Dil Raju చిన్న సినిమా హిట్ అయితే ఆ కిక్కే వేరబ్బా.. బలగం గురించి దిల్ రాజు (ఇంటర్వ్యూ)

దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కమెడియన్ టిల్లు వేణు దర్శకత్వంలో హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం బలగం. ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్, కమెడియన్ వేణు తదితరులు నటించిన ఈ చిత్రం సినీ విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకొంటున్నది. ఈ సినిమాకు వస్తున్న రెస్సాన్స్‌తో దిల్ రాజు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమా గురించి దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ...

దిల్ రాజు ప్రొడక్షన్ ఎందుకంటే

దిల్ రాజు ప్రొడక్షన్ ఎందుకంటే

దిల్ రాజు ప్రోడక్షన్ స్థాపించి చిన్న సినిమాలు తీయాలని, కొత్తవారికి అవకాశాలు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నాం. నా కెరీర్ ఆరంభంలో ఆర్య, బొమ్మరిల్లు సినిమాల ద్వారా సినిమా పరిశ్రమకు కొత్తవారిని పరిచయం చేశాం. ఇప్పుడు కొత్తవారితో చేయడం కష్టంగా మారింది. మా రేంజ్ పెరిగి.. కొత్తవారు రీచ్ అయ్యే అవకాశం తగ్గిపోయింది. అందుకే హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి కోసం దిల్ రాజు ప్రొడక్షన్ స్థాపించాం. ఆ క్రమంలో కమెడియన్ వేణు చెప్పిన కథ నచ్చడంతో బలగం సినిమా చేశాం అని నిర్మాత దిల్ రాజు తెలిపారు.

బలగం సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్

బలగం సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్

బలగం సినిమాపై మాకు మంచి నమ్మకం ఉంది. అందుకే పది రోజుల ముందుగానే ప్రిమియర్లు వేశాం. మీడియాకు కూడా ముందే సినిమా చూపించాం. క్రిటిక్స్ నుంచి నిజాయితీగా రివ్వూలు వచ్చాయి. నేను నా పనులు పక్కన పెట్టి.. 10 రోజులుగా బలగం సినిమా యూనిట్‌తో ట్రావెల్ అవుతున్నాను. చిన్న సినిమా హిట్ అయితే ఆ కిక్కే వేరు. కొత్తవారితో సినిమా చేసినప్పుడు బడ్జెట్ ఎంతో చెప్పాను. మేము అనుకొన్న బడ్జెట్ కంటే 25 శాతం ఎక్కువైంది. కానీ మాకు పూర్తిగా సంతృప్తిని కలిగించిన చిత్రం బలగం అని దిల్ రాజు అన్నారు.

తెలంగాణ నేటివిటిని సహజత్వంగా

తెలంగాణ నేటివిటిని సహజత్వంగా

కమెడియన్ వేణు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా తీశాను. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత రషెస్ చూసి ఫర్‌ఫెక్ట్ అనుకొన్నాను. అయితే నేచురాలిటీని మిస్ కావొద్దని వేణుకు చెప్పాను. నేను చెప్పినట్టే వేణు సహజత్వంతో కూడిన సినిమాను చేశారు. కథ విన్నప్పుడే ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేయాలని అనుకొన్నాను. డబ్బుల కోసం ఓటీటీకి ఇవ్వలేదు అని దిల్ రాజు చెప్పారు.

హ్యుమర్, ఎమోషన్స్ వర్కవుట్ అయ్యాయి..

హ్యుమర్, ఎమోషన్స్ వర్కవుట్ అయ్యాయి..

చావు అనేది సినిమా అంటే డిస్‌కనెక్ట్ అవుతాం. డెత్ అనేది నెగిటివ్. సినిమా తీసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొన్నాం. హీరో క్యారెక్టర్‌ను పట్టుకొని తాత చనిపోయాడని డ్రామా చేయకుండా కథను డీల్ చేశాం. తాత మరణం తర్వాత చోటు చేసుకొనే సంఘటనల చుట్టూ.. హ్యుమర్, ఎమోషన్స్ జోడించాం. తండ్రి చనిపోయారని తెలిసిన తర్వాత కూతురు వస్తే.. ఎమోషన్స్ ఉప్పొంగుతాయి. ఆ పాయింట్ పట్టుకొని ఎమోషన్స్‌పైనే దృష్టిపెట్టాం. మెలో డ్రామాకు స్కోప్ లేకుండా జాగ్రత్తలు తీసుకొన్నాం అని దిల్ రాజు చెప్పారు.

ఆంధ్రావాళ్లు కూడా మెచ్చుకొంటున్నారు..

ఆంధ్రావాళ్లు కూడా మెచ్చుకొంటున్నారు..

చావు విషయంలో తెలంగాణలో సంస్కృతి వేరు. ఆంధ్రాలో సంస్కృతి వేరు. కానీ నిజాయితీగా సినిమా చేయాలని మొదలుపెట్టాం. సినిమా తర్వాత ఆంధ్రాలోని డిస్టిబ్యూటర్లకు సినిమా చూపించాం. నేను పనిచేసిన డైరెక్టర్లు అందరూ చాలా వరకు ఆంధ్రా వాళ్లే. సినిమా చూసిన తర్వాత వారు ఎమోషన్స్‌కు కనెక్ట్ అయ్యాం. ఆంధ్రాలోని చాలా మంది నాకు ఫోన్ చేసి ఎమోషన్స్ గురించి మాట్లాడుతున్నారు అని దిల్ రాజు చెప్పారు.

మా బ్యానర్‌లో బెస్ట్ సినిమా

మా బ్యానర్‌లో బెస్ట్ సినిమా

సినిమా మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలు బేరిజు వేసుకోలేదు. కానీ సినిమా పూర్తయిన తర్వాత బలగం టేబుల్ ప్రాఫిట్‌ ఇచ్చింది. సక్సెస్‌ఫుల్ సినిమా మాత్రమే తీయాలని అనుకొన్నాం. బలగం సినిమా లాభాలను పంచి పెట్టింది. మా పిల్లలు చేసిన తొలి సినిమా మంచి అయింది. నా కెరీర్‌లో మంచి సినిమా తీయడానికి నాలుగు సినిమాల వరకు వేచి చూసాను. బొమ్మరిల్లు నాకు బెస్ట్ సినిమా అనే ఫీలింగ్ కలిగించింది అని దిల్ రాజు పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X