Just In
- 19 min ago
నగ్నంగా జాన్ అబ్రహం.. దిడ్డు అడ్డం పెట్టుకొని సెక్సీగా..
- 36 min ago
ఎదురుచూపులకు తెర.. గుడ్ న్యూస్ చెప్పిన అభిజిత్.. పులి వేట మొదలు!
- 41 min ago
ఐశ్వర్యరాయ్‌ను అచ్చుగుద్దినట్టు.. జిరాక్స్ కాపీలా ఉన్న సుందరి ఎవరో తెలుసా?
- 1 hr ago
భర్త పక్కన ఉండగానే శ్రీయకు షాక్.. గుండె అరచేతిలో పట్టుకొని భయంతో..
Don't Miss!
- News
యూపీలో మరో దారుణం... పశుగ్రాసం కోసం వెళ్లి శవమైన బాలిక... అత్యాచార ఆరోపణలు...
- Sports
ఏయ్ మళ్లీ ఏసేసాడు.. మొతెరా పిచ్‌ను వదలని మైకేల్ వాన్!
- Lifestyle
లైంగిక సంపర్కం సమయంలో మహిళలు చేసే ఈ పనులు పురుషులను ఉద్వేగానికి గురి చేస్తుంది!
- Automobiles
2021 ఫిబ్రవరిలో పుంజుకున్న మహీంద్రా ట్రాక్టర్ అమ్మకాలు.. కారణం ఇదేనా!!
- Finance
భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు, సెన్సెక్స్ 50,000 క్రాస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నితిన్‌తో అలా కోరిక తీరింది.. చెక్ పక్కా కమర్షియల్ సినిమా.. దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి
ఐతే నుంచి మనమంతా వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వస్తున్న చిత్రం చెక్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై నితిన్ హీరోగా, ప్రియా ప్రకాశ్ వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 26వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి ఫిల్మీబీట్ తెలుగుతో మాట్లాడుతూ..

గ్యాప్ ఎందుకు వచ్చిందంటే
చాలా గ్యాప్ వచ్చిన విషయం నిజమే. కానీ రెండు, మూడు కథలు అనుకొని వర్క్ చేశాం. కానీ అవి సెట్స్ మీదకు వెళ్లకపోవడంతో ఈ గ్యాప్ వచ్చింది. ఇక చెక్ కథ దాదాపు పదేళ్ల క్రితం నుంచి నా మైండ్‌లో ఉంది. రకరకాలుగా మార్పులు చెంది చెక్‌గా మారింది. ఈ సినిమా ఓ ఒక్క వర్గానికి చెందిన సినిమా కాదు. అన్ని వర్గాలు ఆదరించే విధంగా చెక్ ఉంటుంది. ప్రతీ డిపార్ట్‌మెంట్ ప్రతిభ అందర్ని ఆకట్టుకొంటుంది అని ఏలేటి చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

ఉరిశిక్ష ఎందుకు పడిందంటే
అద్భుతమైన తెలివితేటలు ఉన్న ఓ యువకుడికి ఉరిశిక్ష పడుతుంది. అనాథగా పెరిగిన ఆ యువకుడు జైలు నాలుగు గోడల మధ్య బందీ అవుతాడు. అపారమైన నాలెడ్జ్ ఉన్న ఆ యువకుడికి జైలుశిక్ష ఎందుకు పడింది. జైలులో ఆ యువకుడు ఏం చేశాడనే పాయింట్ మీద కథ నడుస్తుంది. 70 శాతం కథ జైలులోనే కొనసాగుతుంది అని చంద్రశేఖర్ ఏలేటి పేర్కొన్నారు.

చెక్‌కు బీజం ఎక్కడ పడిందంటే..
చెక్ సినిమాకు ఎక్కడ బీజం పడిందో చెప్పడం కష్టం. ఈ కథకు మూలం, స్పూర్తి ఎక్కడ నుంచి వచ్చిందో ఇప్పుడు గుర్తు లేదు. చెక్ సినిమాకు ముందు నితిన్‌తో మూవీ చేయాలని ప్రయత్నించాం. కొన్ని కారణాల వల్ల సినిమా పట్టాలెక్కలేదు. దాంతో చెక్ సినిమాతో నితిన్ కాంబినేషన్ కుదిరింది. నితిన్‌తో ఎప్పటి నుంచి చేయాలనే కోరిక ఇలా తీరింది అని చంద్రశేఖర్ ఏలేటి వెల్లడించారు.

రకుల్ ప్రీత్ లాయర్‌గా
చెక్ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ లాయర్‌గా కనిపిస్తున్నది. ఈ సినిమాలో రకుల్ పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ పాత్ర గురించి చెప్పగానే ఆమె చేయడానికి వెంటనే ఒప్పుకొన్నారు. తప్పకుండా రకుల్ పాత్ర అందర్ని ఆకట్టుకొంటుంది అని చంద్రశేఖర్ ఏలేటి తెలిపారు.

ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రేమికురాలిగా
ఇక ప్రియా ప్రకాశ్ వారియర్ విషయానికి వస్తే.. యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. ఈ చిత్రంలో నితిన్‌కు ప్రేమికురాలిగా నటిస్తున్నారు. షూటింగులో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ ఇవ్వమన్నా క్షణాల్లో ఇచ్చారు. అమ్మాయి మంచి సింగర్ కూడా. అద్భుతంగా పాడుతుంది. ఈ చిత్రంలో ప్రియా ప్రకాశ్ వారియర్ తప్పకుండా తన అందంతో ఆకట్టుకోవడం గ్యారెంటీ అని చంద్రశేఖర్ ఏలేటి తెలిపారు.

చెస్‌ను ఎంత వాడుకొన్నామంటే..
చెక్ సినిమాలో చెస్ గేమ్‌ను కథకు ఎంత అవసరమో అంతే వాడుకొన్నాం. చెస్ ఆట నేపథ్యంగా కథ సాగినప్పటికీ.. ఎమోషనల్ డ్రైవ్ కోసం మాత్రమే వాడుకొన్నాం. గతంలో అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కథను ట్రాక్ తప్పకుండా జాగ్రత్తలు తీసుకొన్నాం చంద్రశేఖర్ ఏలేటి అన్నారు.