‘బాలీవుడ్ హీరోలకు చిరంజీవికి అదే తేడా.. ఆ విషయంలో మెగాస్టార్ గ్రేట్..’ భోళాశంకర్ సినిమాటోగ్రాఫర్ ఇంటర్వ్యూ

ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న చిత్రం భోళా శంకర్. వేదాళం సినిమా రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి, తమన్నా భాటియా, కీర్తి సురేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకు చెన్నై ఎక్స్‌ప్రెస్, బోల్ బచ్చన్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన డడ్లీ అలియాస్ రాజేంద్రన్ భోళా శంకర్‌కు కెమెరా మెన్‌గా వ్యవహరించారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా డడ్లీ మాట్లాడుతూ..

మెగాస్టార్ చిరంజీవి ఎన్‌సైక్లోపిడియా. పక్కా ఫ్రొఫెసషనల్ యాక్టర్. అంతేకాకుండా ఫర్‌ఫెక్షనిస్ట్, పంక్చూవాలిటీని పాటిస్తాడు. 7 గంటలకు షూట్ అంటే.. మేకప్‌తో సహా ఆయన సెట్లో ఉంటాడు. ఆ ప్రొఫెషనలిజం బాలీవుడ్‌లో కనిపించదు. బాలీవుడ్‌లో హీరోలు కొంత ఆలస్యంగా వస్తారు. కానీ టాలీవుడ్‌లో అలాంటి పరిస్థితి కనిపించదు. చిరంజీవి ఆల్ రౌండర్. ఈ సినిమాలో మెగాస్టార్ స్వాగ్ కనిపిస్తుంది. కమర్షియల్ అంశాలతో ఫుల్ ప్యాకేజ్‌గా ఉంటుంది. మెగాస్టార్ లెవెల్‌కు ఏ మాత్రం తగ్గకుండా చూపించాం. నేను తమిళుడిని కానీ.. నాకు ఎలాంటి భాష సమస్య ఎదురు కాలేదు అని డడ్లీ తెలిపారు.

Cinematographer Dudley about Chiranjeevis Timing, professionalism, commitment in Bhola Shankar promotional meet

మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతి. ప్రతీ రోజు ఓ కొత్త విషయాన్ని నేర్చుకొన్నాను. 40 ఏళ్ల సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో అనుభవాలను ఆయన నుంచి తెలుసుకొన్నాం. ఆయన ఫర్‌ఫెక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలీవుడ్‌ను చూస్తే చిరంజీవి పాటించే సమయ పాలన నాకు అద్బుతంగా అనిపించింది.

భోళా శంకర్ సినిమా షూటింగ్ ప్రతీ రోజు మరిచిపోలేని అనుభవాన్ని, అనుభూతిని పంచింది. పిక్నిక్ మాదిరిగా షూటింగ్ సాగిపోయింది. మెగాస్టార్ చిరంజీవి సెట్లో ఉంటే సందడిగా ఉండేది. ఆయన టైమింగ్ అద్బుతంగా ఉంటుంది. కామెడీ సీన్లలో చిరంజీవి ఫెర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. చిరంజీవి గారు చాలా కంఫర్ట్ జోన్‌లో పనిచేస్తారు. దాంతో ఆయనతో పనిచేయడం చాలా ఈజీ అయింది అని డడ్లీ చెప్పారు.

తెలుగు సినిమాల్లో పనిచేసినప్పుడు హోం ప్లేస్‌లో పనిచేసిన ఫీలింగ్ కలిగింది. చిరంజీవి, ఇతర టీమ్ అందరితో కలిసి మెలిసి ఉంటారు. చిరంజీవి గారు ఇంటి నుంచి ఫుడ్ తెప్పించి పెట్టేవారు. ఫ్రూట్స్ తెప్పించే వారం. హైదరాబాద్‌ ఈ ఫుడ్ బాగుంటుంది ట్రై చేయమని చెప్పేవారు. మమ్మల్ని సొంత ఫ్యామిలీ చూసుకొనే వారు.

భోళా శంకర్ మూవీకి ముందు నాకు ఎలాంటి తెలుగు సినిమా ఆఫర్లు రాలేదు. కానీ మహేష్ బాబుతో నాలుగైదు యాడ్ ఫిలింస్ చేశాను. సమంతతో కొన్ని యాడ్ ఫిలింస్ చేశాను. అలాగే అల్లు అర్జున్‌తో రెండు యాడ్ ఫిలింస్ కూడా షూట్ చేశాను. ఇంకా ఏ సినిమాలు అంగీకరించలేదు. కొద్ది రోజులు బ్రేక్ తీసుకొని మళ్లీ పని చేస్తాను. తెలుగు సినిమాల గురించి చర్చ జరుగుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X