Mayasabha: కుట్రలు, కుతంత్రాలా? వైఎస్, చంద్రబాబు వైరంపై దేవ కట్టా ఏం చెప్పారంటే?

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సోనీ లివ్ (Sony Liv) అందిస్తున్న డిఫరెంట్ వెబ్ సిరీస్‌తో మయ సభ. రైజ్ ఆఫ్ ది టైటాన్స్ ట్యాగ్ లైన్. సామాజిక స్పృహతోపాటు సెన్సేషనల్ కంటెంట్‌తో సినిమాలు రూపొందించే దేవా కట్టా షో రన్నర్‌గా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో రూపొందింది. హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష రూపొందించారు. ఈ వెబ్ సిరీస్‌ ఆగస్టు 7వ తేదీన స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో దర్శకుడు దేవా కట్టా.. హీరోలు ఆది పినిశెట్టి, చైతన్య రావు ఫిల్మీబీట్‌ ఎడిటర్ రాజబాబు అనుములతో ముచ్చటించారు. మయ సభ సృష్టి వెనుక వారి విజన్ ఏమిటనే విషయంలోకి వెళితే..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రియల్ లైఫ్ క్యారెక్టర్లను స్పూర్తిగా చేసుకొని వారి మధ్య స్నేహాన్ని, రాజకీయ పరమైన వైరాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించిన మయసభ వెబ్ సిరీస్‌లో సాయి కుమార్, బాలీవుడ్ నటి దివ్య దత్తా, శ్రీకాంత్ అయ్యంగార్, రవీంద్ర విజయ్, శత్రూ, తన్య రామచంద్రన్ తదితరులు నటించారు. ఇటీవల రిలీజైన టీజర్‌లోని డైలాగ్స్ రాజకీయంగా, సినిమా రంగాల్లో సంచలనం రేపాయి.

Deva Katta about Mayasabha

ఫ్రెండ్‌గా ఒక మాట చెప్పనా నాయుడు... యుద్ధం నీ ధర్మం, డబ్బులతో కొనలేనిది ఒకటే ఒకటి ఉంది... ప్రజల మనసు. మడక దున్నే కులంలో పుట్టిన వాడికి నీకెందుకు అబ్బే రాజకీయం. వసూలు చేసే కులం లో పుట్టిన రౌడీ వి నీకెందుకయ్యా వైద్యం. ప్రతిపక్ష నాయకుడికి ఎందుకు ఫోన్ చేసినావ్. ఫ్రెండ్ గానా.. ప్రత్యర్థి గానా?, స్నేహితుడి గా ఒక మాట చెప్పు. ఈ ఉచ్చు నుంచి బయటపడతానంటావా? ఈ రోజు నువ్వు గెలిస్తే... ఆ గెలుపు నా చేతిలో వెన్నుపోటు అనే బాణంగా మారుతుంది. ఆ బాణం నిన్ను ఓడించేంత వరకు వాడుతూనే ఉంటాను. చివరికి పిల్లనిచ్చిన మామ తోనే ఉనికి కోసం పోరాడుతున్నాను. వేరే దారి లేదు అని టీజర్ రెండు పాత్రల మధ్య సంభాషణ ఈ వెబ్ సిరీస్‌పై అంచనాలు పెంచింది.

డైరెక్టర్ దేవా కట్టా మాట్లాడుతూ.. ఈ వెబ్ సిరీస్ కథ వెనుక కుట్రలు, కుతంత్రాలు కాదండి. ప్రతీ కథ వెనుక ఓ మోటివ్ ఉంటుంది. ఒక అప్రోచ్ ఉంటుంది. అది రీజనబుల్‌గా, లాజిక్‌గా ఉన్నప్పుడు అది గేమ్‌గా కనిపిస్తుంది. కానీ అవి కుట్రలు, కుతంత్రాలు కావు. నేను అనుకొన్న థీమ్, ఎమోషన్స్‌ను తెలియజెప్పే ప్రయత్నంలో కొన్ని పాత్రలను ఎంచుకొన్నాను. ఆ పాత్రల్లో నేను ఉంటే ఎలా బిహేవ్ చేసి ఉంటాననే ఇమాజీనేషన్‌తో రాశాను. అలా పాత్రలతో ట్రావెల్ చేశాను. ఓ రెస్పక్ట్, డిగ్నిటీ‌తో డీల్ చేశాను అని అన్నారు.

మయసభ నా రైటింగ్‌కు దూరంగా ఉండదు. ఒకే ఆలోచన ధోరణి ఉన్న నాయకులు కలిసి ఓక డ్రీమ్ వైపు ట్రావెల్ చేస్తే.. ఆ జర్నీలో వారిద్దరూ సిద్దాంతాల ప్రకారం శత్రువులు అయితే.. ఎలా ఉంటుందనేది ఈ వెబ్ సిరీస్ కథ. ప్రస్థానం చిన్న కుటుంబ కథ అయితే.. మయసభ ఓ పెద్ద ఫ్యామిలీ కథ. టీజర్‌, ట్రైలర్‌లోనే రాజమౌళి కథ చెప్పే విధానం నన్ను బాగా ఆకట్టుకొన్నది. నేను ఆ పంథానే అనుసరించాను. చంద్రబాబు, వైఎస్ఆర్ పాత్రల విషయంలో నేను తీసుకొన్న పాయింట్ కేవలం కల్పితం. ఆ కథను చెప్పడానికి ఆగస్టు సంక్షోభాన్ని ఉపయోగించుకొన్నాను అని దేవ కట్టా చెప్పారు. ఇంకా ఈ వీడియో ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X