twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ కులం వాళ్లు మనుషులు కాదా? వాళ్లేమైనా పై నుంచి ఊడిపడ్డారా? కమెడియన్ పృథ్వీ

    |

    Recommended Video

    Comedian Prudhvi Raj : చౌదరీస్ మనుషులు కాదా, వాళ్ళేమయినా పై నుండి దిగొచ్చారా ? | Oneindia Telugu

    తెలుగు సినిమా పరిశ్రమలో ఈ మధ్యకాలంలో కామెడీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన పృథ్వీ రాజకీయాల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో జరుగబోయే ఎన్నికల కోసం వైఎస్సాఆర్ కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితో పాలిటిక్స్‌లోకి వచ్చిన ఆయన.. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలుచున్నారు. తాజాగా పృథ్వీ ఏపీ రాజకీయాలు, సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాలను వన్ ఇండియా, ఫిల్మీబీట్ తెలుగు వెబ్‌సైట్‌తో పంచుకొన్నారు. ఆయన ఏమన్నారంటే..

     రెండు పడవల ప్రయాణంతో

    రెండు పడవల ప్రయాణంతో

    సినిమా, రాజకీయాల్లో కొనసాగడం అంతా కష్టమేమీ కాదు. రెండు పడవల ప్రయాణాన్ని ఆనందంగా కొనసాగిస్తున్నాను. మరో పడవ ఉన్నా కాలు పెట్టడానికి సిద్ధం. సినీ, రాజకీయాల్లో బలమైన సామాజిక వర్గాన్ని ఎదుర్కోవడమనే సమస్యే కాదు. వాటిని పట్టించుకొను అని పృథ్వీ అన్నారు.

    బ్రహ్మీ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్... బెస్ట్ కమెడియన్ ఎవరో మీరే తేల్చండి!బ్రహ్మీ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్... బెస్ట్ కమెడియన్ ఎవరో మీరే తేల్చండి!

    ఆ కులం వాళ్లు మనుషులు కాదా?

    ఆ కులం వాళ్లు మనుషులు కాదా?

    రాజకీయాల్లో బలమైన సమాజవర్గం చౌదరీ (కమ్మ కులం)లను ఎదుర్కోవడం అనే విషయాన్ని పట్టించుకోను. అన్నీ బలమైన సామాజిక వర్గాలే. సొసైటీలో అన్ని కులాలు బలమైనవే. అవన్నీ పాతకాలపు విషయాలు. చౌదరీ వర్గంలో నాకు మంచి స్నేహితులు. వాళ్లు మనుషులే కాదా అని అన్నారు.

    ఎవరినైనా ఎదుర్కోవడానికి సిద్ధం

    ఎవరినైనా ఎదుర్కోవడానికి సిద్ధం

    సామాజిక వర్గాల సమీకరణాలు ఎన్నికల సమయంలో మాట్లాడుకోవడానికి పనికి వస్తాయి. కులాలు, మతాలకు నేను భయపడను. వైఎస్ఆర్, వైఎస్ జగన్ మాదిరిగానే నాకు ధైర్యం ఉంది. ఎవరినైనా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాను.

    వైఎస్ఆర్ స్ఫూర్తితోనే

    వైఎస్ఆర్ స్ఫూర్తితోనే

    వైఎస్ఆర్ ఘాట్‌కు వెళ్లి నేను రాజకీయాల్లోకి ప్రవేశించాను. తినడానికి, జీవించడానికి సరిపడే వనరులు ఉన్నాయి. జీవితంలో ఇక ఏం చేయాలన్నదే నా ముందు ఉన్న ప్రశ్న. నాకు ప్రాణంగా నిలిచిన దివంగత నేత వైఎస్ఆర్ నాకు స్ఫూర్తి. ఆయనను ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చాను అని పృథ్వీ అన్నారు.

    పూర్తి ఇంటర్వ్యూ కోసం..

    కమెడియన్ పృథ్వీ పూర్తి ఇంటర్వ్యూ కోసం..

    English summary
    Comedian Prudhvi Raj about supporting YSRCP. And he told that he wants to do good things for people. and also he gave strong counter to Kamma caste people. He speaks to Telugu filmibeat, One India exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X