గుణ 369 సూపర్ హిట్ ఖాయం.. బ్లాక్‌బస్టర్‌కు కావాల్సిన హంగులు: నిర్మాతలు

RX100 ఫేమ్ కార్తికేయ హీరోగా, మ‌ల‌యాళ భామ‌ అన‌ఘ నాయిక‌గా తెర‌కెక్కిన చిత్రం గుణ 369. బోయ‌పాటి శ్రీను ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్ర‌మిది. శ్రీమ‌తి ప్ర‌వీణ క‌డియాల స‌మ‌ర్ప‌ణ‌లో స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. ఈ సినిమా ఆగస్టు 2వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నిర్మాతలు తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాలా, ప్రవీణ కడియాల తెలుగు ఫిల్మ్ బీట్‌తో మాట్లాడారు. గుణ 369 గురించి చెప్పిన విషయాలు వారి మాటల్లోనే..

 టీవీ రంగం నుంచి సినీ రంగం వైపు

టీవీ రంగం నుంచి సినీ రంగం వైపు

టెలివిజన్, ఈవెంట్ నిర్వహణ రంగంలో మాకు మంచి అనుభవం ఉంది. సక్సెస్‌ఫుల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాం. సినీ పరిశ్రమలోకి ప్రవేశించడానికి మొదటిసారి మంచి సబ్జెక్ట్ కోసం గత రెండేళ్లుగా ఎదురు చూస్తున్నాం. ఈ క్రమంలో దర్శకుడు బోయపాటి శ్రీను వద్ద మాకు అర్జున్ జంధ్యాల అనే యువకుడు మా వద్ద స్క్రిప్టు తెచ్చాడు. ఆయన తెచ్చిన స్క్రిప్టు మాకు బాగా నచ్చింది. ఏదైతే మంచి సినిమాను తీయాలనే లక్ష్యంతో ఉన్నామో.. ఆ లక్ష్యాన్ని అర్జున్ జంధ్యాల నెరవేర్చాడు.

 దర్శకుడిగా అర్జున్ జంధ్యాల చెప్పిన కథ

దర్శకుడిగా అర్జున్ జంధ్యాల చెప్పిన కథ

దర్శకుడు అర్జున్ జంధ్యాల మాకు చెప్పిన స్టోరిని తెరపైన వందశాతం చూపించాడు. ఎలాంటి పొరపాట్లు లేకుండా సినిమాను చక్కగా తెరకెక్కించాడు. కార్తీకేయకు ఈ సినిమాకు ముందు ఉన్న ఇమేజ్‌కు భిన్నంగా ఆయనను గుణ 369 సినిమాలో చూస్తారు. హై ఓల్టేజ్, ఎమోషనల్ ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోవడం గ్యారెంటి అని నిర్మాత తిరుమల్ రెడ్డి తెలిపారు.

 సోషియో ఫాంటసీ కాదు.. కమర్షియల్ సినిమాగా

సోషియో ఫాంటసీ కాదు.. కమర్షియల్ సినిమాగా

గుణ 369 టైటిల్‌ను చూసి సోషియో ఫాంటసి అనుకోవద్దు. ఇది సామాజిక అంశంతో కూడిన చక్కటి ఫ్యామిలీతో చూడగలిగే సినిమానే ఈ సినిమా. సాధారణ యువకుడు ఖైదీ నెంబర్ 369గా ఎందుకు మారాడనేది ఈ సినిమా కథ. మేము డిఫెరెంట్, విభిన్నమైన సినిమా తీశామని చెప్పం. కానీ గుణ 369 విషయంలో సమాజంలో జరిగిన రియల్ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఓ మంచి సినిమా అని అనిల్ కడియాల చెప్పారు.

 మంచి సామాజిక సందేశంతో

మంచి సామాజిక సందేశంతో

గుణ 369 సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు సొషల్ మెసేజ్ కూడా ఉంటుంది. తొలిసారి సినీ రంగంలోకి వస్తూ కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి కారణం అర్జున్ జంధ్యాల చెప్పిన కథనే. ఈ సినిమాను అనుభవం ఉన్న దర్శకుడిగా సినిమాను తీశారు. బోయపాటి వద్దనే 12 సంవత్సరాలు పనిచేశాడంటే ఆయనకు సినిమాపై ఉన్న అవగాహన ఎంతో ఉందో అర్ధం చేసుకోవచ్చు అని తిరుమల్ రెడ్డి వెల్లడించారు.

 సూపర్ హిట్‌ గ్యారెంటీ.. బ్లాక్ బస్టర్‌కు కావాల్సిన..

సూపర్ హిట్‌ గ్యారెంటీ.. బ్లాక్ బస్టర్‌కు కావాల్సిన..

గుణ 369 సినిమా కమర్షియల్‌గా సూపర్ హిట్ అవుతుందని బలంగా విశ్వసిస్తున్నాం. ఈ సినిమా కంటెంట్‌కు బ్లాక్ బస్టర్‌కు కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయి. ఈ సినిమా కథలో ఓ కుటుంబం తమ సభ్యులను చూసుకొంటుంది. అమ్మ, చెల్లెలి ప్రేమ, తండ్రి, కొడుకుల మధ్య అనుబంధాలు ఆకట్టుకొనేలా ఉంటాయి. బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాల్సిన కుర్రాడు ఖైదీ నంబర్ 369గా ఎందుకు మారడానేది చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. మహిళలను ఎలా గౌరవించాలనే అంశం సెంటర్ ఆఫ్ పాయింట్‌గా ఉంటుంది అని శ్రీమ‌తి ప్ర‌వీణ క‌డియాల తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X