Daksha Nagarkar రావణాసుర సెట్లోకి వెళ్లేముందు.. రవితేజ గురించి అలాంటి భయం.. దక్షా నగార్కర్

మాస్ మహారాజా రవితేజ, ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా సంయుక్తంగా అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్ బ్యానర్లపై రూపొందిన చిత్రం రావణాసుర. దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన చిత్రంలో సుశాంత్, జయరాం, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, పూజితా పొన్నాడ నటించారు. రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 7వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకొన్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ దక్షా నగార్కర్ ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

కథ, ట్విస్టులు, బ్యాక్ డ్రాప్ విన్న వెంటనే..

కథ, ట్విస్టులు, బ్యాక్ డ్రాప్ విన్న వెంటనే..

రావణాసుర సినిమా ఆఫర్‌తో నన్ను నిర్మాత అప్రోచ్ అయ్యారు. సినిమాలో నా లుక్ ఎలా ఉంటుందో చెప్పారు. అలాగే సినిమా కలర్ బ్యాక్ డ్రాప్, అలాగే సినిమాలో ఉంటే ట్విస్టులు, సినిమా బ్యాక్ డ్రాప్ గురించి చెప్పడంతో ఈ సినిమాలో నటించాలని అనుకొన్నాను. అప్పటికి నాకు హీరో ఎవరో తెలియరు.

నేను ఒప్పుకొన్న తర్వాత సినిమాలో రవితేజ హీరో అని చెప్పారు. దాంతో ఇంకా నాకు మరింత సంతోషం కలిగింది. సినిమా బిగ్ స్కేల్‌లో రిలీజ్ అవుతుందని చెప్పడంతో హ్యాపీగా ఫీలయ్యాను.

నా క్యారెక్టర్ సీక్రెట్‌గా ఉంచితేనే..

నా క్యారెక్టర్ సీక్రెట్‌గా ఉంచితేనే..

రావణాసుర సినిమాలో నా క్యారెక్టర్ గురించి కథ గురించి తెలిసిపోతుంది. కాబట్టి సినిమా రిలీజ్ వరకు నా క్యారెక్టర్ ఏమిటో సీక్రెట్‌గా ఉంచుదామని చెప్పారు. అప్పటి వరకు నా క్యారెక్టర్ ఏమిటనేది గుట్టుగా ఉంచాలని అనుకొంటున్నాం. కాకపోతే కథలో బలమైన పాత్ర నాది అని చెప్పగలను. ఈ చిత్రంలో సుశాంత్‌తోపాటు ఇతర క్యారెక్టర్లతో నా పాత్ర ట్రావెల్ అవుతుంది. నా క్యారెక్టర్ గురించి చెబితే థియేటర్‌లో థ్రిల్ మిస్ అవుతుంది. అందుకే చెప్పడం లేదు.

లవ్, రొమాన్స్ అంశాలతో

లవ్, రొమాన్స్ అంశాలతో

రావణాసుర సినిమాలో నా పాత్ర పరిధిలో రొమాన్స్, లవ్ ట్రాక్ ఉంటుంది. కానీ ఆ విషయం ఏమిటో చెప్పలేను. ఇంతకు ముందు నటించిన పాత్రలకు పూర్తిగా భిన్నంగా నేను కనిపిస్తాను. నాపై చాలా సీన్లు షూట్ చేశారు. కానీ సినిమా స్టోరి డిమాండ్ మేరకు.. ఎడిటింగ్ టేబుల్‌పై ఎంత వరకు ఉంచుతారో అనేది చెప్పలేను. ఇక్కడ సినిమా ముఖ్యం. నా పాత్ర ముఖ్యం కాదు.

సుధీర్ వర్మతో పనిచేయాలని

సుధీర్ వర్మతో పనిచేయాలని

దర్శకుడు సుధీర్ వర్మతో పనిచేయాలని అనుకొంటున్నాను. అలాంటి సమయంలో నాకు ఆయన దర్శకత్వంలో అవకాశం రావడంతో మరో విషయం నేను ఆలోచించలేదు. నాకు కథ చెప్పినప్పుడు సినిమా బ్యాక్ డ్రాప్, ఇతర టెక్నికల్ అంశాలు నన్ను ఆకట్టుకొన్నాయి. స్టోరి తెర మీద ఎలా ఉండబోతుందనే విషయం నాకు అర్ధమైంది. రావణాసుర సినిమాలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది.

రవితేజ సెట్లో ఎలా ఉంటారంటే?

రవితేజ సెట్లో ఎలా ఉంటారంటే?

రావణాసుర సినిమాలో రవితేజతో నటిస్తున్నాననే విషయంలో నాకు కొంత టెన్షన్ ఉండేది. తొలి రోజు షూటింగుకు భయంగా వెళ్లాను. సెట్లో మాస్ మహారాజ్ ఎలా ఉంటారో అనే ఒకరకమైన భయం ఉండేది. రవితేజ సెట్లో చాలా సరదాగా ఉండటం చూసి హమ్మయ్యా అనుకొన్నాను. రవితేజలో గొప్ప విషయం ఏమిటంటే.. పాత్రలోకి దూరడం.. పాత్ర నుంచి బయటకు చాలా ఈజీగా వస్తారు. సెట్లో అందరితో అతడు చనువుగా ఉండే తీరు చూస్తే బిగ్ స్టార్ అనే ఫీలింగ్ కలగదు

రావణాసుర థ్రిల్లింగ్ ఉంటుందంటూ

రావణాసుర థ్రిల్లింగ్ ఉంటుందంటూ

రావణాసుర సినిమాకు రవితేజ ఫెర్ఫార్మెన్స్ పూర్తి బలం. సుశాంత్, దర్శకుడు సుధీర్ వర్మ, సినిమాటోగ్రఫి మరింత బలంగా కనిపిస్తాయి. ఈ సినిమాలో భాగమైన ప్రతీ ఒక్కరు చాలా కష్టపడి పనిచేశారు. అందుకే రావణాసుర అద్బుతంగా వచ్చింది. తెరపైన చూసినప్పడు నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X