Game Changer: దిల్ రాజుకి అలాంటి అనుమానాలు.. గేమ్ ఛేంజర్‌తో తాడో పేడో!
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర రిలీజ్ కి వస్తున్నా మరో అవైటెడ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం "గేమ్ ఛేంజర్" కూడా ఒకటి. కాగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా రామ్ చరణ్ నుంచి RRR తర్వాత వస్తున్న సినిమా కావడంతో అనౌన్స్ చేసిన నాటి నుంచే మంచి హైప్ బిల్డప్ అయ్యింది.
అయితే ఇండియన్ సినిమా దగ్గర టాప్ మోస్ట్ దర్శకుడు అయ్యిన శంకర్ అలాగే రాజమౌళితో వర్క్ చేసిన ఏకైక హీరోగా చరణ్ నిలవగా ఈ సినిమా ఎప్పుడో వచ్చేయాల్సింది కానీ అలా ఆలస్యం అవుతూ వచ్చింది. కాగా మేకర్స్ అంతా సినిమాని చాలా కాన్ఫిడెంట్ గానే స్టార్ట్ చేశారు కానీ సినిమా ఎప్పుడైతే షూటింగ్ కి అలా చాలా సమయం తీసుకుంటూ వస్తుందో అక్కడ నుంచి అభిమానులకి సైతం ఆసక్తి తగ్గుతూ వచ్చింది.

కానీ తానే కొంచెం చొరవ తీసుకొని మనం మొదట అనుకున్న కథ ప్రకారమే సినిమా వెళ్తుందా లేదా అని శంకర్ గారితో కలిసి జాగ్రత్తలు తీసుకొని చేశామని తెలిపారు. అలాగే పాటలు, ఇతర అంశాల్లో కొంచెం హైప్ అనుకున్న రేంజ్ లోకి రాకపోవడం వంటివి కొంచెం నిరాశ కలిగించాయి కానీ ఫైనల్ గా వచ్చేసరికి తమకి నమ్మకం వచ్చిందని తెలిపారు.

అయితే గత కొన్నాళ్ల నుంచి దిల్ రాజు మంచి హిట్ కోసం చూస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల తాను నిర్మాణం వచించిన సినిమాలు అంతగా రాణించలేదు. అలాగే శంకర్ కి కూడా ఈ సినిమా డెఫినెట్ గా హిట్ కావాల్సిందే అని చెప్పాలి. తమ ఇద్దరికీ ఈ సినిమా హిట్ అవ్వడం అనేది చాలా కీలకం అనే తెలిపారు. మరి చూడాలి గేమ్ ఛేంజర్ వీరి గేమ్ ని మారుస్తుందో లేదో అనేది.


Click it and Unblock the Notifications











