‘బ్రేకప్‌ తర్వాత లవర్‌ను శత్రువుగా చూడొద్దు.. అలా కనెక్ట్ అయితే తప్పేమిటి?’

టాలీవుడ్‌లో యువ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా రుక్సర్ ధిల్లాన్, క్యాతీ డేవీసన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం దిల్ రుబా. దర్శకుడిగా విశ్వ కరుణ్ పరిచయం అవుతూ రూపొందించిన చిత్రానికి విక్రమ్ మెహ్రా, సిద్దార్థ్ ఆనంద్ కుమార్, రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. లవ్, రొమాంటిక్, యాక్షన్ రూపొందిన ఈ సినిమాను శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ, ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మార్చి 14వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా గురించి దర్శకుడు విశ్వ కరుణ్ మాట్లాడుతూ..

మా స్వస్థలం తాడేపల్లిగూడెం. నా విద్యాభ్యాసం భీమవరంలో జరిగింది. బాల్యం నుంచి సినిమాలపై ఆసక్తి పెరిగింది. నేను చూసిన సినిమాలు, హీరోలు, హీరోయిన్లు నన్ను ప్రభావితం చేశాయి. దాంతో సినిమా రంగం వైపు అడుగులేశాను. కొన్ని ప్రయత్నాల తర్వాత బాహుబలి రైటర్ విజయేంద్రప్రసాద్ వద్ద పనిచేశాను. ఆ తర్వాత దిల్ రాజు సంస్థలో రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశాను. ఆ క్రమంలో నేను చెప్పిన కథ హీరో కిరణ్ అబ్బవరంకు నచ్చలేదు. కానీ చెప్పిన విధానం బాగుందని అప్రిషియేట్ చేసి.. మరో కథ ఏదైనా ఉంటే చెప్పమన్నాడు. అలాంటి పరిస్థితుల్లో నేను చెప్పిన దిల్ రుబా కథ నచ్చింది. అలా ఈ సినిమా ద్వారా నేను దర్శకుడిని అయ్యాను అని విశ్వ కరుణ్ చెప్పారు.

Dil Ruba Director Vishwa Karun coined a new concept about Love and Breakup

దర్శకత్వం, క్రియేటివ్ విభాగంలో కిరణ్ అబ్బవరం ఇన్‌వాల్వ్ అవుతారనేది తప్పు. నా విషయంలో ఎన్నడూ అలాంటి పనిచేయలేదు. ఏ యాక్టర్‌కైనా కెరీర్‌లో తడబాటు కలిగినప్పుడు కథ, ఇతర విషయాల్లో జాగ్రత్త పడుతారు. కిరణ్ కూడా చేసింది అదే. కానీ దిల్ రుబాకు ఇచ్చిన ప్రోత్సాహం నేను ఎప్పుడూ మరిచిపోలేను. ఎప్పుడూ నా వెంట ఉంటూ సినిమాను బాగా చేయి. కావాలంటే టైమ్ తీసుకో బ్రదర్. టెన్షన్ పడకు అంటూ సపోర్ట్ చేశారు అని ఆయన అన్నారు.

Take a Poll

దిల్ రుబా సినిమా మూలకథ విషయానికి వస్తే.. తప్పు లేనప్పుడు సారీ చెప్పడం ఎందుకు? ఏవరైనా మంచి చేస్తే థ్యాంక్స్ సరిపెట్టుకోవడం కరెక్ట్ కాదు అనేది హీరో క్యారెక్టరైజేషన్. ఈ కాన్సెప్ట్ ద్వారా హీరో క్యారెక్టర్ రన్ అవుతుంది. ఆ క్రమంలో హీరోకు ఓ బ్రేకప్ జరిగి.. మరోసారి ప్రేమలో పడుతాడు. ఆ తర్వాత హీరో లైఫ్‌లో ఏం జరిగింది? హీరో అలాంటి థియరీని ఎందుకు అడాప్ట్ చేసుకొన్నాడనేది సినిమా కథ అని దర్శకుడు విశ్వ కరుణ్ చెప్పారు.

Dil Ruba Director Vishwa Karun coined a new concept about Love and Breakup

సాధారణంగా లవ్ బ్రేకప్ జరిగినప్పుడు లవర్‌ను శత్రువులా చూస్తుంటారు. ప్రేమలో పడటానికి ముందు వారి మధ్య ఉండే ఫ్రెండ్‌షిప్ మాత్రమే. ఆ రిలేషన్‌ను బ్రేకప్ తర్వాత కూడా కొనసాగించవచ్చు. బ్రేకప్ తర్వాత ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. దిల్ రుబా కథలో ఇలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఇలాంటి అంశాలతోపాటు ఎమోషన్స్‌తో కూడిన ట్విస్ట్ ఉంటుంది అని విశ్వ కరుణ్ తెలిపారు.

సౌత్‌లో రిలీజై సక్సెస్ అయిన డ్రాగన్ మూవీకి దిల్ రూబాకు సంబంధం లేదు. మా మూవీ ట్రీట్ మెంట్ వేరుగా ఉంటుంది. ప్రేమ కథలన్నీ ఒకటే మనం వాటిని తెరపై చూపించే విధానమే కొత్తగా ఉండాలి. అలాంటి కొత్త తరహా ప్రేమ కథను దిల్ రూబాలో చూస్తారు. మా సినిమా కోసం అత్యవసరంగా పాట కావాల్సి వచ్చినప్పుడు నేనే స్వయంగా ఓ పాట రాశా. మనం చూసిన మనుషులు, సందర్భాలే ఏ కథకైనా స్ఫూర్తినిస్తాయి. దిల్ రూబా టైటిల్ వినగానే క్యాచీగా ఉంది. టైటిల్ లో ఒక మంచి సౌండ్ ఉంది అనిపించింది అని చెప్పారు.

More from Filmibeat

Read more about: kiran abbavaram
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X