twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాకు ఆ లోపం.. అందుకే నాకు పెళ్లికి దూరం.. సీక్రెట్ బయటపెట్టిన క్యాథరీనా

    |

    అందాలభామ క్యాథరీనా త్రెసా విభిన్నమైన పాత్రలను ఎంచుకొంటూ దూసుకెళ్తున్నది. ఆ మధ్యలో సరైనోడు సినిమాలో ఎమ్మెల్యేగా నటించి ఆకట్టుకొన్నది. ఈ క్రమంలో తమిళంలో మంచి ఆఫర్లు కొట్టేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైంది. తాజాగా వదలడు అనే మూవీలో హీరో సిద్ధార్థ్‌తో నటించింది. ఈ సినిమా అక్టోబర్ 11వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో మీడియాతో ముచ్చటించింది. క్యాథరీనా చెప్పిన విషయాలు మీకోసం..

    కల్తీ ఆహార పదార్థాల బ్యాక్ డ్రాప్‌తో

    కల్తీ ఆహార పదార్థాల బ్యాక్ డ్రాప్‌తో

    వదలడు సినిమాలో నాకు కథ బాగా నచ్చింది. కల్తీ ఆహారపదార్థాల నేపథ్యంగా ఈ సినిమా రూపొందింది. కల్లీ పదార్థాల వల్ల చాలా మంది రోగాల బారిన పడుతున్నారనే యాంగిల్‌లో కథ నడుస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటుంది. ఈ సినిమాలోని సందేశం అందర్నీ రీచ్ కావాలి.

    వదలడు హారర్ సినిమా కాదు..

    వదలడు హారర్ సినిమా కాదు..

    వదలడు అనేది పక్కా హారర్ సినిమా కాదు. పిల్లలు భయపడే హారర్ కనిపించదు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో అదృశ్య శక్తుల నేపథ్యంగా కథ సాగుతుంది. ఈ సినిమా గురించి వికీపీడియాలో హారర్ కామెడీ అని రాశారు. అది చాలా తప్పు. ఈ సినిమా చాలా ఎంజాయ్ చేసే సినిమా. ఈ సినిమాలో ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్‌గా సిద్ధార్థ నటించారు.

    తెలుగులో తక్కువ సినిమాలు చేయడానికి

    తెలుగులో తక్కువ సినిమాలు చేయడానికి

    నేను తెలుగులో తక్కువ సినిమాలు చేయడానికి ఓ కారణం ఉంది. మంచి పాత్రలు వస్తేనే చేస్తున్నాను. సరైనోడు సినిమా తర్వాత కథా నేపథ్యం ఉన్న పాత్రల కోసం చూస్తున్నాను. అందుకే సినిమాలు తగ్గినట్టు కనిపిస్తున్నాయి. రొటీన్ పాత్రలు చేస్తే ప్రేక్షకులు బోర్ అయిపోతారు. అందుకే సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాను అని క్యాథరీనా త్రెసా వెల్లడించారు.

    తమిళంలోనే మంచి పాత్రలు

    తమిళంలోనే మంచి పాత్రలు

    తెలుగులో కంటే తమిళంలో ఎక్కువగా సినిమాలు చేయడానికి అక్కడ నాకు ఆఫర్ చేస్తున్న పాత్రలు బాగున్నాయి. విభిన్న రకాల పాత్రలు ధరించగల నటి అనే పేరు తెచ్చుకోవాలనుకొంటున్నాను. తమిళంలో గ్లామర్ లేని పాత్రలు చేస్తున్నాను. మద్రాస్ లాంటి సినిమాల్లో నా పాత్రలు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి అని క్యాథరీనా తెలిపారు.

    నాకు భాష ముఖ్యం కాదు

    నాకు భాష ముఖ్యం కాదు

    స్క్రిప్లు బాగా ఉంటే భాష నాకు ముఖ్యం కాదు. హీరో సిద్ధార్థ్ నాకు ముందు నుంచి పరిచయం ఉంది. ఆయన సోషల్ మీడియాలో స్పందించే విధానం నాకు నచ్చుతుంది. పాజిటివ్ అంశాలు ఎక్కువగా ఉన్నాయి. సామాజిక అంశాలపై స్పందించే విజయ్ దేవరకొండ, సిద్ధార్థ్ నాకు బాగా నచ్చుతారు అని క్యాథరీనా పేర్కొన్నారు.

    నాకు వాసన పసిగట్టలేని లోపం

    నాకు వాసన పసిగట్టలేని లోపం

    వదలడు అనే చిత్రంలో నా క్యారెక్టర్ పేరు జ్యోతి. టీచర్‌గా పనిచేస్తాను. పుట్టినప్పట నుంచే వాసన పసిగట్టే శక్తి ఉండదు. మధ్య తరగతి యువతిగా నటిస్తున్నాను. నా తండ్రి ఎప్పుడూ పెళ్లి చేయాలా? అని అడుగుతుంటారు. కానీ వాసన పసిగట్టకపోవడం అనే లోపంతో బాధపడతున్న నాకు పెళ్లి అయితే నా పిల్లలను సరిగా చూసుకొంటానా అనే సందేహంతో ఉంటాను. అంతేకాకుండా నేను పనిచేసే స్కూల్‌లో పిల్లలు బాగుపడాలనే లక్ష్యంతో ఉంటాను అని క్యాథరీనా త్రెసా అన్నారు.

    English summary
    Catherine Tresa is coming with Vadaladu movie. Siddharth is the hero, directed by Rajasekhar. This movie set to release on October 11th. In this occassion, she speaks to media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X