నువ్వేమైనా అల్లు అర్జున్‌వా? ప్రభాస్‌వా? యువ హీరోపై నోరుపారేసుకొన్న బ్రహ్మాజీ!
సినిమా పరిశ్రమలో మూవీ తీయడం ఒక ఎత్తు.. ఆ సినిమాను విడుదల చేయడం పెద్ద టాస్క్ అనేది నిర్మాతకు చక్కగా తెలుస్తుంది. ఈ రెండింటికి మించి తీసిన సినిమాను ప్రేక్షకుడి వద్దకు తీసుకెళ్లడం అంతకు మించిన టాస్క్ మరోటి ఉండదనేది అందరికి తెలిసిందే. తమ సినిమా ప్రమోషన్స్ కోసం రకరకాల వ్యూహాలు పన్నుతుంటారు. అయితే త్వరలోనే విడుదల కానున్నద జిబ్రా సినిమా కోసం చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో బ్రహ్మాజీ, సత్య దేవ్ మధ్య జరిగిన సంభాషణ గురించిన వివరాల్లోకి వెళితే..
సత్యదేవ్ ఇంట్లోకి ప్రవేశించి బ్రహ్మాజీ గొడవ చేశాడు. అమ్మాయిలేంటి? డ్యాన్సులేంటి? అంటూ అరిస్తుంటే.. కంగారు పడిన సత్యదేవ్ మెల్లగా ఇంట్లోకి తీసుకెళ్లి కుర్చీ వేసి కూర్చోబెట్టారు. దాంతో నువ్వు డ్యాన్సులు వేస్తావా? అని బ్రహ్మాజీ అంటే.. ఏదో హుక్ స్టెప్ వేశాను అంటే.. హుక్కా బోక్కా.. అల్లు అర్జున్ వేస్తే ఎవరైనా చూస్తారేమో అంటూ సైటెర్ వేశాడు.

మీరు తీసిని జిబ్రా చూడటానికి క్యూ కట్టి జనాలు వేస్తారా? అని బ్రహ్మాజీ అంటే.. నేను సినిమా గురించి చెబుతాను విను. మా సినిమాలో రవి బస్రూర్ మ్యూజిక్ అని.. కేజీఎఫ్, సలార్ చెబుతుండగానే..ఆపి ఓ వెటకారంగా బ్రహ్మాజీ నవ్వాడు. ఆయన మీ సినిమాకు మ్యూజిక్ చేశాడా? ఊరికే పేర్లు వేసుకొంటున్నారా? అని బ్రహ్మాజీ అంటే.. మీ మాదిరిగా ట్వీట్లు వేసి డిలీట్ చేయం అని సత్యదేవ్ కౌంటర్ ఇచ్చాడు.
జిబ్రా ప్రమోషన్స్‌కు మీ హీరోయిన్లే రావడం లేదు అని బ్రహ్మజీ అంటే.. ప్రియా భవానీ శంకర్ న్యూజిలాండ్‌లో ఉంది. త్వరలోనే ప్రమోషన్స్‌కు వస్తుంది అని సత్యదేవ్ అంటే.. బాగా కవరింగ్ చేస్తున్నావు. ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుందిలే అంటూ బ్రహ్మాజీ కామెంట్ చేశాడు. దాంతో సత్యదేవ్ షాక్ తిన్నాడు. అంతలోనే కళ్ల జోడు తీసేయ్.. నీవు ఏమైనా ప్రభాస్‌వా? కళ్ల జోడు పెట్టుకొని ఇంటర్వ్యూ చేస్తూ బిల్డప్ ఇస్తున్నావు అంటూ బ్రహ్మాజీ అన్నాడు. ఇది ప్రాంక్ వీడియో ఇంటర్వ్యూ తమాషాగా జరిగింది.

టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. జీబ్రా మూవీ నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. ఇటీవల సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు.


Click it and Unblock the Notifications











