‘ఆ డైరెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. కత్తి పట్టుకొంటా’

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం సారంగపాణి జాతకం. హీరో ప్రియదర్శి, రూపా కొడువయూర్ జంటగా వెన్నెల కిషోర్, వైవా హర్ష, వీకే నరేష్, తనికెళ్ల భరణి తదితరులు నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 25వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఇటీవల రిలీజైన టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై మంచి అంచనాలు పెంచాయి. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో ప్రియదర్శి ఫిల్మీబీట్ తెలుగు వెబ్ సైట్‌తో మాట్లాడుతూ..

సమాజంలోని పరిస్థితుల ఆధారంగా కామన్ మ్యాన్ పాత్రలు పోషిస్తే వస్తున్న ఆదరణ బాగుంది. అలాంటి సినిమాలను ప్రేక్షకులను ఆదరిస్తారనే విషయాలు మల్లేశం, బలగం, కోర్ట్ సినిమాలు నిరూపించాయి. అలాంటి ఎమోషన్స్, కామెడీ అంశాలు కలబోసి రూపొందించిన చిత్రం సారంగపాణి జాతకం. ఈ సినిమా కథను ఇంద్రగంటి గతేడాది చెప్పారు. కథ వినగానే ఈ ప్రాజెక్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాను. కోర్ట్ మూవీ హిట్ తర్వాత ఈ సినిమా రావడం శుభసూచకంగా ఉంది అని ప్రియదర్శి అన్నారు.

Priyadarshi Interview

జాతకాలు నమ్మాలా? నమ్మొద్దా? అనే విషయాల గురించి ఈ సినిమాలో చర్చించలేం. ఒకర మూఢ నమ్మకాలు మరొకరిపై రుద్దితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అనే విషయాన్ని చెప్పాలనే ప్రయత్నం చేశాం. బ్యాలెన్స్ ఈ కథను తెరకెక్కించారు. నా నిజ జీవితంలో జతకాలను కొంత నమ్ముతాను. కానీ ఈ సినిమాలో మాదిరిగా జాతకాల పిచ్చోడిని మాత్రం కాదు అని ప్రియదర్శి అన్నారు.

సారంగపాణి జాతకం సినిమా ఇటీవల కాలంలో రాలేనుటువంటి ఫుల్ లెంగ్త్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమాలో తణికెళ్ల భరణి, నరేష్, అవసరాల శ్రీనివాస్ లాంటి వాళ్లు మంచి వినోద భరితమైన పాత్రల్లో కనిపిస్తారు. పక్కాగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాగా ఉంటుంది. పాటలు, వివేక్ సాగర్ మ్యూజిక్ అన్నీ చక్కగా కుదిరాయి అని ప్రియదర్శి చెప్పారు.

నేను క్లాస్ సినిమాలే కాకుండా మాస్ సినిమాలు చేయాలన్నది నా కోరిక. ఒకే రకమైన సినిమాలు చేయకూడదని అనుకొంటాను. నటుడిగా నాకు నేనుగా, ప్రేక్షకులను మెప్పించే పాత్రలు చేస్తాను. చిరంజీవి, రజనీకాంత్, బాలకృష్ణ ఓ వైపు క్లాస్, మాస్ సినిమాలు చేశారు. ఆ విషయంలో నాకు వారే స్పూర్తి. ఒకవేళ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల వచ్చి రెడీ అంటే.. కత్తి పట్టుకొంటా అని ప్రియదర్శి నవ్వుతూ చమత్కరించారు.

కోర్ట్, సారంగపాణి జాతకం సినిమాల తర్వాత ఏషియన్ సినిమాస్‌లో ప్రేమంటే? అనే మూవీ చేస్తున్నాను. ఆ తర్వాత గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా చేస్తున్నాను. ఇంకా కొందరు దర్శకులు, నిర్మాతలు చెప్పే కథలు వింటున్నాను. భారమైన పాత్రలు, విభిన్న కథలతో రూపొందే సినిమాలపై దృష్టిపెడుతున్నాను అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X