వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్.. పవన్ మ్యాజిక్ మాటల్లో చెప్పలేం.. దిల్ రాజు ఇచ్చిన రేటింగ్ చూస్తే మైండ్ బ్లాంక్

తొలి ప్రేమ సినిమా చూసినప్పటి నుంచే పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని డిసైడ్ అయ్యాను. వకీల్ సాబ్ సినిమాతో 22 సంవత్సరాల కలతోపాటు నాకు ఒక అదనపు సంతోషం దొరికింది అని దిల్ రాజు చెప్పారు. ఏప్రిల్ 9వ తేదీన వకీల్ సాబ్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మీడియాతో దిల్ రాజు మాట్లాడుతూ..

సిమ్రత్ కౌర్ రొమాంటిక్ ఫోటోలు.. డర్టీ హరిని మించిన ఎక్స్‌పోజింగ్

శ్రీరాం వేణుకు ముందు

శ్రీరాం వేణుకు ముందు

పింక్ చిత్రాన్ని రీమేక్ చేయాలని అనుకొన్నప్పుడు చాలా మంది డైరెక్టర్ల పేర్లను పరిశీలించాం. ఆ సమయంలో శ్రీరాం వేణుకు చెబితే రెండు మూడు రోజుల్లో తన వెర్షన్ సినిమాను, కొన్ని సీన్లను చెప్పడంతో నాకు సంతృప్తి కలిగింది. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు శ్రీరాం వేణును కల్పించాను. వారిద్దరూ వెళ్లి పవన్ కల్యాణ్‌కు కథ, మార్పులు చేర్పులు చెప్పారు. దాంతో వకీల్ సాబ్ సినిమాకు వేణు శ్రీరాం దర్శకుడిగా ఖరారు అయ్యారు అని దిల్ రాజు పేర్కొన్నారు.

 100 శాతం మెప్పించారు..

100 శాతం మెప్పించారు..

దర్శకుడిగా కంటే శ్రీరాం వేణు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు అభిమాని. పింక్ రీమేక్ వకీల్ సాబ్‌గా తెరకెక్కించి మమ్మల్ని వందశాతం మెప్పించారు. మాకు ఆయనపై ఉన్న విశ్వాసాన్ని పూర్తిస్థాయిలో నిలబెట్టుకొన్నారు. మిక్సింగ్ అంతా పూర్తయిన తర్వాత శ్రీరాం వేణు‌ను కౌగిలించుకొని బ్లాక్‌బస్టర్ సినిమా అని చెప్పాను అని దిల్ రాజ్ వెల్లడించారు.

 వకీల్ సాబ్‌కు 100 మార్కులు

వకీల్ సాబ్‌కు 100 మార్కులు

పింక్, నేర్కొండ పర్వాయి సినిమాతో పోల్చితే వకీల్ సాబ్‌కు ఎంత రేటింగ్ ఇస్తారనే ప్రశ్నకు సమాధానం చెబుతూ పింక్ 50 మార్కులు వేస్తాను. అజిత్ నటించిన నేర్కొండ పార్వాయికి 75 మార్కులు వేస్తాను. వకీల్ సాబ్‌కు 100కు 10 మార్కులు వేస్తాను అని దిల్ రాజు పేర్కొన్నారు.

15వ నిమిషంలో పవన్ కల్యాణ్ ఎంట్రీ

15వ నిమిషంలో పవన్ కల్యాణ్ ఎంట్రీ

ఏప్రిల్ 9వ తేదీన వకీల్ సాబ్ మార్నింగ్ షో పడిన ఈ సినిమా డిఫరెంట్ లెవెల్ అనే టాక్ వస్తుంది. ఆ తర్వాత బ్లాక్ బస్టర్‌గా నిలువడం ఖాయం. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ 15వ నిమిషంలో పవన్ ఎంట్రీ ఇస్తారు. అప్పటి నుంచి ప్రతీ 10 నిమిషాలకు దిమ్మ తిరిగే సీన్లు ఉంటాయి. ప్రేక్షకులు థ్రిల్ కావడం తథ్యం అని దిల్ రాజు చెప్పారు.

Recommended Video

Pawan Kalyan Reaction After Watching Vakeel Saab
 వకీల్ సాబ్‌తో నా కల తీరింది

వకీల్ సాబ్‌తో నా కల తీరింది

పవన్ కల్యాణ్‌తో వకీల్ సాబ్ సినిమా చేయాలనుకోవడానికి కారణం. తొలి ప్రేమ టైమ్‌లో నేను చూసిన ఆయన క్రేజ్, స్టార్ డమ్ నా మనసులో గట్టి ముద్ర వేశాయి. పవన్‌తో సినిమా చేయాలనేది వకీల్ సాబ్‌తో తీరింది. వకీల్ సాబ్ సినిమా నా కెరీర్‌లో ఎంత పెద్ద హిట్ అవుతుందనేది రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది. వకీల్ సాబ్ మ్యాజిక్‌ను సృష్టించబోతుంది. వకీల్ సాబ్ బుకింగ్స్ చూస్తే సినిమాపై ఉన్న క్రేజ్ ఎంటో తెలుస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X