For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లి చేసుకోను, పిల్లల్ని కనను... నా లైఫ్‌లో మరొకరికి చోటు లేదు.. ఎందుకంటే..చార్మీ

|

టాలీవుడ్‌లో చార్మీ కౌర్ హీరోయిన్‌గా టాప్ రేంజ్ చేరుకొని అటు పరిశ్రమ వర్గాలను, ప్రేక్షకులను మెప్పించారు. గత కొద్దికాలంగా యాక్టింగ్‌కు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్ అనే బ్యానర్‌లో భాగమయ్యారు. ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాకు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు అంటే మే 17న చార్మీది 31వ జన్మదినం. ఈ నేపథ్యంలో చార్మీ మీడియాతో మాట్లాడారు. తన మనసులోని భావాలను వెల్లడించారు. చార్మీ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే. .

13 ఏళ్ల నుంచి యాక్టింగ్

నేను చిన్నతనంలోనే సినిమాల్లోకి వచ్చాను. 13 ఏళ్ల నుంచి యాక్టింగ్ చేస్తున్నాను. మే 17తో నాకు 31 ఏళ్లు నిండాయి. ఇప్పటి వరకు 55 సినిమాల్లో నటించాను. సినిమా పరిశ్రమలోనే కొనసాగాలని అనుకొన్నాను. అందుకే పూరి కనెక్ట్‌తో ప్రొడక్షన్‌లోకి వచ్చాను అని చార్మీ అన్నారు.

ఆ విషయంలో జోక్యం చేసుకోను

పూరీ సార్ కథలో గానీ, క్రియేటివ్ వర్క్స్‌లో నేను జోక్యం చేసుకొను. కానీ నా అభిప్రాయం మాత్రమే వెల్లడించాను. ప్రొడక్షన్ గురించి, బడ్జెట్ గురించి ఆలోచిస్తాను. అతను స్క్రిప్టు చూసుకొంటాడు. నా పరిధి మాత్రం బడ్జెట్ మాత్రమే. షూట్ గోవాలో జరుగుతున్నది. నిధి అగర్వాల్ పాస్ట్‌పోర్టు పోయింది. అందుకే ఫారిన్ షెడ్యూల్ వాయిదా పడింది అని చార్మీ పేర్కొన్నారు.

ఇస్మార్ట్ శంకర్‌తో పూరీకి హిట్టు గ్యారెంటీ

పూరి జగన్నాథ్ సార్‌కు ఈ మధ్యకాలంలో మంచి కమర్షియల్ హిట్ లేదు. ఇస్మార్ట్ శంకర్‌తో మంచి హిట్ కొడుతాడు. పూరీ ట్రేడ్ మార్కు డైలాగ్స్ ఉంటాయి. పుల్లుగా ఎంటర్‌టైనర్‌గా అందర్ని ఇంప్రెస్ చేస్తుంది. ఇస్మార్ట్ శంకర్ పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం నాకు ఉంది అని పూరి చెప్పారు.

త్రిషాతో పెళ్లి ట్వీట్ గురించి

త్రిషాతో పెళ్లి ప్రపోజల్ గురించి చార్మి స్పందించారు. పూర్ణమి సినిమాలో నటించిన తర్వాత నేను త్రిషా క్లోజ్ ఫ్రెండ్స్‌గా మారాం. మేమిద్దరం రెగ్యులర్‌గా కలుసుకొంటాం. మేమిద్దరం కలిసి హాలీడే వెకేషన్‌కు వెళ్లిన సందర్బాలు ఉన్నాయి. ఏదో సరదా కోసం ట్వీట్ చేశాం కానీ.. అలాంటి వాటిని సీరియస్‌గా తీసుకోవద్దు అని పూరీ తెలిపారు.

పెళ్లి చేసుకొనే ప్లాన్ లేదు.. పిల్లల్ని

నాకు పెళ్లి చేసుకొనే ఉద్దేశం లేదు. అలాగే పిల్లల్ని కనే ప్లాన్ లేదు. నాకు అలాంటి జీవితాన్ని అనుభవించాలని కోరిక లేదు. పెళ్లి, పిల్లలు అనే క్యాటగిరిలో నేను ఫిట్ కాను. నా జీవితంలో మరొకరిని ఊహించుకోలేను. నేను ఇండిపెండెంట్ ఉమెన్. కష్టపడి పనిచేస్తాను. పొద్దున్నే లేవడం, ఫ్యామిలీని చూసుకొనే ఓపిక నాకు ఉండవు అని చార్మీ అన్నారు.

నెగిటివ్ వార్తలు బాధిస్తాయని

నాపై నెగిటివ్‌గా వచ్చే వార్తలు నన్ను చాలా బాధిస్తాయి. ఏదైనా రాసే ముందు అందులో వాస్తవం ఎంత అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే నాకు వయసు మీద పడిన తల్లిదండ్రులు ఉన్నారు. ఏదైనా తెలియ కూడని విషయం ఉంటే వారు బాధపడుతారు. నాపై వచ్చే నెగిటివ్ వార్తలను డీల్ చేసే సత్తా నాకు ఉంది. నాలో ఓ ఫైటర్ ఉన్నాడు. ప్రస్తుతం వర్క్‌పైనే దృష్టిపెట్టాను అని చార్మీ అన్నారు.

నేను డైరెక్షన్ చేయను

ఇక ముందు నటించే ఆలోచన కూడా నాకు లేదు. అలాగని డైరెక్షన్ చేసే ఆలోచన కూడా లేదు. పూరీ సార్ ఉండగా, నేను ఎందుకు డైరెక్షన్ చేస్తాను. డైరెక్షన్ చేసే ఆలోచన కూడా నాకు లేదు. టాలీవుడ్ డ్రగ్ కేసులో నాకు క్లీన్ చిట్ రావడం చాలా ఆనందంగా ఉంది అని చార్మీ అన్నారు.

English summary
Actress Charmme Kaur celebrated her 31st birthday in goa. She now busy with Ismart Shankar production, on her birthday she speak to media said that, I have no plans of getting married and having kids. I don’t think I fit into that category; I cannot prioritise someone else in my life.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more