రవితేజ అండగా నిలిచాడు.. చిరంజీవి నుంచి ఆ సహాయం కావాలి.. దారుణంగా కమెడియన్ రామచంద్ర ఆరోగ్య పరిస్థితి!

తెలుగు సినిమా పరిశ్రమలో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న రామచంద్ర ఆరోగ్యం క్షీణించి దీనావస్థకు చేరుకోవడం అందర్నీ కలిచి వేస్తున్నది. కొద్ది నెలల క్రితం పక్షవాతానికి గురైన ఆయన ప్రస్తుతం తన జీవితాన్ని మంచంపైనే కొనసాగించడం దిగ్బ్రాంతికి గురి చేస్తున్నది. ఆయన అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక స్థితి గురించి ఫిల్మీబీట్ ఆరా తీసింది. బెడ్‌పైనే ఉన్న ఆయనతో ఫిల్మీబీట్ తెలుగు రిపోర్టర్ కార్తీక్ కోట, వీడియో జర్నలిస్టు రామకృష్ణ తన బాధను ఇంటర్వ్యూ ద్వారా పంచుకొన్నారు. కళామతల్లి ముద్దుబిడ్డ అనుభవిస్తున్న క్షోభను ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం చేశారు. రామచంద్ర చెప్పిన భావోద్వేగమైన అంశాల విషయానికి వస్తే..

నేను అనారోగ్యానికి గురయ్యానని తెలిసిన వెంటనే మిత్రులు, సన్నిహితులు, స్నేహితులు స్పందించారు. వారికి తోచిన విధంగా వారు తనకు అండగా నిలిచారు. హీరో రవితేజతో కలిసి పలు చిత్రాలు నేను నటించాను. ఆ చనువు చొరవతో మాస్ మహారాజ్ స్పందించి.. ఆర్థికంగా సహాయం చేశారు. నా దీనావస్థను చూసి ఆయన అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు కావాలని కోరుకొంటున్నాను అని ఆయన తెలిపారు.

Comedian Rama Chandra

నిన్ను చూడాలని సినిమాతో నా కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత దర్శకులు శ్రీను వైట్ల, హరీష్ శంకర్, ఇతర దర్శకులు నన్ను అధికంగా ప్రోత్సాహించి అవకాశాలు కల్పించారు. ఇటీవల కాలంలో నా ఆరోగ్య పరిస్థితి అత్యంత దారుణంగా క్షీణించింది. ప్రస్తుతం బయటకు వచ్చి పనిచేయలేని పరిస్థితి. నా అవయవాలు చచ్చు పడటంతో ఫిజియోథెరపీ చికిత్స కొనసాగుతుంది అని తెలిపారు.

చిరంజీవి గారితో అందరివాడు సినిమాలో చిన్న పాత్రలో నటించాను. అది నా జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకం. నా పరిస్థితి ఆయన దృష్టికి వెళ్తే నాకు సంతోషంగా ఉంటుంది. ఆయన సహాయం కంటే ఆయన ఆశీస్సులు నాకు ఎంతో ముఖ్యం. జూ. ఎన్టీఆర్‌ నటించిన ఆయన తొలి చిత్రంతోనే నా కెరీర్ మొదలైంది. ఆ విషయాన్ని ఎన్టీఆర్ ఎప్పుడూ గుర్తు పెట్టుకొంటారు. తన మొదటి సినిమా గురించిన విషయాలను గొప్పగా చెబుతుంటారు. అప్పట్లో ఎన్టీఆర్ కాన్ఫిడెన్ష్ నాకు ఎంతో స్పూర్తిని ఇచ్చేది అని అన్నారు.

Comedian Rama Chandra

నా పరిస్థితిని అర్ధం చేసుకొని సహాయం చేస్తున్న కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు కృతజ్ఞతలు. నా సోదరుడు నారాయణ తనను కంటికి రెప్పలా చూసుకొంటున్నారు. అన్నీ పనులు దగ్గరుండి చేస్తున్నాడు అని చెబతూ భావోద్వేగానికి రామచంద్ర లోనయ్యారు. తెలుగు సినీ పరిశ్రమ, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు తనకు సహాయం చేస్తే.. తనకు ట్రీట్‌మెంట్ పూర్తి అవుతుంది. తిరిగి మామూలు మనిషిని అయి.. మళ్లీ సినిమాల్లో నటించాలని ఉంది. ఆర్థిక సహాయం కంటే.. పెద్ద వాళ్ల దీవెనలు, ఆశీస్సులే తనకు ముఖ్యం అని రామచంద్ర అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X