‘దేవర మూవీ భారీ దెబ్బ కొట్టింది.. కోట్లలో నష్టాన్ని చూశాం’
ప్రముఖ టెలివిజన్ నటుడు, దర్శకుడు ఈటీవీ ప్రభాకర్ నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం రామ్ నగర్ బన్నీ. ఈ సినిమా ద్వారా తన కుమారుడు చంద్రహాస్‌ను తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేశాడు. భార్య మలయజ, కూతురు సమర్పణలో ఈ మూవీని భారీగా నిర్మించారు. ఈ సినిమాను ఇటీవల రిలీజ్ చేయగా క్రిటిక్స్ నుంచి సానుకూల స్పందనను కూడ గట్టుకొన్నది. అయితే బాక్సాఫీస్ వద్ద సరైన రీతిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. ఈ విషయం గురించి ప్రభాకర్ గురించి క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆయన మాట్లాడుతూ..
నా కుమారుడు చంద్రహాస్‌కు సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండటంతో అతడికి అన్ని రకాల శిక్షణ ఇప్పించాం. సినీ హీరోగా పరిచయం చేస్తున్నామని తెలిసి.. చాలా మంది నిర్మాతలు సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. అయితే అందులో ఇద్దరితో సినిమా చేశాం. ఆ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత..చంద్రహాస్‌ను లాంచ్ చేయడానికి అది సరైన సినిమా కాదనే అభిప్రాయం వ్యక్తమైంది.

చంద్రహాస్‌లో ఉండే స్ట్రెంగ్త్‌ను తెలియజెప్పే విధంగా అన్ని రకాలుగా పెర్ఫార్మెన్స్‌ను బయటపెట్టేలా ఓ కథతో సినిమాను నిర్మించాలని అనుకొన్నాను. అలా రామ్ నగర్ బన్నీ సినిమా మొదలైంది. ముందుగా 3 కోట్ల రూపాయలతో సినిమాను నిర్మించాలని మొదలుపెట్టాం. కానీ అది 4 కోట్లకు, లేదా 5 కోట్ల రూపాయలకు వెళ్లిపోయింది. అయినా ఆ సినిమా వ్యయం విషయంలో ఎలాంటి పశ్చాత్తాపం మాకు లేదు అని ఈటీవీ ప్రభాకర్ తెలిపారు.
అయితే రామ్ నగర్ బన్నీ సినిమా తొలి ఆట పడిన తర్వాత చూసిన ప్రతీ ఒక్కరు చాలా పాజిటివ్‌గా స్పందించారు. రివ్యూలు కూడా సానుకూలంగా వచ్చాయి. అందరూ చంద్రహాస్ యాక్టింగ్‌ను అందరూ అప్రిషియేట్ చేశారు. నా విజన్‌కు అది తొలి మెట్టుగా భావించాను. ఈ సినిమాను నా కొడుకు సత్తాను చాటే షో రీల్‌గా చేయడం మంచి ప్రతిఫలాన్ని ఇచ్చింది అని ఈటీవీ ప్రభాకర్ తెలిపారు.

మా మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా భారీగా వస్తాయని అనుకొన్నాను. కానీ దేవర సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో మా వసూళ్లపై భారీ దెబ్బ పడింది. దాంతో మా సినిమా ఓపెనింగ్స్ కష్టమైంది. దాంతో కొన్ని రోజుల్లోనే సినిమాను థియేటర్ నుంచి తీసేయాల్సిన పరిస్థితి ఎదురైంది. దాంతో కోట్లలో నష్టం కలిగింది అని ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.
తన కెరీర్‌లోనే తొలి ప్రెస్ మీట్‌లో చంద్రహాస్ ప్రదర్శించిన బాడీ లాంగ్వేజ్‌పై నెటిజన్లు భారీగా ట్రోల్ చేశారు. ఆయనకు యాటిట్యూడ్ స్టార్ అనే టైటిల్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఆయన నటించిన రెండు చిత్రాలు కూడా రిలీజ్ సిద్దంగా ఉన్నాయి. ఈ సినిమాతో మరోసారి తన టాలెంట్ ప్రూవ్ చేసుకొంటారని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











