా పాత్రలు చాలా కీలకంగా ఉంటాయి. మంచి కంటెంట్‌ను అద్భుతంగా తెరకెక్కించడానికి చాలా కష్టపడ్డాం. మొదటి నుంచి ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది. దానిని బ్లాక్‌బస్టర్‌గా మార్చడానికి తీవ్రంగా కృషి చేశాం. మొత్తానికి ఈ చిత్రాన్ని మినీ బాహుబలిని రూపొందించామనే ఫీలింగ్ కలుగుతుంది.

  పూజా హెగ్డే స్పెషల్‌ ఎట్రాక్షన్

  పూజా హెగ్డే స్పెషల్‌ ఎట్రాక్షన్

  పూజా హెగ్డే ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుంది. పూజాకు క్రేజ్ లేని సమయంలో ఆమెను ఎంపిక చేశాం. మా సినిమా తర్వాత పూజా హెగ్డే నాలుగు సినిమాలు ఒప్పుకొని స్టార్ హీరోయిన్ అయిపోయింది.

   హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

  హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

  హర్షవర్ధన్ రామేశ్వర్ భవిష్యత్‌లో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్‌ అవుతారు. రీరికార్డింగ్ చాలా అద్బుతంగా ఉంటుంది. సౌండ్, పాటలు కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో ఐటెం సాంగ్ లేదు.

  English summary
  Saakshyam is an upcoming Telugu action fantasy thriller film produced by Abhishek Nama on Abhishek Pictures banner and directed by Sriwass. Starring Bellamkonda Sreenivas, Pooja Hegde in the lead roles with Sarath Kumar, Meena and Jagapathi Babu in supporting roles and with music composed by Harshavardhan Rameshwar.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X