Dil Raju దిమ్మ తిరిగే కథలతో ప్యాన్ వరల్డ్ సినిమాలు.. ఆ ముగ్గురు టాప్ హీరోలతో ప్లానింగ్.. దిల్ రాజు క్లారిటీ
తెలుగు సినిమా పరిశ్రమలో దిల్ రాజు ఓ బ్రాండ్‌గా మారిపోయారు. డిస్టిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించి.. నిర్మాతగా మారిన ఆయన 50 చిత్రాలకుపైగా సినిమాలు పూర్తి చేశారు. ప్రస్తుతం డజన్ సినిమాలు ప్లానింగ్‌లో ఉన్నాయి. అయితే సినిమా రంగంలో చోటు చేసుకొంటున్న మార్పులకు అనుగుణంగా మార్వెల్, సూపర్ హీరోస్ కథతో సినిమాలు ప్లాన్ చేస్తున్నాం అని చెప్పారు. F3 సినిమా రిలీజ్ నేపథ్యంలో మీడియాతో దిల్ రాజు మాట్లాడుతూ..

ఎన్టీఆర్, టాప్ హీరోలతో మూవీస్
టాలీవుడ్‌లో టాప్ హీరోలతో ప్యాన్ ఇండియా సినిమాలు చేసే ప్లాన్ జరుగుతున్నది. ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనే ఉద్దేశంతో స్క్రిప్టు రెడీ చేస్తున్నాం. ఎన్టీఆర్ చాలా సినిమాలతో బిజీగా ఉన్నారు. RRR మూవీ తర్వాత ప్రస్తుతం కొరటాల శివతో సినిమా చేయాలని రెడీ అవుతున్నారు. అయితే ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని ప్లానింగ్ జరుగుతున్నది. కొరటాల, ప్రశాంత్ నీల్ సినిమాల తర్వాత మా సినిమా ఉండటానికి అవకాశం ఉంది అని దిల్ రాజు తెలిపారు.

ప్రభాస్ రేంజ్‌కు తగినట్టుగా
అలాగే ప్రభాస్‌తో కూడా సినిమా ప్లాన్ చేస్తున్నాం. ప్రభాస్ రేంజ్‌కు తగిన విధంగా స్క్రిప్టు రెడీ అవుతున్నది. కరోనా కారణంగా ప్రతీ ఒక్కరి విషయంలో రెండేళ్లు పోయింది. దాంతో ప్రభాస్, ఇతర హీరోల సినిమాలు చేయడంలో కొంత గ్యాప్ వచ్చింది. ప్రభాస్‌తో కూడా సినిమా చేస్తాం. ప్రస్తుతం ప్రభాస్‌కు ఉన్న క్రేజ్‌కు తగినట్టుగా కథను సిద్దం చేస్తున్నాం అని దిల్ రాజు పేర్కొన్నారు.

ఐకాన్ సినిమా గురించి
అల్లు అర్జున్‌తో కూడా సినిమా ప్లానింగ్ ఉంది. ఐకాన్ సినిమా కూడా మా బ్యానర్‌లో ఉంటుంది. ప్రస్తుతం పుష్ప తర్వాత అల్లు అర్జున్ కెరీర్ గ్రాఫ్ మారిపోయింది. పుష్ప2 సినిమా బిజీలో ఉన్నారు. పుష్ప 2 తర్వాత గానీ.. లేదా మరో సినిమా తర్వాత అల్లు అర్జున్‌తో మూవీ చేయాలని అనుకొంటున్నాం. తెలుగులో టాప్ హీరోలందరికి కథను సిద్దం చేస్తున్నాం అని దిల్ రాజు చెప్పారు.

అవతార్, మార్వెల్ తరహా
ప్రపంచ సినిమా రంగంలో అనేక మార్పులు వచ్చాయి. సినిమా పరిశ్రమలో చోటుచేసుకొన్న ఒడిదుడుకులను తట్టుకొని మార్వెల్, సూపర్ హీరోస్ సినిమాలే పోటిని తట్టుకొని నిలబడ్డాయి. హాలీవుడ్‌లో చిన్న సినిమాల గురించి ఎవరు పట్టించుకొంటారు. ప్రస్తుతం అవతార్, మార్వెల్ లాంటి సినిమాల గురించే మాట్లాడుతున్నారు. మేము కూడా మూడు స్క్రిప్టులు సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే ఆ వివరాలను ప్రకటిస్తాం అని దిల్ రాజు చెప్పారు.

ప్యాన్ వరల్డ్ స్థాయిలో
టాలీవుడ్‌లో కూడా లార్జర్ ద్యాన్ లైఫ్ సినిమాలకు రాజమౌళి మార్గదర్శకంగా నిలిచారు. మా బ్యానర్‌లో కూడా ప్యాన్ వరల్డ్ స్థాయిలో కథలను మూడేళ్లుగా చేస్తున్నాం. స్క్రిప్టు వర్క్, ప్రీ ప్రోడక్షన్ వర్క్ కూడా జరుగుతున్నది. మార్వెల్ సినిమాల స్టయిల్‌లో మా సినిమాలు ఉంటాయి. షూటింగ్ పూర్తి చేసుకొన్న తర్వాత ఏడాదిపాటు వీఎఫ్ఎక్స్ కోసం కేటాయించాలి. ఇలాంటి ప్లానింగ్‌తో మేము, మా ప్రొడక్షన్స్ టీమ్ ముందుకు వెళ్తున్నది.


Click it and Unblock the Notifications











