Agent Movie యాక్షన్ ఎపిసోడ్స్ థ్రిల్లింగ్.. ఆ ఎడారిలో నరకం చూశా.. డినో మారియా (ఇంటర్వ్యూ)
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఏజెంట్. ఈ చిత్రంలో సాక్షి వైద్య, ముమ్ముట్టి, డినో మారియా ప్రత్యేక పాత్రల్లో నటించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ అవుతున్నది.
హిప్ హాప్ తమీజా, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో జోష్ పెంచింది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా బాలీవుడ్ నటుడు డినో మారియా తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

ఈవిల్ క్యారెక్టర్‌లో గాడ్ పాత్రలో: ఏజెంట్ చిత్రంలో రీసెర్చ్ అనాలసిస్ వింగ్ (రా) ఏజెంట్‌గా నటిస్తున్నాను. రా వ్యవస్థపై తిరుగుబాటు చేసే ఏజెంట్. నా క్యారెక్టర్ పేరు గాడ్. ఏజెంట్‌గా పనిచేసే వ్యక్తి ఎందుకు రా సంస్థపై తిరుగుబాటు చేశాడు. గాడ్ క్యారెక్టర్‌ను సెట్ చేయడానికి మరో వ్యక్తిని ఎందుకు నియమించారు అనేది నా పాత్రకు సంబంధించిన అవుట్ లైన్.
ఈవిల్ క్యారెక్టర్ కోసం కొత్త లుక్‌ను డైరెక్టర్ సురేందర్ రెడ్డి డిజైన్ చేశారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా నా పాత్ర ఉంటుంది. అందుకే నా వరకు నేను ఏమీ చేయలేదు. డైరెక్టర్ చెప్పినట్టు చేసుకొంటూ పోయాను అని డినో మారియా చెప్పారు.
ఏజెంట్ కథ వినగానే థ్రిల్ అయ్యాను: డైరెక్టర్ సురేందర్ రెడ్డి స్క్రిప్టు గురించి చెప్పినప్పుడు నేను థ్రిల్ అయ్యాను. తెలుగులో నా తొలి చిత్రానికి ఏజెంట్ సినిమా ఫర్‌ఫెక్ట్ అని భావించాను. ఈ కథ, సన్నివేశాల డిజైన్ బాగుంది. డార్క్ విలన్ రోల్‌ను చాలా చక్కగా డిజైన్ చేశారు.
రా సంస్థపై ఎందుకు తిరుగుబాటు చేశారే కోణంలో నా పాత్ర ఉంటుంది. కానీ నాకు తెలుగు భాషనే ప్రాబ్లెం. అయినప్పటికీ.. డైలాగ్స్ అన్ని నేర్చుకొని సెట్లో యాక్టింగ్ చేశాను. భాష నేర్చుకోవడం నాకు కష్టం కాదు అని డినో మారియా తెలిపారు.

రా సిస్టమ్‌పై ప్రతీకారం: ఏజెంట్ సినిమాలో నా పాత్ర పేరు గాడ్. రా సిస్టమ్ చేసిన మోసానికి బలైన వ్యక్తి పాత్రలో కనిపిస్తాను. నాకు జరిగిన మోసానికి.. ఈ సిస్టమ్‌ను క్రియేట్ చేసిన మమ్ముట్టిపై పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. నా పాత్ర గురించి చెబితే.. పఠాన్ చిత్రంలో జాన్ అబ్రహం పాత్ర మాదిరిగా అనిపిస్తుంది. కానీ కథ డిఫరెంట్.
పఠాన్ సినిమాలో మాదిరిగానే ఏజెంట్ మూవీలో ముగ్గురు ఏజెంట్ల మధ్య జరిగే కథ. కానీ బ్యాక్ డ్రాప్ వేరు. నా పాత్ర చాలా మ్యాడ్‌గా ఉంటుంది. లార్జ్ స్కేల్‌లో సురేందర్ రెడ్డి నా పాత్రను డిజైన్ చేశారు. నేను చేసిన కొద్ది ఇంకా కావాలని అడిగే వారు అని డినో మారియా అన్నారు.
తెలుగు భాష నేర్చుకొన్నా: నేను నటించే సినిమాలో కథ బాగుందా... నా క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్‌గా ఉందా? అని చూస్తాను. ఆ తర్వాత ప్రొడక్షన్ హౌస్, డైరెక్టర్, మమ్ముట్టి, అఖిల్ అక్కినేని ఉండటంతో ఏజెంట్ సినిమా చేశాను. సినిమాలో కథ, స్టార్ కాస్టింగ్, ప్రొడక్షన్ బాగా ఉంటే.. ఆ సినిమా తప్పకుండా రిలీజ్ అవుతుందనే నమ్మకం ఉంటుంది.
ఈ సినిమా కోసం లిప్ సింకింగ్ కష్టమైంది. డైలాగ్ పేపర్స్ ఇస్తే.. వాటిని మొత్తం చదువుకొని సెట్ లోకి వెళ్తే.. డైరెక్టర్ డైలాగ్స్ మార్చేశానని చెప్పేవారు. దాంతో రాత్రంతా డైలాగ్స్ పట్టిన శ్రమంతా వేస్ట్ అయ్యేది. అందుకే నేను డైలాగ్స్ బట్టి పట్టడం మానేశాను. అని డినో మారియా తెలిపారు.

బుడాపెస్ట్, ఓమన్ ఎడారిలో నరకం: యాక్షన్ సీన్లలో నటించడం నరకంగా అనిపించేది. బుడాపెస్ట్‌లో చలిలో నాలుగు, ఐదు లేయర్లు ఉండేలా షర్ట్స్ వేసుకొనే వాడిని. బుడాపెస్ట్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత సెట్‌లో ఏసీ ఉన్నా గానీ.. ఉక్కబోతతో టార్చర్‌గా ఉండేది.
ఇక ఓమన్‌లోని ఎడారిలో 40 డిగ్రీల ఎండలో నాలుగు, ఐదు షర్ట్స్, లాంగ్ కోట్ వేసి షూట్ చేసేవారు. లోపల చెమటలతో బాడీ మొత్తం తడిచిపోయేది. చివరకు కాళ్ల నుంచి చెమట కారి షూస్‌లోకి వెళ్లేది. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సినిమా షూట్ చేశాం అని డినో మారియా వెల్లడించారు.


Click it and Unblock the Notifications











