For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  థియేటర్లు మా గుప్పిట్లో లేవు..ఒక్క టికెట్‌పై ఎంత వస్తుందో తెలుసా?మాకు అదే కిక్..కుండ బద్దలు కొట్టిన దిల్ రాజు

  |

  సంక్రాంతి రేసులో బరిలో దిగిన F2 చిత్రం అగ్ర హీరోల సినిమాలను వెనక్కి నెట్టి భారీ విజయాన్ని చేజిక్కించకొన్నది. విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ఫీర్జాదా కలిసి నటించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పండించింది. F2 అందించిన విజయంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన F3 చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నది. F2కు సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం గురించి దిల్ రాజు మాట్లాడుతూ..

  డబ్బు ఆరో భూతం అంటూ దిల్ రాజు

  డబ్బు ఆరో భూతం అంటూ దిల్ రాజు

  F3 సినిమా కథ విషయానికి వస్తే.. ఫన్, ఫ్రస్టేషన్, ఫైనాన్స్ అనే కోణంలో సినిమాను రూపొందించాం. ప్రపంచంలో భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువు పంచభూతాలు. వీటితోపాటు ఆరో భూతం కూడా ఉంది. డబ్బు లేకుండా మనిషి బతకలేడు. అలాంటి డబ్బు మనుషులతో ఎలాంటి ఆటలు ఆడిస్తుందనే కోణంలో F3 చిత్రాన్ని రూపొందించాం.

  ఈ కథ, కథనాలను అనిల్ రావిపూడి అద్భుతంగా రాశాడు. తెరపైకి బాగా తీసుకురాగలిగాడు. F3 మూవీ రన్ టైం 2 గంటల 28 నిమిషాలు. ఇందులో 90 నిమిషాలు నాన్ స్టాప్‌గా ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు. నేను ఈ సినిమా చూస్తూ కడుపుబ్బ నవ్వాను. పూర్తిగా ఈ మూవీ ఫన్ రైడ్‌గా ఉంటుంది అని దిల్ రాజు పేర్కొన్నారు.

  ఓటీటీకి అలవాటు పడ్డారు అంటూ

  ఓటీటీకి అలవాటు పడ్డారు అంటూ

  కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడం వల్ల సినీ పరిశ్రమలో, ప్రేక్షకుల్లో భారీ మార్పులు వచ్చాయి. ఈ రెండేళ్ల కాలంలో ప్రేక్షకులు ఓటీటీకి బాగా చేరువయ్యారు. భారీ బడ్జెట్ చిత్రాల వల్ల టికెట్ రేట్లు భారీగా పెంచాల్సి వచ్చింది. దాంతో ప్రేక్షకుడు సినిమాకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. నాలుగైదు వారాలు గడిచితే ఓటీటీలో చూసుకోవచ్చు అనే ఫీలింగ్‌తో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నాయి. అయితే టికెట్ రేట్లు తగ్గించడం వల్ల అన్ని వర్గాలను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నాం అని దిల్ రాజు తెలిపారు.

  ఒక టికెట్ మీద రెవెన్యూ ఎంతంటే?

  ఒక టికెట్ మీద రెవెన్యూ ఎంతంటే?

  ప్రసాద్ మల్టీ‌ప్లెక్స్, ఏఎంబీ, ఇతర మల్టీ ప్లెక్స్‌లో టికెట్ ధర 250 రూపాయలు జీఎస్టీ అదనం. నగర శివారులోని మిగితా మల్టీప్లెక్స్‌లో జీఎస్టీతోపాటు 250 రూపాయలు టికెట్ ధరగా నిర్ణయించాం. సింగల్ స్క్రీన్‌లో 150 రూపాయలతో అదనంగా జీఎస్టీ వసూలు చేస్తారు అని దిల్ రాజు చెప్పారు. 250 రూపాయలు టికెట్ ధర ఉంటే.. మాకు వచ్చేది 125 రూపాయలే. మిగితా 125 రూపాయలు థియేటర్ ఓనర్‌కు వెళ్తాయి. ఈ విషయం తెలియక భారీ టికెట్ ధర మాకే వస్తాయనే ఊహాగానాల్లో ఉంటారు. అందుకే నిర్మాతకు ఎంత వస్తుందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాను అని దిల్ రాజు అన్నారు.

  థియేటర్లు మా గుప్పిట్లో లేవు

  థియేటర్లు మా గుప్పిట్లో లేవు

  నైజాంలో థియేటర్లలన్నీ గంప గుత్తగా దిల్ రాజు చేతిలో ఉన్నాయనే భ్రమలు, అపోహలు, ఆరోపణలు ఉన్నాయి. కానీ నైజాంలో 450 థియేటర్లు ఉంటే.. మాకు కేవలం 60 థియేటర్లు మాత్రమే ఉన్నాయి. మిగితా థియేటర్లు సురేష్ బాబు, ఏషియన్ వారి చేతుల్లో ఉన్నాయి. నైజాంలో దిల్ రాజు థియేటర్ల విషయంలో శాసిస్తాడు. ఆయన కంట్రోల్‌లోనే ఉంటాయనే దుష్ప్రచారం ఉంది. మిగితా సింగిల్ ఓనర్ థియేటర్లకు మాకు మంచి సంబంధాలు, ఆర్థిక వ్యవహారాల్లో అవగాహన ఉండటం వల్ల మాకు థియేటర్లను ఇవ్వడానికి ముందుకు వస్తారు. మేము థియేటర్లను ఎప్పడూ గుప్పిట్లో పెట్టుకోలేదు అని దిల్ రాజు తెలిపారు.

  అలాంటి ఆదాయమే మాకు కిక్

  అలాంటి ఆదాయమే మాకు కిక్

  సినిమా బిజినెస్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి థియేట్రికల్, రెండోది నాన్ థియేట్రికల్ రైట్స్. నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్మితే ఎంత వచ్చినా నాకు కిక్ ఉండదు. థియేట్రికల్ రెవెన్యూ నాకు మంచి కిక్ ఇస్తుంది. రెండు, మూడు వారాలు ఆడింది. దాంతో ఇంత వచ్చిందనే విషయం నాకు సంతృప్తిని ఇస్తుంది. టికెట్ ధర తగ్గింపు వల్ల F3 సినిమాకు రిపీట్ ఆడియెన్స్ వస్తారు. ప్రేక్షకులతో థియేటర్లు కళకళలాడుతాయి అని దిల్ రాజు ధీమా వ్యక్తం చేశారు.

  English summary
  Star producer Dil Raju's F3 movie to hit the Theatres on May 27th. In this occassion, He spoke to media and revealed about movie and Ticket rate issues.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X