‘కీర్తి సురేష్, తమన్నా అందాలను చూస్తే ఫిదా.. భోళా శంకర్ రీమేక్ ఓ ఛాలెంజ్’
తమిళనాడు పరిశ్రమకు చెందిన సినిమాటోగ్రాఫర్ డడ్లీ అలియాస్ రాజేంద్రన్ బాలీవుడ్‌లో భారీ బడ్జెట్, అగ్ర హీరోల సినిమాలకు పనిచేశారు. షారుక్ ఖాన్‌తో చెన్నై ఎక్స్‌ప్రెస్, దిల్ వాలే, అజయ్ దేవగణ్‌తో సింగమ్ రిటర్న్స్, జాన్ అబ్రహంతో సత్యమేవ జయతే 2, అభిషేక్ బచ్చన్‌తో బోల్ బచ్చన్, అక్షయ్ కుమార్‌తో సింగ్ ఈజ్ బ్లింగ్ సినిమాలకు పనిచేశాడు. తాజాగా తొలిసారి డడ్లీ మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలకు పని చేశాడు. ఈ సందర్బంగా భోళా శంకర్, చిరంజీవి గురించిన విశేషాలు తెలియజేస్తూ..
దర్శకుడు మెహర్ రమేష్ నేను మంచి స్నేహితులం. నేను హైదరాబాద్‌లో ఉన్నా.. ఆయన ముంబైకి వచ్చినా మేమిద్దరం కలుసుకొంటుంటాం. లాక్‌డౌన్ పిరియడ్‌లో మనం ఓ సినిమా చేస్తున్నామని చెప్పాడు. అయితే ఎవరు హీరో అని నేను అడిగాను. అయితే గెస్ చేయమని అడిగాడు. నేను కొందరి హీరోల పేర్లు చెప్పాను. చివరకు రమేష్ మనం మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నామని చెప్పారు. దాంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాను. లాక్‌డౌన్ తర్వాత హైదరాబాద్‌కు వచ్చి కలిస్తే.. కథ చెబితే.. దానిపై పలు రకాలుగా చర్చించాం అని సినిమాటోగ్రాఫర్ డడ్లీ చెప్పారు.

భోళా శంకర్ మూవీ తమిళంలో అజిత్ నటించిన వేదాళం మూవీకి రీమేక్. ఆ సినిమా గ్రాండియర్‌ను తగ్గకుండా మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్‌కు తగినట్టు మార్పులు చేశాం. కథా పాయింట్ మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. కానీ చిరంజీవి అభిమానులను మెప్పించే విధంగా సినిమా ఉంటుంది. దర్శకుడు రమేష్ కొన్ని మార్పులు సూచించారు. నేను కొన్ని సలహాలు ఇచ్చారు. టీమ్ అంతా కలిసి మేము కథలో మార్పులు చేశాం అని డడ్లీ అన్నారు.
రీమేక్ సినిమా చేయడం చాలా కష్టం. ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగా ఉండాలి. ఓ భాషలో హిట్టయిన సినిమాను రీమేక్ చేయడం కష్టం.. నష్టం అని చెప్పను. కానీ ఛాలెంజ్ అని భావిస్తాను. వేదాళం సినిమా కంటే బెటర్‌గా చేశాం. ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా యాక్షన్ పార్ట్ ఉంటుంది. వేదాళంలో యాక్షన్ సీన్లు హైలెట్ ఉంటాయి. ఈ సినిమా కంటే ఎక్కువ యాక్షన్ పార్ట్ అభిమానులను మెప్పించేలా ఉంటుంది అని డడ్లీ చెప్పారు.

భోళా శంకర్ సినిమా కోసం కొత్తగా కెమెరాలు, టెక్నాలజీ వాడలేదు. కానీ ఇంటర్వెల్ యాక్షన్ సీన్లకు ఫాంథమ్ కెమెరా వాడాం. దర్శకుడు, ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్ మధ్య కోఆర్డినేషన్ చక్కగా కుదిరింది. దాంతో ఈ సినిమాలో సీన్లు అద్బుతంగా వచ్చాయి. ఆర్ట్ విభాగం పనితీరు ఈ సినిమాకు హైలెట్‌గా మారుతుంది.
భోళాశంకర్ సినిమాలో కీర్తీ సురేష్, తమన్నా భాటియా స్పెషల్ ఎట్రాక్షన్స్. సెట్లో కీర్తీ సురేష్, చిరంజీవి మధ్య సన్నివేశాలు బాగుంటాయి. కొన్నిసార్లు ఎమోషనల్‌గా టచ్ చేస్తాయి. మరికొన్నిసార్లు ఫుల్లుగా నవ్విస్తాయి. ఈ సినిమాలో పాటలు చాలా బాగుంటాయి. కీర్తీ సురేష్, తమన్నాను తెర మీద చూస్తే ఫిదా అవుతారు.

నిర్మాత అనిల్ సుంకర సినిమా విషయంలో రాజీ పడలేదు. ఎలాంటి సాంకేతికత కావాలని అడిగితే.. దర్శకుడికి, ఇతర సాంకేతిక నిపుణులకు నిరాకరించలేదు. మీరు సినిమా చూస్తే ఎంత గ్రాండ్‌గా తీశారో తెలుస్తుంది. సినిమా చాలా రిచ్‌గా ఉందంటే, కోల్‌కతా, స్విట్జర్లాండ్ ప్రాంతాల్లో అద్బుతంగా షూట్ చేశాం అని డడ్లీ చెప్పారు.


Click it and Unblock the Notifications











