‘బాలకృష్ణ అలాంటి రాక్షసుడు.. మొండి గుర్రంతో అలా డేంజరస్‌గా’
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బాబీ కొల్లి, స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ విజయం వైపు దూసుకెళ్తున్నది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలై తొలి ఆట నుంచే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకొంటున్నది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు బాబీ కొల్లి ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తూ..
డాకు మహారాజ్ సినిమాకు వస్తున్న రెస్సాన్స్ మేము ముందే ఊహించాం. బాలకృష్ణను దర్శకుడు బాబీ కొత్తగా చూపించారు. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా సినిమాని రూపొందించారు. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉన్నాయి అని చెబుతున్నారు. ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను అని అన్నారు.

బాలకృష్ణ కెరీర్‌లో గొప్ప సినిమాల్లో ఒకటిగా డాకు మహారాజ్ నిలిచేలా మేము ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకొన్నాం. అందుకోసం చాలా కష్టపడ్డాం. ఊటి, రాజస్థాన్ లాంటి డిఫరెంట్ వాతావరణాల మధ్య కష్టమైన రీతిలో షూట్ చేశాం. అందుకు హీరో బాలయ్య బాబు సహకరించారు. ఈ సినిమా విజయంతో మా కష్టాన్ని మరిచిపోతున్నాం. గత సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాలతో మంచి విజయాలు లభించడం హ్యాపీగా ఉంది అని బాబీ తెలిపారు.
డాకు మహరాజ్ కథ చెప్పినప్పుడు దానిని బాలకృష్ణ పూర్తిగా నమ్మారు. ఆయన నమ్మకమే ఈ సినిమా ఘన విజయానికి బాట వేసింది. షూటింగ్‌లో సమయంలో చాలా కష్టపడి బాలయ్య యాక్షన్ సీన్లు చేశారు. ఆయన ఓ పని రాక్షసుడు. రిస్కీ షాట్స్‌లో డూప్ పెడుతానంటే ఒప్పుకోలేదు. ఇసుక తుఫాన్‌లో వద్దని అంటున్నా.. ఆయన స్వయంగా పాల్గొని సీన్ పూర్తి చేశారు. ఆయన కమిట్‌మెంట్ అలాంటింది అని బాబీ అన్నారు.

నా కెరీర్‌లో చిరంజీవి, బాలకృష్ణతో కలిసి పనిచేసే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. సినిమాకు ముందు బాలకృష్ణ గురించి రకరకాల వార్తలు విన్నాను. కానీ ఆయనతో ట్రావెల్ అయిన తర్వాత అవన్నీ తప్పని తెలుసుకొన్నాను. ఆయన నుంచి క్రమశిక్షణ నేర్చుకోవచ్చు. దర్శకుడికి ఎంతో గౌరవం ఇస్తారు. సెట్స్ లో అందరితో సరదాగా ఉంటారు. మనం ఎంత నిజాయితీగా ఉంటే బాలకృష్ణ గౌరవిస్తారు డూప్ లేకుండా నటించడానికి ఇష్టపడతారు. మొండి గుర్రాన్ని సైతం కంట్రోల్ చేస్తూ, స్వయంగా స్వారీ చేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు అని బాబీ చెప్పారు.
డాకు మహారాజ్ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ చిత్రం ఆంధ్ర ప్రదేశ్‌లో 70 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 8 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 18 కోట్లతో రికార్డు కలెక్షన్లను నమోదు చేసింది. ఈ చిత్రం ఇదే ఊపు కొనసాగిస్తే.. 200 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











