Pawan Kalyan తో మూవీపై చిరంజీవి క్లారిటీ.. అప్పడే పవర్ స్టార్‌తో సినిమా అంటూ మెగాస్టార్
గాడ్‌ఫాదర్ సినిమా భారీ విజయాన్ని అందుకొన్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన ఆనందాన్ని మీడియాతో పంచుకొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల గురించి వివరంగా కొన్ని అభిప్రాయాలను వెల్లడించారు. ప్రేక్షకుల అభిరుచి కాలనికి తగినట్టు వేగంగా మారుతున్నది. ఆడియెన్స్ మార్పులను దృష్టిలో పెట్టుకొని లూసిఫర్ కథకు మార్పులు చేర్పులు చేసి గాడ్‌ఫాదర్ సినిమాను అద్బుతంగా అందించామని అన్నారు. ఇంకా ఈ సినిమా విజయం, పవన్ కల్యాణ్‌తో మూవీ గురించి తన అభిప్రాయాలను వెల్లడిస్తూ..

నాగార్జున, వెంకటేష్ ఫోన్ చేసి..
గాడ్‌ఫాదర్ సినిమాను ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. ఇలాంటి ఫలితం మరిన్నీ వైవిధ్యమైన కథలు, పాత్రలు రావడానికి ఇది మంచి సంకేతంగా భావిస్తున్నాం. భవిష్యత్‌లో వైవిధ్యమైన కథలు, పాత్రలు చేయడానికి ప్రయత్నిస్తాను. గాడ్‌ఫాదర్ సినిమా చూసి సాధారణ ప్రేక్షకులే కాకుండా.. సినిమా ఇండస్ట్రీ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాగార్జున, వెంకటేష్.. ఇలా దాదాపు అందరూ కాల్ చేసిన మాట్లాడారు. దాదాపు దర్శకులు, మిత్రులు అభినందనలు తెలిపారు అని చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు.

బాబీ, మెహర్ రమేష్ సినిమాల గురించి
నా సెకండ్ ఇన్సింగ్స్‌లో సైరా లాంటి విభిన్నమైన పాత్రలు చేశాను. ఇక ముందు కూడా మంచి కథలు, పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తాను. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై బాబీ దర్శకత్వంలో రాబోతున్న Mega154 మూవీలో నా నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే పూర్తి స్థాయి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందే భోళా శంకర్ మూవీలో కూడా మంచి మార్పులతో అద్భుతమైన వినోదంతో సాగుతుంది అని చిరంజీవి తెలిపారు.

రాంచరణ్ కోరిక మేరకు
రాంచరణ్ కోరిక మేరకు, నా ఆహ్వానం మేరకు సల్మాన్ ఖాన్ గాడ్‌ఫాదర్ సినిమాలో నటించాడు. హిందీ గానీ, ఇతర భాషల నుంచి మంచి ఆఫర్ వస్తే తప్పకుండా చేస్తాను. సినిమా పరిశ్రమలో అందరూ కలిసి పనిచేయాలని కోరుకొంటాను. ప్రాంతీయ, భాష భేదాలు లేకుండా ఇండియన్ సినిమా అనే పేరు రావాలని నా కోరిక. ఇటీవల కాలంలో తెలుగు చిత్రాలు బాహుబలి, RRR, కన్నడ చిత్రం కేజీఎఫ్ చిత్రాలు భాషా, ప్రాంతీయ సరిహద్దులు చెరిపేశాయి. సినిమా పరిశ్రమ ఎదుగుదలకు శుభపరిణామం అని చిరంజీవి అన్నారు.

పవన్ కల్యాణ్‌తో సినిమా ఎప్పుడంటే
ఇటీవల కాలంలో అందరూ అడిగే ప్రశ్న ఏమిటంటే.. పవన్ కల్యాణ్, మీరు కలిసి ఎప్పుడు నటిస్తారు అని అడుగుతుంటారు. మా తమ్ముడితో చేయాలనే సరదా నాకు ఉంటుంది. అన్నయ్యతో చేయాలనే కోరిక తనకీ ఉంటుంది. మా ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే చాలా అంచనాలు ఉంటాయి. అవన్నీ అధిగమించేలా అన్నీ కుదిరిన రోజున పవన్ కల్యాణ్, నేను కలిసి సినిమా చేస్తాం. ఆ సినిమా ఎప్పుడెప్పుడు చేయాలా అనే ఉత్సాహం నాకు ఉంది అని చిరంజీవి అభిప్రాయపడ్డారు.

యువ దర్శకుల గురించి
తెలుగు సినిమా పరిశ్రమలో యువ దర్శకుల వద్ద అపారమైన సమాచారం ఉంది. వారితో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. కొత్త విషయాలు, కొత్త ఆలోచనలతో యువ దర్శకులు ప్రతిభ అసమానం. వారి ఆలోచనలను తెర మీద ఆవిష్కరించడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. నా ఇమేజ్, నన్ను కొత్తగా చూపిస్తారని నేను నమ్మితే ఎవరితోనైనా పనిచేస్తాను. అందుకే యువ దర్శకులతో ప్రయాణం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతాను అని చిరంజీవి అన్నారు.


Click it and Unblock the Notifications











