‘అల్లు అర్జున్, ఎన్టీఆర్ అంటే పిచ్చి.. నాగార్జునను చూస్తే అలాంటి ఫీలింగ్’
బర్కత్ స్టూడియోస్ బ్యానర్‌పై అదితి సోని నిర్మాతగా టీజీ కీర్తీకుమార్ దర్శకత్వం వహించిన చిత్రం చారీ 111. టాప్ కమెడియన్ వెన్నెల కిషోర్, యువ హీరోయిన్ సంయుక్త విశ్వనాథన్ నటించిన ఈ చిత్రం ప్రమోషన్స్ కార్యక్రమాలకు భారీ స్పందన లభిస్తున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఫిల్మీబీట్ తెలుగుతో హీరోయిన్ సంయుక్త తన అనుభవాలను పంచుకొన్నది. ఈ మూవీకి సంబంధించిన కంటెంట్ చేస్తున్న సందడి.. అలాగే సంయుక్త చెప్పిన వివరాల్లోకి వెళితే..
చారీ 111 సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా థీమ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఒక కన్ను భూగోళం.. ఓ కన్ను ఆకాశం.. విశ్వాన్ని వెతికేద్దాం. శకలాలు తొలిచేద్దాం అంటూ సంజిత భట్టాచార్య రూపొందించిన ఈ పాట విడుదలైన వెంటనే సంగీతాభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా చార్ట్‌బస్టర్‌లో టాప్‌గా ట్రెండ్ అవుతున్నది.
థీమ్ ఆఫ్ చారీ 111 పాటలో ఆపరేషన్ రుద్రనేత్ర గురించి చెప్పే అంశాలను సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి భావోద్వేగమైన సాహిత్యాన్ని అంించారు. ఈ పాటను సంజీత భట్టాచార్య ఆలపించగా.. సైమన్ కే కింగ్ సంగీతం అందించారు. మంచి మాస్ బీట్‌తో సాగే పాట ట్రెండింగ్ అవుతున్నది.

ఛారీ 111 సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ సంయుక్త విశ్వనాథన్ మాట్లాడుతూ.. వెన్నెల కిషోర్ లాంటి టాలెంటెడ్ యాక్టర్‌తో నటించడం చాలా హ్యాపీగా ఉంది. తెలుగు సినిమా పరిశ్రమలో నాకు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున గారంటే చాలా ఇష్టం. మా ఇంటిలో మా అమ్మకు నాగార్జున చాలా ఇష్టం. ఆయన ఈ తరం నటీనటులకు ఇన్సిపిరేషన్‌గా ఉంటారు అని అన్నారు.
హీరోయిన్ల విషయానికి వస్తే.. సమంత అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఆమె యువ తారలకు స్పూర్తిని ఇచ్చే హీరోయిన్. అలాగే అనుష్క, తమన్నా ఇలా చాలా మంది నాకు ఆదర్శం. నాకు అవకాశం ఇస్తే.. ఇలా చాలా పేర్లు చెప్పుకొంటూ వెళ్తాను. నటిగా నాకు అత్యంత స్పూర్తిని రగిలించే వ్యక్తి సూపర్ స్టార్ రజనీకాంత్ అని అన్నారు.


Click it and Unblock the Notifications











