Bhagyashree అందమైన భార్యను ప్రపంచానికి వదిలేయను.. భాగ్యశ్రీ అంటే భర్తకు ఎలాంటి ఫీలింగ్ అంటే?
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి మైనే ప్యార్ కియా చిత్రంలో నటించిన భాగ్యశ్రీ దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకొన్నారు. అయితే -ఓవర్‌నైట్‌లోనే క్రేజీ హీరోయిన్‌గా మారిన ఆమె సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొని సంచలనం రేపింది. అయితే చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో భాగ్యశ్రీ మాట్లాడుతూ..

గ్లామర్‌గా మెయింటెనెన్స్‌పై
మైనే ప్యార్ కియా టైంలో ఎలా ఉన్నారో.. ఇప్పుడు అలానే ఉన్నారు అంటూ నా గ్లామర్ గురించి అందరూ అడుగుతున్నారు. అందుకు నేను ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. ఎక్కువగా నీళ్లు తాగడం, నిద్రకు ఎక్కువగా సమయం కేటాయించడం, పార్టీ సమయంలో ఎక్కువగా భోజనం చేయకుండా ఉండటం చేస్తూ ఉంటాను. దైవ చింతన, అధ్యాత్మికతో జీవనం సాగించాలి. ప్రశాంతంగా ఉండటం చేయాలి. లవ్, డెస్టినీలో ఒకటిని ఎంచుకోవడం కుదరదు. మైనే ప్యార్ కియా నాకు ప్రేమను పంచింది. అదే నాకు డెస్టినేషన్ అని భాగ్య శ్రీ చెప్పారు.

33 సంవత్సరాల క్రితం
నా కెరీర్ ప్రారంభించి 33 సంవత్సరాలు. కానీ బ్రేక్ తీసుకోవడం వల్ల నేను పెద్దగా సినిమాలు చేయలేదు. ఫ్యామిలీ కోసం నేను సినిమాలకు దూరంగా ఉన్నాను. పిల్లల్ని పెంచడం, ఇంటి బాధ్యతలు చూసుకోవడంతోనే సరిపోయింది. ఇప్పుడు పిల్లలు పెద్ద పెరిగారు. ఇప్పుడు అమ్మా.. మీరు సినిమాలు చేసుకోండి అంటూ నా పిల్లలు నాకు చెప్పారు. దాంతో సినిమాల్లో నటించడం మొదలుపెట్టాను. ఇక ముందు మంచి పాత్రలు చేయడానికి రెడీ అవుతున్నాను అని భాగ్య శ్రీ తెలిపారు.

నా భర్త చాలా పొసెసివ్.. అందుకే
మైనే ప్యార్ కియా దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన తర్వాత నేను అనూహ్యంగా సినిమాల నుంచి తప్పుకొన్నాను. అప్పటికే నాకు, నా భార్తతో అఫైర్ ఉంది. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకొన్నాం. నేనంటే నా భర్తకు ఎక్కువ పొసెసివ్. అందమైన భార్యను ప్రపంచానికి వదలిస్తే నాకు బాధని చెప్పాడు. నా భార్య నాతోనే ఇంటి పట్టునే ఉండాలి అని అనుకొన్నాడు. ఇప్పుడు పిల్లలు, నా భర్త సినిమాలు చేయమని చెబుతున్నారు. అందుకే మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు అని భాగ్య శ్రీ తెలిపారు.

ప్రభాస్ పక్కన యంగ్ మదర్‌గా
రాధేశ్యామ్ సినిమాలో నన్ను మరింత గ్లామర్‌గా చూపించారు. యంగ్ మదర్ పాత్ర కావడంతో నా అప్పియరెన్స్ గురించి ముందే నాకు క్లియర్‌గా చెప్పారు. ప్రతీ ఫ్రేమ్‌లో అందంగా కనిపించాలని చెప్పారు. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ.. నేను యంగ్‌గా కనిపించడం ఆ పాత్రకు ప్లస్ అయింది. నేను బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొన్నాను. హెయిర్ స్టయిల్, మంచి క్యాస్ట్యూమ్‌తో మరింత గ్లామరగా కనిపించాను. ఇక ముందు తల్లి పాత్రలే కాకుండా నటనకు స్కోప్ ఉండే పాత్రలు పోషించడానికి ప్రయత్నిస్తాను. తల్లి పాత్రలు చేయడానికి నాకు ఎలాంటి సంకోచం లేదు అని చెప్పారు.

తెలుగు నేర్చుకొంటాను అంటూ
రాధే శ్యామ్ సినిమాలో తెలుగు డైలాగ్స్ చెప్పడం ఓ ఎగ్జామ్ రాసినట్టు అనిపించేది. తెలుగు, మరాఠీ, సంస్కృతం చాలా దగ్గరగా ఉంటాయి. డైరెక్టర్ ఇచ్చిన డైలాగ్స్ అన్నీ ముందే నేర్చుకొని సెట్‌లో చెప్పేదానిని. త్వరలోనే తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. ఆ ప్రయత్నంగా నేను తెలుగు నేర్చుకొంటున్నాను. ఇక ముందు కూడా మంచి పాత్రలతో మీ ముందుకు వస్తాను అని భాగ్య శ్రీ అన్నారు.


Click it and Unblock the Notifications











