ఆ నటుడి లైఫ్ దుర్భరం.. గేట్ వద్ద గెంటేశారు.. కృష్ణను కలిసిన రెండో రోజే మరణం.. పృథ్వీ

తనదైన మేనరిజం, పంచ్ డైలాగ్స్‌, తనదైన హస్యంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ తాజాగా నటించిన చిత్రం బ్లఫ్ మాస్టర్. తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన శతురంగ వేట్టై సినిమాకు ఇది రీమేక్. తెలుగు నేటివిటికి అనుగుణంగా ఆసక్తికరమైన మార్పులు చేసి ఈ సినిమాను తెరకెక్కించారు. సత్యదేవ్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో పృథ్వీ కీలక పాత్రను పోషించారు. ఈ సినిమా డిసెంబర్ 28న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో పృథ్వీ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. అలనాటి నటులు జీవితాల గురించి, వారి కష్ట సుఖాల గురించి వివరించారు. పృథ్వీ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

పరిశ్రమలో అవకాశాలు ఉన్నంత వరకే

పరిశ్రమలో అవకాశాలు ఉన్నంత వరకే

సినిమా పరిశ్రమలో అవకాశాలు ఉన్నంత వరకే దర్జాగా ఉంటారు. ఓసారి అలాంటి ఛాన్సులు చేజారితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. కెరీర్ ఊపులో ఉన్నప్పుడే అన్ని రకాలు సర్దుకోవాలే. లేకపోతే చివరి రోజుల్లో దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది.

మహనటుల జీవితాల గురించి

మహనటుల జీవితాల గురించి

కాంతారావు, రాజనాల, సావిత్రి లాంటి మహానటులు జీవితాలను ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా పరిశీలించాలి. చివరి రోజుల్లో వారు అనుభవించిన ఆర్థిక కష్టాలు మాటల్లో చెప్పలేనివి. అయితే మహానటి సినిమాలో సావిత్రిని చూపించిన విధంగా ఆమె జీవితం లేదు. నాకు తెలిసిన వాళ్లు సావిత్రి జీవితం అలా లేదని చెప్పారు.

 అలనాటి హీరో హరినాథ్ జీవితం గురించి

అలనాటి హీరో హరినాథ్ జీవితం గురించి

అలనాటి హీరో హరినాథ్ గారి జీవితం చివరి రోజుల్లో దుర్బరంగా గడించింది. నేను టెలివిజన్ సీరియల్స్ నటించే సమయంలో ఓ రోజు హరినాథ్ గారిని పద్మాలయ గేట్ వద్ద నిలిపివేశారు. గడ్డం పెరిగి, చొక్కా చినిగిపోయి దీనస్థితిలో కనిపించారు. అతడిని నేను గుర్తుపట్టి మీరు హరినాథ్ కదా పలకరించాను. దాంతో ఆయన కృష్ణ గారిని కలువాలని చెప్పగా నేను ఆయనను లోనికి తీసుకెళ్లాను.

స్టూడియోలోనికి తీసుకెళ్లి

స్టూడియోలోనికి తీసుకెళ్లి

హరినాథ్‌ను స్టూడియోలోనికి తీసుకెళ్లాను. కృష్ణగారి క్యాస్టూమర్ గదిలోకి తీసుకెళ్లి స్నానం చేయించారు. స్వయంగా కృష్ణగారి బట్టలు ఆయనకు ఇచ్చారు. ఆ తర్వాత కృష్ణగారిని కలిపించారు. అలా వారం రోజులపాటు కృష్ణ గారి వద్దే ఉన్నారు. అన్నిరకాలుగా కృష్ణ గారు ఆయనను చూసుకొని చెన్నైకి పంపించారు.

 రెండు రోజుల తర్వాత మరో లోకానికి

రెండు రోజుల తర్వాత మరో లోకానికి

చెన్నైకి వెళ్లిన రెండో రోజులకు హరనాథ్‌ గారు ఈ లోకం విడిచి వెళ్లారు. ఒకప్పడు గొప్పగా బతికిన నటుల్లో హరినాథ్ ఒకరు. ఆయన మరణం మాకు ఓ గుణపాఠం. ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే ఎలా ఉంటుందో అతడిని చూసి నేర్చుకొన్నాం అని పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X