Priya Prakash Varrier: మల్లు హీరోతో ప్రియా వారియర్ ఎఫైర్.. అసలు సంగతి చెప్పేసిందిగా!

కన్ను గీటి దేశవ్యాప్తంగా పాపులర్ ‍‍అయిన మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్. ఓవర్‌నైట్‌లో యూత్ లో పాపులారిటీని సంపాదించుకున్న ఈ భామ.. ఆ తర్వాత పలు చిత్రాలు చేసినా అవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఈ క్రమంలోనే ఆమె ఓ మలయాళీ హీరోతో ప్రేమలో ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఫిల్మీబీట్‌తో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. ఆ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది. వివరాళ్లోకి వెళితే..

అలా కన్నుగీటి ఇలా కుర్రాళ్ల గుండెళ్లో మంటలు రేపిన అందం ప్రియా ప్రకాశ్ వారియర్ సొంతం. అనతికాలంలోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తొలి సినిమాతోనే ఊహించనంత పాపులారిటీని సంపాదించుకుంది. అయితే ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోపోయినప్పటికీ తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాల్లోనూ వరుసగా అవకాశాలను దక్కించుకుంది. కేవలం ఆమె కోసం సినిమా చూసేందుకు యూత్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపారు.

Bro movie Heroine Priya Prakash Varrier Clarity on her affair with mallu Hero

తెలుగులో నో హిట్: అయితే తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసినప్పటికీ పెద్దగా హిట్లేమి రాలేదు. హీరో నితిన్ తో 'చెక్', తేజా సజ్జాతో 'ఇష్క్' చిత్రాల్లో నటించి ఆకట్టుకోవడానికి ప్రయత్నించింది. అయితే ఈ రెండు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇవి కాకుండా మలయాళంలో ఓ మూడు చిత్రాల వరకు చేసింది. కానీ అవి ఏమంత చెప్పుకోద్దగ స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించలేదు.

Bro movie Heroine Priya Prakash Varrier Clarity on her affair with mallu Hero

త్వరలోనే 'బ్రో' సినిమాతో: అయితే మళ్లీ రెండేళ్ల తర్వాత తెలుగులో మరో సినిమా చేసింది. ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సాయి తేజ్ తో కలిసి మల్టీస్టారర్ 'బ్రో' సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఇప్పుడీ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ప్రస్తుతం ఈ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకుంది ప్రియ. ఈ చిత్రంతో హిట్ కొట్టి తెలుగులో మరిన్ని అవకాశాలను దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది.

Bro movie Heroine Priya Prakash Varrier Clarity on her affair with mallu Hero

లవ్ ఎఫైర్స్ పై స్పందన: సినిమా రిలీజ్ కు దగ్గర పడడంతో తాజాగా ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. ఇందులో భాగంగా సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మీబీట్‌ ఎడిటర్ రాజా బాబు చేసిన ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆయన అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలోనే లవ్ అఫైర్స్ అంటూ తనపై వచ్చిన రూమర్స్ గురించి కూడా మాట్లాడింది.

ఓ మలయాళీ హీరోతో ఆమె లవ్ లో ఉన్నట్లు వచ్చిన వార్తలపై స్పందించింది. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని అందులో ఎటువంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. 'గాసిప్స్ చాలా వస్తుంటాయి. అందులో ఎటువంటి నిజం లేదు' అని చెప్పుకొచ్చింది. 'బ్రో' సినిమాలోని 'మార్కేండయ' పాట తన ఫేవరెట్ సాంగ్ అని చెప్పింది.

Bro movie Heroine Priya Prakash Varrier Clarity on her affair with mallu Hero

తెలుగులో మరిన్ని చేయాలని: తాను ప్రస్తుతం హిందీలో పలు చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపింది. మలయాళంలో మరిన్ని చిత్రాలు నటించేందుకు ఫోకస్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. తెలుగులో 'బ్రో' చిత్రం తర్వాత మరిన్ని సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. ఇండస్ట్రీలో తాను కొనసాగడానికి కారణం తన తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం, మద్దతే కారణమని తెలిపింది. ఇంకా పలు విషయాలు గురించి కూడా మాట్లాడింది.

హిందీలో జోరు: ఇక ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.. హిందీలో ఆమె చాలా అవకాశాలను దక్కించుకుంది. '3 మంకీస్', 'లవ్ హ్యాకర్స్', 'శ్రీదేవి బంగలా', 'యారియాన్ 2'.. నాలుగు చిత్రాల్లో నటిస్తోంది. ఇక కన్నడలో 'విష్ణు ప్రియ' అనే మూవీ చేస్తోంది. ఇవన్నీ చిత్రీకరణలు జరుపుకుంటున్నాయి. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. హాట్ ఫొటోషూట్స్ చేస్తూ యూత్ లో హీట్ పుట్టిస్తుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X