VJ Sunny నాకు సీక్రెట్ లవర్.. సీక్రెట్ రివీల్ చేసిన బిగ్‌బాస్ విన్నర్ విజే సన్నీ
బిగ్‌బాస్ తెలుగు విజేత వీజే సన్నీ హీరోగా, సీనియర్ నటి ఆమని మేన కోడలు హ్రితిక శ్రీనివాస్ జంటగా, ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1 గా రూపొందిన చిత్రం సౌండ్ పార్టీ. పేపర్ బాయ్ డైరెక్టర్ జయ శంకర్ సమర్పణలో నూతన దర్శకుడు సంజయ్ శేరి దర్శకత్వం వహించగా, ఎన్నారై రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 24 తేదీన గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలవుతున్న నేపథ్యంలో..
సౌండ్ పార్టీ మూవీ టీమ్ వర్క్. మా వరకు మంచి సినిమా చేసి ప్రేక్షకుల వద్దకు వచ్చాం. సౌండ్ పార్టీ మరింత సౌండ్ చేస్తుందని అనుకొంటున్నాను. ఎన్నికల సమయంలో మా సౌండ్ పార్టీకి అన్ని పార్టీల మద్దతు ఉంది. బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ తర్వాత చాలా కష్టపడ్డాను. ప్రొడక్షన్ వ్యాల్యూస్, మ్యూజిక్, అన్ని విభాగాలు పనితీరు బ్రహ్మండంగా ఉండటంతోపాటు మంచి టీమ్ వర్క్‌తో సినిమాను పూర్తి చేశాం అని వీజే సన్నీ తెలిపాడు.

బిగ్‌బాస్‌కు ముందు సకల కళా వల్లభ అనే సినిమా చేశాను. బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత ఏటీఎం, అన్‌స్టాపబుల్ సినిమా చేశా. ఈ రెండు సినిమాలు ఒకే సమయంలో చేశాను. అందువల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ సౌండ్ పార్టీ సినిమాకు కొంత టైమ్ తీసుకొని చేశాను. ఈ సినిమాపై మరింత కాన్ఫిడెన్స్‌తో ఉన్నాను అని వీజే సన్నీ చెప్పాడు.
సౌండ్ పార్టీ సినిమా విషయానికి వస్తే.. తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్‌గా సాగే కామెడీ ఎంటర్‌టైనర్. ఫాదర్, సన్ ఫ్రెండ్స్‌గా ఉంటే ఎలాంటి అనుభూతి ఉంటుందనేది సినిమాలో ఉంటుంది. సెన్సార్ వాళ్లు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. రెండు గంటలపాటు హ్యాపీగా ఫీలవుతారు అని వీజే సన్నీ చెప్పాడు.
సౌండ్ పార్టీ సినిమాలో బిట్ కాయిన్ అనేది ఓ క్యారెక్టర్‌గా కథలో ట్రావెల్ అవుతుంది. మేము ఎంత కష్టపడ్డామో.. వర్చవల్ కరెన్సీ కాన్సెప్ట్ రూపంలో బిట్ కాయిన్ కూడా అంతే కష్టపడింది. అమెరికాలో ప్రీమియర్ వేశాం. అక్కడి వారు చూసి ఈ సినిమాకు మంచి ప్రశంసలు కురిపించారు. యాక్టర్ ఆలీతో కనెక్ట్ అయి బిట్ కాయిన్ ఎపిసోడ్ ఉంటుంది. తండ్రి, కొడుకుల మధ్య ఏం జరిగింది అనే విషయంలో కథ నడుస్తుంది అని వీజే సన్నీ చెప్పాడు.

సౌండ్ పార్టీ మూవీలో తండ్రి, కొడుకుల మధ్య బాండింగ్ మాత్రమే కాదు.. హీరోయిన్‌తో లవ్ ట్రాక్ ఉంటుంది. ఈ సినిమాలో నాకు సీక్రెట్ లవర్ ఉంటుంది. ఫన్నీగా క్యారెక్టర్ ఉంటుంది. నాకు హీరోయిన్‌గా ఆమని మేనకోడలు హృతిక శ్రీనివాస్ నటించింది. మా మధ్య మంచి రొమాంటిక్ ట్రాక్ ఉంటుంది అని తెలిపాడు.
గతంలో రెండు సినిమాల విషయంలో కొన్ని తప్పులు జరిగాయి. ఆ తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకొన్నాను. ఆ అనుభవాలతో సౌండ్ పార్టీ కోసం తగిన జాగ్రత్తలు తీసుకొన్నాం. కొన్నిసార్లు స్క్రిప్టు మీద ఉన్నది తెర మీదకు రాలేకపోతుంది. కానీ ఈ సినిమా విషయం స్క్రిప్టు ఏదైతే అనుకొన్నాం అదే వచ్చింది. పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా నేను దగ్గరుండి చూసుకొన్నాను. తప్పకుండా ప్రతీ ఒక్కరిని ఎంటర్‌టైన్ చేస్తుంది అని వీజే సన్నీ చెప్పారు.


Click it and Unblock the Notifications











