టికెట్ల రేటు పెంచకపోతే ఏమౌతుంది.. లైఫ్‌లో ఎన్నో సక్సెస్‌లు చూశా.. దిల్ రాజుననే విషయాన్ని మరిచా..

ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో శ్రీరాం వేణు దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. అమెరికా, దుబాయ్ లాంటి దేశాల నుంచి మంచి రిపోర్టులు వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సంబరాలు జరుపుకొన్నది. ఈ సందర్బంగా దిల్ రాజు, మాట్లాడుతూ..

వకీల్ సాబ్ సినిమా చూస్తూ

వకీల్ సాబ్ సినిమా చూస్తూ

లైఫ్‌లో ఎన్నో సక్సెస్‌లు చూశాను. కానీ వకీల్ సాబ్ సినిమా చూసిన తర్వాత ఈ అనుభూతి కొత్తగా ఉన్నాను. నిర్మాతగా మారి 18 సంవత్సరాలు అవుతున్నది. డిస్ట్రిబ్యూటర్ గా అంతకుముందు నుంచే విజయాలు చూశాను.

కూకట్‌పల్లి భ్రమరాంబ థియేటర్‌లో 4.30 గంటలకు ప్రీమియర్ సినిమా చూశాను. ఫ్యాన్స్ మధ్య సినిమా చూస్తున్న సమయంలో నన్ను నేను మరిచిపోయాను. పవన్ కల్యాణ్ ఎంట్రీ సమయంలో పేపర్లు చించి విసిరివేశాను. పది నిమిషాల తర్వాత నేను దిల్ రాజు అనే విషయం నాకు గుర్తుకు వచ్చింది అని దిల్ రాజు పేర్కొన్నారు.

మాకు ముందు నుంచి భారీ అంచనాలు

మాకు ముందు నుంచి భారీ అంచనాలు

వకీల్ సాబ్ సినిమా రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు మాకు ఉన్నాయి. వాటికి తగినట్టే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో మా అంచనాలు కరెక్ట్ అనే విషయాన్ని మరోసారి ధృవీకరించుకొన్నాం. పోస్ట్ ప్రొడక్షన్ సమయంలోనే మాకు సినిమా హిట్ అనేది అర్ధమైంది. కానీ ప్రేక్షకులు చెబితే దానిని అనుభవించాలి అనుకొన్నాం అని దిల్ రాజు అన్నారు.

అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రిపోర్ట్స్

అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రిపోర్ట్స్

మాకు ముందుగా అమెరికా నుంచి రివ్యూలు అందాయి. అలాగే దుబాయ్ రిపోర్ట్స్ వచ్చాయి. పవన్ కల్యాణ్‌తో సినిమా చేయడం వల్ల ఈ విజయం నాకు కొత్తగా అనిపించింది. ఈ సినిమా విజయాన్ని శ్రీరాం వేణు, పవన్ కల్యాణ్‌కు ఇస్తున్నాను. పవన్ కల్యాణ్‌కు ఫ్యాన్‌గా ఒక హీరోను ఇలా చూడాలని ఊహించుకొని రాసిన సీన్లకు, సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కనిపిస్తున్నది అని దిల్ రాజు తెలిపారు.

పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి

పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి

కూకట్‌పల్లిలో సినిమా చూసి బయటకు వచ్చే సరికి ఉదయం 7.30 గంటలైంది. ఏమి చేయాలో తెలియని పరిస్థితి. పవన్ కల్యాణ్ అపాయింట్‌మెంట్ తీసుకోకుండానే నేను, శ్రీరాం వేణు ఆయన ఇంటికి వెళ్లాం. సినిమాపై వస్తున్న రిపోర్టులను పవన్ కల్యాణ్‌తో కలిసి చర్చించాం. ఇది బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్, కల్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అనే మాట వినిపిస్తున్నది. అయితే ఈ సినిమా ఎలాంటి సునామీ సృష్టిస్తుందో వేచి చూడాలి అని దిల్ రాజు అభిప్రాయపడ్డారు.

Recommended Video

Pawan Kalyan Reaction After Watching Vakeel Saab
టికెట్ రేట్లు పెంచకపోవడంపై

టికెట్ రేట్లు పెంచకపోవడంపై

ఏపీలో వకీల్ సాబ్ సినిమా టికెట్ల రేట్లు పెంపు విషయంపై నేను మాట్లాడదలుచుకోలేదు. పెంచకపోతే ఏమౌతుంది? ఆ విషయాన్ని మాట్లాడే అవసరం లేదు. ఈ సినిమా ఏంటో కలెక్షన్లే నిరూపిస్తాయి. టికెట్ రేట్లు పెంచకపోవడం వల్ల ఎలాంటి ప్రభావం పడదు. దీనిపై ఎలాంటి వ్యాఖ్యలను ఎవరూ చేయవద్దు అని దిల్ రాజ్ మీడియాతో అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X