Daksha Nagarkar ఆ స్టార్ హీరోతో అఫైర్ గురించి దక్షా నగార్కర్ క్లారిటీ.. ఆ విషయంలో జరిగిందేమిటంటే?

మాస్ మహారాజా రవితేజ, ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా సంయుక్తంగా అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్ బ్యానర్లపై రూపొందిన చిత్రం రావణాసుర. దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన చిత్రంలో సుశాంత్, జయరాం, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, పూజితా పొన్నాడ నటించారు. రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 7వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకొన్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ దక్షా నగార్కర్ ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు నా వయసు 15 సంవత్సరాలు. నా మొదటి సినిమా హోరాహోరీ చేసిన తర్వాత చదువు కోసం కొంత గ్యాప్ తీసుకొన్నాను. నా మొదటి సినిమా తర్వాత నాకు తెలుగులోనే భారీగా అవకాశాలు వచ్చాయి. తెలుగు ప్రేక్షకులు అభిరుచి చాలా గొప్పగా ఉంటుంది. తెలుగు సినిమా పరిశ్రమ వాతావరణం గొప్పగా ఉంటుంది. అందుకే నేను తెలుగులోనే నటించాలని కోరుకొంటాను. నేను చిన్న వయసులో సినిమా పరిశ్రమలోకి రావడం వల్ల అవకాశాలు తక్కువగా వచ్చాయి.

Daksha Nagarkar reactions on Affair rumours with Star Hero

అందుకే నేను తక్కువ సినిమాల్లో నటించాను. యాక్టింగ్ అనేది డిమాండ్ జాబ్. కెరీర్ ఆరంభంలో మంచి ఆఫర్ల కోసం చూశాను. అలాగని నేను నా కెరీర్‌తో ప్రయోగాలు చేయడం లేదు. నేను అన్ని రకాల పాత్రలు చేయాలనుకొంటాను. అనుభవం గడించిన కొద్ది మాధురీ దీక్షిత్, ఆలియాభట్ మాదిరిగా చేయాలని అనుకొంటున్నాను అని దక్షా నగార్కర్ అన్నారు.

నేను ఎప్పుడు కొత్త కథలు, నాకు సంబంధించి మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్నాను. నా తొలి సినిమా హోరాహోరీలో భిన్నమైన పాత్రలు పోషించాను. హుషారులో కూడా మంచి పాత్రలో కనిపించాను. ఇక రావణాసుర సినిమాలో కూడా నాకు మంచి గుర్తింపు వచ్చే పాత్రలో కనిపిస్తాను. ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ అయ్యేలా నా క్యారెక్టర్ ఉంటుంది అని దక్షా నగార్కర్ తెలిపారు.

Daksha Nagarkar reactions on Affair rumours with Star Hero

సినిమా పరిశ్రమలో హీరోలతో హీరోయిన్లకు అఫైర్ ఉందనే వార్తలు వస్తుంటాయి. నా విషయంలో ఓ హీరోతో వచ్చిన అఫైర్ రూమర్లను నేను పట్టించుకోలేదు. నా జీవితంలో, నా కెరీర్‌లో ఓ లక్ష్యంతో ముందుకెళ్తున్నాను. నా టార్గెట్ తప్ప మరో విషయాన్ని నేను సీరియస్‌గా తీసుకోలేదు. హీరోతో అఫైర్ ఉందనే రూమర్లు నా దృష్టికి వచ్చాయి. కానీ మనకు సంబంధం లేని విషయాల గురించి ఎక్కువ ఆలోచించినా ప్రయోజనం ఉండదు అని దక్షా నగార్కర్ అన్నారు.

ఇదిలా ఉండగా, బంగార్రాజు సినిమా సమయంలో నాగచైతన్యతో అఫైర్ కొనసాగుతుందనే వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. అంతేకాకుండా బంగార్రాజు ఈవెంట్‌లో నాగచైతన్య, దక్షా కన్నులతో సైగ చేసుకోవడం మీడియా కంటికి చిక్కింది. దాంతో వారిద్దరి మధ్య ఏదో ఉందనే రూమర్లు గుప్పుమన్నాయి. అయితే అలాంటిందేమీ లేదని దక్షా నగార్కర్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తనకు కెరీర్‌ను ప్రేమించడం తప్ప మరొక అఫైర్ లేదని స్పష్టం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X