మిస్టర్ ప్రెగ్నెంట్ చూసి నా తల్లి భోరున ఏడ్చింది.. నవ మాసాలు మోసే.. సోహైల్ ర్యాన్ ఎమోషనల్

బిగ్‌బాస్ తెలుగు ఫేమ్, యువ హీరో సయ్యద్ సోహైల్ ర్యాన్ నటించిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్ (Mr Pregnant). మైక్ మూవీ బ్యానర్‌, అప్పిరెడ్డి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల నిర్మించిన చిత్రం ఆగస్టు 18వ తేదీన రిలీజ్‌కు సిద్దమైంది. దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిన ఈ చిత్రంలో రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు మంచి బజ్ క్రియేట్ చేశాయి. దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో హీరో సయ్యద్ సోహైల్ మాట్లాడుతూ..

నేను అప్పిరెడ్డి మంచి స్నేహితులం. నేను బిగ్‌బాస్ రియాలిటీ షోకు వెళ్లడానికి ముందు మిస్టర్ ప్రెగ్నెంట్ కథ గురించి తెలుసు. ఆ కథ విన్నప్పుడు నన్ను పెట్టి హీరోగా సినిమా తీయమని చెబితే కుదరదు అన్నాడు. నీకు హీరోల మేనేజర్లు తెలుసు కదా. ఏ హీరోకైనా కథ చెప్పించు అని అడిగితే.. పిల్లిని సంకలో పెట్టుకొని ఊరంత తిరుగుతున్నాడు అని మనసులో తిట్టుకొనే వాడిని. విశ్వక్ సేన్‌కు కథ చెప్పే ప్రయత్నం చేశారు అని సోహైల్ తెలిపారు.

Bigg Boss Telugu fame Syed Sohel Ryan about Mr Pregnant and Producer Appi Reddy

ఇక నేను బిగ్‌బాస్‌ తెలుగు షోకు వెళ్లడం, నాకు ఆ షోలో మంచి గుర్తింపు, విపరీతంగా ఫాలోయింగ్ రావడం జరిగింది. నేను బిగ్‌బాస్ షో నుంచి బయటకు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో వచ్చాను. ఉదయం 6 గంటలకే కారులో నన్ను తీసుకొని పోయి.. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాను ఇచ్చారు. అలా ఈ సినిమాలో భాగమయ్యాను అని సోహైల్ చెప్పారు.

మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాలో గర్బాన్ని మోసే అవకాశం రావడం గొప్ప అనుభూతి. మాతృత్వపు అనుభూతిని పొందడం చాలా ఆనందం వేసింది. సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు మా ఇంట్లో మా అక్కయ్య, చెల్లెలు గర్బవతులు. వారు నడించే విధానం, వారు పడే అవస్థలను చూసి నా పాత్ర కోసం ప్రిపేర్ అయ్యాను అని తెలిపారు.

Bigg Boss Telugu fame Syed Sohel Ryan about Mr Pregnant and Producer Appi Reddy

మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా చూసి నా తల్లి గొప్పగా ఫీలైంది. మా అమ్మ తన జీవితంలో మూడు, నాలుగు సినిమాలు చూసి గుక్కపట్టి ఏడ్చింది. అందులో మిస్టర్ ప్రెగ్నెంట్ ఒకటి. నీ జీవితంలో ఇంత కంటే గొప్ప సినిమా రాదేమో. భవిష్యత్‌లో ఇలాంటి సినిమాలే చేయాలని కోరింది. ఈ మధ్య ప్రెగ్నెంట్ మహిళలకు, అలాగే కొంత మహిళలకు సినిమా చూపిస్తే.. కంటతడి పెట్టుకొని ఎమోషనల్ అయ్యారు అని సోహైల్ చెప్పారు.

మిస్టర్ ప్రెగ్నెంట్ భావోద్వేగమైన చిత్రం. ప్రతీ పురుషుడు చూడాల్సిన సినిమా. బిడ్డకు తల్లి ఇచ్చిన, ఇవ్వబోయే తల్లి, తండ్రులకు గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఫ్యామిలీ అంతా చూడదగిన ఎమోషనల్ కంటెంట్‌తో సినిమాను రూపొందించాం. ఈ సినిమా తప్పకుండా మంచి ఫీల్‌ను అందిస్తుంది. నవ మాసాలు భరించి బిడ్డకు జన్మనిచ్చే ప్రతీ మహిళకు అంకితం అని బిగ్‌బాస్ సోహైల్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X