For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  నా పేరెంట్స్ అలా పెంచారు.. ఆ విషయంలో బాధపడను.. భూమిక

  By Rajababu
  |
  UTurn Movie : Bhumika Chawla Interview | Samantha | aadipinishetty

  సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'యు టర్న్'. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, వివై కంబైన్స్ బ్యానర్స్‌పై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీల‌క పాత్ర‌ధారులు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సంద‌ర్భంగా భూమిక మీడియాతో మాట్లాడింది.

   భిన్నమైన పాత్రలో

  భిన్నమైన పాత్రలో

  ఇది వ‌ర‌కు నేను న‌టించిన చిత్రాల‌కు భిన్న‌మైన పాత్ర‌లో యు ట‌ర్న్‌ క‌న‌ప‌డ‌తాను. ఓ ఆర్టిస్ట్ భిన్న‌మైన పాత్ర‌లు చేస్తేనే న‌టుడిగా సంతృప్తి.. గుర్తింపు దొరుకుతుంది. నేను క‌న్న‌డ యు ట‌ర్న్‌ చిత్రాన్ని చూశాను. అయితే నేను నా త‌రహాలో న‌టిస్తూనే డైరెక్ట‌ర్ ఎలా కావాల‌నుకుంటున్నారో అలాంటి ఔట్‌పుట్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను.

  మరే సినిమాలో చేయలేదు

  మరే సినిమాలో చేయలేదు

  యు ట‌ర్న్‌లో నేను చేసిన పాత్ర‌ను మ‌రే సినిమాలోనూ చేయ‌లేదు. తెర‌పై ఎలా ఉంటుంది. ప్రేక్ష‌కుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుంద‌నే దానిపై ఎగ్జ‌యిటింగ్‌గా ఉన్నాను. నా కెరీర్‌లో మంచి పాత్రగా నిలుస్తుంది అని భూమిక చెప్పారు. స‌మంత అద్భుతంగా న‌టించింది. ఈగలో త‌ను న‌టన చూశాను. ఆన్ సెట్స్‌లో త‌ను ఇన్‌స్టెంట్ ఎన‌ర్జీతో న‌టిస్తుంది అన్నారు.

  పాత్ర నిడివి పట్టించుకోను

  పాత్ర నిడివి పట్టించుకోను

  సినిమాలో పాత్ర నిడివి ఎంత అనేది పట్టించకోను. ప్రాముఖ్య‌త ఎంత అని చూసుకొంటాను. గతంలో నేను కూడా మ‌హిళా ప్రాధాన్యం ఉన్న పాత్ర‌ల్లో న‌టించాను. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు క్ర‌మంగా పెరుగుతున్నాయి. అయితే అలాంటి సినిమాల సంఖ్య ఇంకా పెర‌గాలి.

  తమిళంలో భారీగా ఆఫర్లు

  తమిళంలో భారీగా ఆఫర్లు

  లేడీ ఓరియెంట్ పాత్రలను ర‌చ‌యిత‌లు క్రియేట్ చేయాలి. ఎంసీఏ తర్వాత త‌మిళంలో అవకాశాలు వ‌స్తున్నాయి. మంచి బ్యానర్, దర్శకుడు, నిర్మాత కుదిరి.. స్క్రిప్ట్ న‌చ్చితే త‌ప్ప‌కుండా చేస్తాను. భాష ఏంటీ అనేది పట్టించుకొను అని భూమిక చెప్పారు.

   నటిగా రాణిస్తున్నాను

  నటిగా రాణిస్తున్నాను

  1999లో ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను. ఇర‌వైయేళ్లుగా న‌టిగా రాణిస్తున్నాను. అదే నాకు సంతోషంగా భావిస్తాను. ఈ స‌మ‌యంలో మ‌నతో పాటు మ‌న చుట్టు ప‌క్క‌ల ఉండే చాలా విష‌యాలు మారుతాయి. ఒక‌ప్ప‌టితో పోల్చితే ఇప్పుడు నా చుట్టు ఉన్న విష‌యాల‌ను నేను చూసే కోణం మారింది.

  ఫెయిల్యూర్స్ నన్ను బాధించవు

  ఫెయిల్యూర్స్ నన్ను బాధించవు

  స‌క్సెస్, ఫెయిల్యూర్ న‌న్ను ఎప్పుడూ బాధించ‌వు. నా త‌ల్లిదండ్రులు న‌న్ను పెంచిన విధానం అలాంటిది. ఇప్పుడున్నంత సోష‌ల్ మీడియా ఒక‌ప్పుడు లేదు. కాబ‌ట్టి నాపై జ‌యాప‌జ‌యాలు పెద్ద‌గా ఎఫెక్ట్ ప‌డ‌లేదు.

  హిందీ ఖామోషీలో నటించా..

  హిందీ ఖామోషీలో నటించా..

  హిందీలో ఈ ఏడాది విడుద‌ల కాబోయే `ఖామోషి` చిత్రంలో నా పాత్ర చిన్న‌దే అయినా చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. అలాగే త‌మిళంలో ఓ సినిమా.. తెలుగులో యు ట‌ర్న్ సినిమాలు చేశాను. ప్ర‌తి పాత్ర చాలా వైవిధ్య‌మైన‌దే.

  English summary
  Actress, Bhumika Chawla appears confident and relaxed ahead of her much-awaited Tamil-Telugu bilingual U Turn. This movie is releases on September 13th. The actress prefers not to reveal much about her role owing to the suspense element in the project, Bhumika confesses to have enjoyed working with an asssured director like Pawan Kumar.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more