శ్రీ కృష్ణ భగవానుడు ఉన్నాడా? కార్తీకేయ సినిమాకు అదే జస్టిఫికేషన్.. డైరెక్టర్ చందు మొండేటి (Interview)

శ్రీ కృష్ణ భగవానుడి కథా నేపథ్యంగా కార్తీకేయ 2 సినిమా రూపొందింది. గతంలో మంచి విజయాన్ని అందుకొన్న కార్తీకేయ మూవీ సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అంచనాలను పెంచేసింది. కార్తీకేయ సినిమాకు సీక్వెల్‌గా వస్తుందంటే ప్రేక్షకులు భారీగా అంచనాలు పెంచుకొంటారు. అలాంటి అంచనాలకు తగినట్టుగా కథను రెడీ చేసుకొన్నాను. కార్తీకేయ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచిందో.. అంతకంటే ఎక్కువ ఫీల్‌ను ఈ సినిమా అందిస్తుంది అని చందు మొండేటి అన్నారు. ఇంకా కార్తీకేయ 2 సినిమా గురించి చందూ మొండేటి మాట్లాడుతూ..

ఇతిహాసాలంటే చిన్నప్పటి నుంచి ఇష్టం

ఇతిహాసాలంటే చిన్నప్పటి నుంచి ఇష్టం


కార్తీకేయ సినిమా విషయాన్ని పక్కనే పడితే.. నాకు చిన్నతనం నుంచే పురాణాలు, నిధులు, పద్మనాభస్వామి లాంటి అంశాలు నాకు ఇష్టం. నేను సుందరకాండ, మహాభారతం లాంటి ఇతిహాసాలు చదువుకొన్నాను. ఏదైనా అంశం కనిపిస్తే పరిశోధన చేయడం నాకు హాబీ. శ్రీకృష్ణుడు జీవితం అనంతం. భాగవతంలో శ్రీకృష్ణుడిని చూసిన విధానం ఒక మ్యాజిక్ ఉంది. కానీ శ్రీకృష్ణుడు అమాంతం పెరగడం మ్యాజిక్ కాదు. ఆయనలో అంతు చిక్కని శక్తి ఉంది. అలాంటి సంఘటనలు తీసుకొని కథ అనుకొన్నాను. ఆ పాయింట్ తట్టిన వెంటనే నిఖిల్‌కు చెప్పాను అని చందు మొండేటి తెలిపారు.

ఇతిహాసాల కథల వెనుక సైంటిఫిక్ రీజన్

ఇతిహాసాల కథల వెనుక సైంటిఫిక్ రీజన్


సోషియో, ఫాంటసీ కలిపి కార్తికేయ 2 చేశాను. ప్రతీ అంశానికి ఓ కారణం ఉంటుంది. సినిమాకు తప్పకుండా జస్టిఫికేషన్ ఉంది. శ్రీకృష్ణుడు అంటే ఎవరు? కర్మ సిద్దాంతం లాంటి అంశాలతో కథ సాగుతుంది. ఇతిహాసాల వెనుక ఓ సైంటిఫిక్ రీజన్ ఉంది. కానీ దానిని ఛేజించలేం. అడ్వంచర్ సినిమాగా సాగుతుంది. కార్తీకేయ సినిమా చూడని వారికి కూడా కార్తీకేయ 2 సినిమా నచ్చుతుంది అని చందు మొండేటి వెల్లడించారు.

ఆ క్యాప్షన్ పెట్టడానికి కారణం

ఆ క్యాప్షన్ పెట్టడానికి కారణం

కృష్ణ ఈజ్ ట్రూత్ అనేది క్యాప్షన్ వెనుక కారణం ఉంది. కృష్ణుడు ఉన్నాడా లేదా అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి. ద్వారకలో ఆ నగరం ఉందా అను అనుమానం ఉంది. అలాంటి సందేహాలకు నివృత్తి చేసే విధంగా కథ రాసుకొన్నాం. క్యాప్షన్ పెట్టే ముందు ఎవరిని సంప్రదించలేదు. దేవుడు నమ్ముతున్నామంటే.. ఒక క్రమశిక్షణ. దేవుడు ఉన్నాడంటే.. భయంతో తప్పులు చేయం. దేవుడికి దండం పెడితే.. ఒక పాజిటివ్. దేవుడు మంత్రాలు చదవడమనేది ఒక మెడిటేషన్ లాంటిది అని చందు మొండెటి చెప్పారు.

యానిమేషన్స్, గ్రాఫిక్స్‌ గురించి

యానిమేషన్స్, గ్రాఫిక్స్‌ గురించి

కార్తీకేయ 2 సినిమాను నిఖిల్‌తోనే చేయాలని అనుకొన్నాను. కార్తీకేయ క్యారెక్టర్‌తోనే ఈ కథను చెబితే వర్కవుట్ అవుతుందని నమ్మాను. ఈ సినిమాలో గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ అంశాలు ఛాలెంజ్‌గా నిలిచాయి. యానిమేషన్, గ్రాఫిక్స్ ఆకట్టుకొనేలా ఉంటాయి. అయితే మేము బడ్జెట్ పరిధిలోనే చేశాం. కథ రాసుకొన్న తర్వాత మాకున్న బడ్జెట్‌లో తీయడానికి ప్రీ ప్రొడక్షన్‌ను పక్కాగా ప్లాన్ చేశాం. ఈ సినిమా ఆలస్యం కావడం వల్ల బడ్జెట్ ఏమీ పెరుగలేదు. వడ్డీలు పెరగడం జరిగింది అని చందు మొండేటి అన్నారు.

అనుపమ్ ఖేర్‌ను ఎందుకు తీసుకొన్నామంటే?

అనుపమ్ ఖేర్‌ను ఎందుకు తీసుకొన్నామంటే?


కార్తీకేయ 2 సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్‌ది కీలకమైన పాత్ర. ఆయన సినిమాలోకి వచ్చే సమయానికి కథ హిమాలయల వద్ద జరుగుతుంటుంది. మా కథా నేపథ్యానికి అనుపమ్ కచ్చితంగా సరిపోతుంది. అంతేకాకుండా పాన్ ఇండియా సినిమా చేసినప్పడుు అక్కడి ప్రేక్షకులకు ఆ పాత్ర కనెక్షన్ యాప్ట్‌గా ఉంటుంది. సినిమా చూసిన తర్వాత అందరూ అనుపమ్ ఖేర్ పాత్ర గురించి మాట్లాడుకొంటారు. ఆయన నుంచి మేము చాలా నేర్చుకొన్నాం అని చందు మొండేటి చెప్పారు.

5 ఏళ్ల నుంచి 15 ఏళ్లలోపు పిల్లలు

5 ఏళ్ల నుంచి 15 ఏళ్లలోపు పిల్లలు


కార్తీకేయ సినిమా 5 ఏళ్ల వయసు నుంచి 15 ఏళ్ల లోపు ఉన్నవారు చూస్తే నాకు హ్యాపీగా ఉన్నాయి. సినిమాలో రెండు మూడు ఎపిసోడ్స్ అద్బుతంగా ఉంటాయి. పిల్లలకు ఇతిహాసాల గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం చేశాం. కార్తికేయ 1, కార్తీకేయ 2 రెండు అడ్వెంచర్ కాన్సెప్ట్‌తో నే తీయడం జరిగింది. ఇందులో కార్తీక్ ఘట్టమనేని విజువల్స్ బాగుంటాయి. కాలభైరవ మ్యూజిక్ హైలెట్‌గా ఉంటుంది.అలాగే టెక్నిషియన్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X