ఆ డ్రస్‌తోనే గూస్‌బంప్స్.. వైఎస్ఆర్ తరహా క్యారెక్టర్ డిఫరెంట్ వైబ్.. చైతన్య రావు

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సోనీ లివ్ (Sony Liv) అందిస్తున్న డిఫరెంట్ వెబ్ సిరీస్‌తో మయ సభ. రైజ్ ఆఫ్ ది టైటాన్స్ ట్యాగ్ లైన్. సామాజిక స్పృహతోపాటు సెన్సేషనల్ కంటెంట్‌తో సినిమాలు రూపొందించే దేవా కట్టా షో రన్నర్‌గా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో రూపొందింది. హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష రూపొందించారు. ఈ వెబ్ సిరీస్‌ ఆగస్టు 7వ తేదీన స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో దర్శకుడు దేవా కట్టా.. హీరోలు ఆది పినిశెట్టి, చైతన్య రావు ఫిల్మీబీట్‌ ఎడిటర్ రాజబాబు అనుములతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆది పినిశెట్టి మాట్లాడుతూ..

Chaitanya Rao in Mayasabha

స్టోరీ చెప్పడాని కంటే ముందు నన్ను ఆడిషన్‌కు పిలిచారు. సోని లీవ్‌కు డైరెక్టర్ దేవ కట్టా వెబ్ సిరీస్ చేస్తున్నారు. దాని కోసం ఆడిషన్‌కు రమ్మని చెప్పగానే..చాలా నెర్వస్‌గా, ఎక్సైటింగ్‌గా ఫీలయ్యాను. అప్పటి వరకు నేను తరుణ్ భాస్కర్ తప్పా పెద్ద డైరెక్టర్లతో వర్క్ చేయలేదు. దేవ కట్టా తీసిన వెన్నెల సినిమాకు నేను పెద్ద ఫ్యాన్‌ను. అలాంటి దర్శకుడితో సినిమా ఆఫర్ అనగానే థ్రిల్ అయ్యాను. వెన్నెల తర్వాత ప్రస్థానం.. ఆటో నగర్ సూర్య, రిపబ్లిక్ లాంటి సినిమాలు చేసిన డైరెక్టర్‌ కాల్ చేశారంటే సర్‌ప్రైజ్ అయ్యాను. లైఫ్‌లో ఇంత పెద్ద డైరెక్టర్‌తో వర్క్ చేయడమా? అనే సంతోషం కలిగింది అని చైతన్య రావు చెప్పారు.

దేవ కట్టాను కలవడగానే.. ఆడిషన్ గురించి చెప్పారు. నాకు చెప్పిన క్యారెక్టర్ గురించి విన్న తర్వాత నిజంగా ఛాలెంజింగ్ అనిపించింది. ఆడిషన్ పూర్తి అయిన తర్వాత నాకు కావాల్సిన ఎంఎస్ఆర్ దొరికాడు అని అన్నారు. అప్పటి నుంచి నేను ఓ బాధ్యతతో కూడిన ప్రయాణం చేశాను. మయసభ రిలీజై ప్రేక్షకులు ప్రశంసలు కురిపించే వరకు అదే రెస్పాన్స్‌తో ఉంటాను. ఈ 6 గంటల వెబ్ సిరీస్ చేయడమంటే.. మూడు సినిమాలు చేసినంత బరాబర్. ఇంత నిడివి ఉన్న క్యారెక్టర్‌ను అన్ని రకాల ఎమోషన్స్‌ చేయడమంటే మాములు విషయం కాదు. ఈ సిరీస్ ఆఫర్‌తో నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చైతన్య రావు అన్నారు.

ఎంఎస్ఆర్ క్యారెక్టర్‌ కోసం ఆ డ్రస్ వేసుకోగానే.. తెలియని హుందాతనం వచ్చింది. ఒకసారి నేను పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేసినప్పుడు.. అది కొందరికి వైఎస్ఆర్ అనిపించినా సరే.. ఆ డ్రస్ వేసుకొన్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. ఆ పంచెకట్టు.. తలపాగా చుట్టుకొన్నప్పుడు ఆ వైబ్ డిఫరెంట్. నా గెటప్ చూసిన ఓ డైరెక్టర్ కాల్ చేసి.. నీ గెటప్ బాగుంది. దిష్టి తీయించుకో చైతన్య అని అన్నారు. ఆ క్యారెక్టర్‌ కోసం దేవ కట్టా చాలా జాగ్రత్తలు తీసుకొన్నాడు. మీసకట్టులో చిన్న తేడా అనిపించినా ఆయన సహించకపోయేవారు అని చైతన్య రావు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X