కూలిపై అనిరుధ్ రవిచందర్ ఫస్ట్ రివ్యూ.. డైరెక్టర్ పై షాకింగ్ కామెంట్
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కూలి. ఈ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించడం విశేషం. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. సినిమా విడులకు మరో 10 రోజులకు పైగానే సమయం ఉన్నా ఇప్పటికే సినిమాను గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మూవీ కాస్ట్ అండ్ క్రూ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ అయ్యారు. ఇప్పటికే దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు అనిరుధ్ రవిచందర్ కూడా సినిమాపై తన ఫస్ట్ రివ్యూను అందించడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
భారీ బడ్జెట్ తో కూలి..
కూలి చిత్రాన్ని కోలీవుడ్ టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ సన్ పిక్చర్స్ నిర్మించడం విశేషం. ఈ చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కగనరాజ్ దర్శకత్వం వహించడం విశేషం. ఇక చిత్రంలో భారీ తారాగణం నటించడం, టాప్ టెక్నీషియన్లు కూడా పనిచేశారు. రజనీకాంత్, అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, క్యామియో అప్పియరెన్స్ లో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించడం విశేషం. మరోవైపు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఇలా నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రచార కార్యక్రమాలను కలుపుకొని ఈ చిత్రానికి రూ.350 కోట్ల బడ్జెట్ ఖర్చైందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

అనిరుధ్ ఫస్ట్ రియాక్షన్..
ఇండియాస్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్ర ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రూపుదిద్దుకుంటున్న టాప్ ప్రాజెక్ట్స్ కు ఆయన సంగీతం డిమాండ్ లో ఉండటం విశేషం. ఇక రజనీకాంత్ కూలి చిత్రానికి కూడా ఆయనే సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన డిస్కో, వైబ్, మోనికా, పవర్ హౌజ్ సాంగ్స్ దుమ్ము లేపుతున్నాయి. ఈ పాటలు సినిమాకు సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచాయి. ఇక మరోవైపు అనిరుధ్ తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో సినిమా అవుట్ పుట్ పై ఆసక్తికరంగా మాట్లాడారు.
ఇప్పటి వరకు సినిమా నుంచి ఎలాంటి బిగ్ అప్డేట్స్ వదల్లేదు. కేవలం మూడు సాంగ్స్ విడుదల చేశాం. ఐదుగురు టాప్ హీరోల పోస్టర్స్ రిలీజ్ చేశారు. బ్యాక్ షార్ట్ చూపించాం. దానికే సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే సినిమాను చూశాం. లోకేష్ కనగరాజ్ స్క్రీన్ ప్లే నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. ముఖ్యంగా ఆయన నుంచి వస్తున్న బ్రిలియంట్ సినిమా. 5 గురు లెజెండరీ నటులను లోకేష్ కనగరాజ్ చక్కగా చూపించబోతున్నారు. ఇదొక ఇంటెలిజెంట్ ఫిల్మ్ గా భావిస్తున్నాను.. అని సినిమా గురించి మాట్లాడారు. ఇక ఆగస్టు 2న విడుదలయ్యే ట్రైలర్ తో మరింతగా అంచనాలు పెరగనున్నాయి.
కూలి ప్రీ రిలీజ్ బిజినెస్..
కూలి చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకున్నాయి. ఈ చిత్రంలో టాప్ స్టార్స్, లోకి దర్శకత్వం, అనిరుధ్ సంగీతంతో డిస్ట్రిబ్యూటర్స్ లోనూ సినిమాపై తారా స్థాయి అంచనాలు ఉన్నాయి. అందుకే సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రం 550 కోట్ల రూపాయాల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని అంటున్నారు. ఇందులోనే థియేట్రికల్ రైట్స్ తో పాటు నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా అమ్ముడైనట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











