Bhagavanth Kesari 2: భగవంత్ కేసరి పార్ట్ 2 మూవీపై అనిల్ రావిపూడి క్లారిటీ!
తెలుగు సినిమా పరిశ్రమలో వరుస విజయాలతో ముందుకెళ్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం భగవంత్ కేసరి. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మీడియాతో అనిల్ రావిపూడి ముచ్చటించారు. భగవంత్ కేసరి మూవీ గురించి.. ఈ సినిమాకు సీక్వెల్ గురించి తన అభిప్రాయాలను చెబుతూ..
తెలుగు సినిమా పరిశ్రమలో మొత్తం ఆరు సినిమాలు పూర్తి చేశాను. అంటే నా కెరీర్‌లో ఒక ఓవర్ పూర్తి అయింది. భగవంత్ కేసరి సినిమా ఫ్రెష్ ఓవర్. రెండో ఓవర్‌లో కొంత డిఫరెంట్ సినిమాలు చేయాలని ప్లాన్ చేశాను. ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా భగవంత్ కేసరి సినిమా ఉంటుంది. తెలంగాణలోని వరంగల్ బ్యాక్‌డ్రాప్ కథ నడుస్తుంటుంది అని అనిల్ రావిపూడి తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో అనిశ్చితి ఉండటం వల్ల వరంగల్‌లో షూట్ చేయలేకపోయాం. బాలకృష్ణతో షూటింగ్ పూర్తి చేయలేకపోవడం వల్ల గ్రాఫిక్స్‌లో వరంగల్ సీన్లను చూపించబోతున్నాం. ఈ సీన్లు చూస్తే సీజీలో షూట్ చేసినట్టు అనిపించదు. తప్పకుండా మంచి అనుభూతిని భగవంత్ కేసరి అందిస్తుంది అని అనిల్ రావిపూడి చెప్పారు.

తెలంగాణలో తెలుగు యాసతోపాటు హిందీ మిక్స్ అయి ఉంటుంది. తెలంగాణ యాసతోపాటు హిందీ కలిపి మాట్లాడుతుంటారు. కాబట్టి ఈ సినిమా తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుంది కాబట్టి బాలకృష్ణతో హిందీ మాట్లాడించాలని స్క్రిప్టులో ప్లాన్ చేశాం. బాలకృష్ణ చేత చెప్పించిన హిందీ డైలాగ్స్ మంచి కిక్ ఇస్తాయి అని అనిల్ రావిపూడి తెలిపారు.

భగవంత్ కేసరి చిత్రంలో మొత్తం మూడు పాటలు ఉంటాయి. సినిమా ఓపెనింగ్‌లో ఉయ్యాలా ఉయ్యాల.. గణేష్ సాంగ్, సెకండాఫ్‌లో శ్రీలీల ట్రైనింగ్ సందర్భంలో ఒక పాట వస్తుంది. ఈ సినిమా కోసం మరో పాటను కూడా షూట్ చేశాం. కానీ స్టోరీ ఫ్లోకు అడ్డం తగలకుండా ఉండటానికి ఆ పాటను పక్కన పెట్టాం. ఆ పాటను దసరా పండుగకు రిలీజ్ చేయాలని అనుకొంటున్నాం అని అనిల్ రావిపూడి చెప్పారు.
భగవంత్ కేసరి సినిమాకు పార్ట్ 2 తీయాలా? వద్దా అనే విషయం గురించి క్లారిటీ లేదు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించి పెద్ద హిట్ చేస్తే భగవంత్ కేసరి 2 సినిమాను తీయడానికి అవకాశం ఉంది. భగవంత్ కేసరి 2 సినిమా తీయాలనే ఆలోచన ఉంది. ఈ సినిమా కథ ముగిసిపోతుంది. భగవంత్ కేసరి 2 కథ సపరేట్‌గా ఉంటుంది అని అనిల్ రావిపూడి తెలిపారు.

షైన్ స్క్రీన్ బ్యానర్‌కు చెందిన నిర్మాతలు హరీష్, సాహు నాకు 2016లో పరిచయం అయ్యారు. వారు అప్పడే నాకు సినిమా కోసం అడ్వాన్స్ ఇచ్చారు. దాదాపు నా కోసం ఐదేళ్లు వెయిట్ చేశారు. దిల్ రాజు తర్వాత అంతటి ఎమోషనల్ బాండింగ్ ఉన్న నిర్మాతలు. పటాస్ తర్వాత భగవంత్ కేసరి సినిమా చేయాలని ఉంది. కానీ కుదర్లేదు. ఇప్పుడు కుదిరింది కాబట్టి ఈ సినిమా సెట్ అయింది అని అనిల్ రావిపూడి తెలిపారు.


Click it and Unblock the Notifications











