ఆశీష్‌ను హీరో అంటే ఒప్పుకొను.. కొత్త హీరోకు ఆ కలెక్షన్లు రావడమే గొప్ప.. మీడియాతో దిల్ రాజు

టాలీవుడ్‌లో సినీ వారసుల జోరు ఊపందుకొన్నది. 2022లో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి అశోక్ గల్లా, దిల్ రాజు కుటుంబం నుంచి ఆశీష్ రెడ్డి సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఈ సందర్బంగా దిల్ రాజ్ మాట్లాడుతూ.. ఆశీష్‌ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకొన్నప్పుడు రెండు రకాలుగా ఆలోచించాను. ఫ్యామిలీ మూవీతో లేదా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌తో సినిమా చేయాలని భావించాను. కానీ మొదటి సినిమానే ఫ్యామిలీ ఎందుకని నా సన్నిహితులు సలహా ఇచ్చారు. దాంతో ఆశీష్‌ను యూత్, లవ్ స్టోరితో సినిమా చేయాలని డిసైడ్ అయ్యాను. మేము అనుకొన్న ప్రకారం రౌడీబాయ్స్ సినిమాలో ఆశీష్ ఎమోషన్స్ పండించాడు. యాక్షన్ సీన్లను బాగా చేశాడు. ఇక రెండో సినిమా నా తరహా జోనర్‌తో ముందుకొస్తాం అని దిల్ రాజ్ అన్నారు.

ఆశీష్‌ను హీరో అంటే ఒప్పుకొను. ఆయన ప్రస్తుతం ఆర్టిస్టు మాత్రమే. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొన్నప్పుడే హీరో అవుతాడు. హీరోను ప్రేక్షకులు తమ హీరో అని ఫీల్ కావాలి. హీరో మంచి సినిమాలు చేసినప్పడు హీరోలు అవుతారు. మంచి సినిమాలు, కథలు గురించి శ్రద్ద తీసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. ఆ విషయాన్ని నేను చూసుకొంటాను అని దిల్ రాజు చెప్పారు.

Dil Raju interview about Rowdy Boys movie 5 days box office report

కరోనావైరస్ పరిస్థితుల కారణంగా ఏపీలో 50 శాతం అక్యుపెన్సీతో థియేటర్లను నడుపుతున్నారు. ఈ అంశం రౌడీ బాయ్స్‌కు కలిసి వస్తుంది. రౌడీ బాయ్ సినిమా హౌస్‌ఫుల్స్‌తో నడవడం లేదు. జనం ఫుల్లుగా ఉంటున్నారు.. ఎందుకు రిస్క్ తీసుకోవడం అని భావించే వాళ్లకు 50 శాతం అక్యుపెన్సీ ఉపశమనం. సీట్లు ఖాళీ ఉంటున్నాయి కదా అని థియేటర్‌కు వచ్చి సినిమా ఎంజాయ్ చేస్తారు అని దిల్ రాజు తెలిపారు.

రౌడీ బాయ్స్ సినిమా బ్లాక్ బస్టర్ అని ఎప్పుడూ చెప్పను. కలెక్షన్లు పాజిటివ్‌గా వస్తున్నాయి. 5 రోజుల్లో 4 కోట్లకుపైగా షేర్ సాధించాం. ఈ షేర్ 7, 8 కోట్లకు వెళ్తుందా అనేది వేచి చూస్తున్నాం. కొత్త హీరోకు ఈ రేంజ్ వసూళ్లు రావడం గొప్ప విషయమే అని దిల్ రాజు వివరణ ఇచ్చారు.

ఆశీష్ తదుపరి సినిమా సెల్ఫీష్. సుకుమార్ రైటింగ్స్, మా బ్యానర్‌పై సినిమా నిర్మిస్తున్నాం. సుకుమార్ అసిస్టెంట్ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. స్క్రిప్టు ఫైనల్ అయిన తర్వాత సినిమా ఎప్పుడు ప్రారంభిస్తామనే విషయాన్ని వెల్లడిస్తాం. అని దిల్ రాజు చెప్పారు.

ఆశీష్ హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. రౌడీ బాయ్స్ ప్రమోషన్స్ కోసం ఆంధ్రాలో టీమ్‌తో పర్యటిస్తామని ఆశీష్ అడుగుతున్నాడు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు రౌడీ బాయ్స్ టీమ్ ఆంధ్రాలో పర్యటిస్తుంది. ఆ వివరాలను మీడియాకు అధికారికంగా వెల్లడిస్తాను అని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X