కుష్బూ నాకు సెకండ్ మదర్.. గోపిచంద్‌తో అలాంటి అనుభవం.. డింపుల్ హయతి
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాతలు విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల రూపొందిస్తున్న చిత్రం రామబాణం. దర్శకుడు శ్రీవాసు రూపొందించిన ఈ చిత్రంలో మాచో స్టార్ గోపిచంద్, డింపుల్ హయతి జంటగా నటించారు. ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఇలాంటి పాజిటివ్ పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం మే 5వ తేదీన రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సందర్భంగా హీరోయిన్ డింపుల్ హయతి తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..
కుష్బూ కూతురితో నాకు బాండింగ్ : రామబాణం సెట్లో ఎప్పుడూ చాలా మంది నటీనటులు ఉండేవారు. కుష్బూతో నా ప్రయాణం ఎమోషనల్‌గా సాగింది. కుష్బూ నాకు సెకండ్ మదర్ లాంటి వారు. ఆమె కూతురుతో మంచి బాండింగ్ ఏర్పడింది. ఫారిన్ ట్రిప్‌లో నన్ను ఆమె కూతురిలా చూసుకొన్నది. తన కెరీర్ ఆరంభంలో ఆమెకు ఎదురైన చేదు అనుభవాలను వివరించారు. అలాగే జగపతి బాబు కూడా తన కెరీర్, తన అనుభవాలను చెప్పడం వల్ల నేను చాలా నేర్చుకొన్నాను అని డింపుల్ తెలిపారు.

కుష్బూతో నా జర్నీ మరిచిపోలేనిది : కుష్బూ లెజెండరీ యాక్టర్. నా నుంచి ఆమె కొన్ని నేర్చుకొన్నానని చెప్పడం ఆమె గొప్పతనం. మేమిద్దరం షాపింగ్ వెళ్లినప్పుడు ఏమి తీసుకోవాలో తెలియలేదు. ఆమె స్వయంగా వచ్చి.. నా స్కిన్‌కు ఎలాంటి సరిపోతుందని చెక్ చేసి కొన్నారు. షూటింగులో మా అమ్మ లేనప్పుడు.. కుష్బు నాకు తల్లిలా చూసుకొన్నారు. ఆమెతో జర్నీ మరిచిపోలేనిది అని డింపుల్ పేర్కొన్నారు.
గోపిచంద్ బిహేవియర్ ఎలా అంటే.. : గోపిచంద్ విషయానికి వస్తే.. ఆయన చాలా డిఫరెంట్ పర్సనాలిటీ. ఆయన తక్కువగా మాట్లాడుతారు. ఎక్కువగా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తారు. పొద్దున్న హాయ్ అంటే.. సాయంత్రం బాయ్ అంటారు. అంతకు ముందు రవితేజతో సినిమా చేశాను. ఆయన సెట్లో ఉంటే సందడే సందడిగా ఉంటుంది. రవితేజకు గోపిచంద్ పూర్తిగా కాంట్రాస్ట్ పర్సన్. కామ్‌గా, కంపోజ్‌గా ఉండే గోపిచంద్‌తో నటించడం కొత్త ఎక్స్‌పీరియెన్స్. ఏదైనా తప్పు చేస్తే.. కళ్లతోనే కోపాన్ని ప్రదర్శిస్తారు. కంప్లీట్ డిఫరెంట్ పర్సన్. నేను వర్క్ చేసిన హీరోల్లో వేరి జెంటిల్‌గా ఉన్నారు. గోపిచంద్ కూడా నాకు సపోర్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అని డింపుల్ హయతి తెలిపారు.

టాలీవుడ్‌లో మంచి ప్రోత్సాహం: టాలీవుడ్ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు మంచి ప్రోత్సాహం లభిస్తున్నది. తెలుగు పరిశ్రమలో తెలుగు అమ్మాయిల పట్ల చాలా పాజిటివ్ మార్పులు వస్తున్నాయి. శ్రీలీల, నాలాంటి వాళ్లకు మంచి ఆఫర్స్ లభిస్తున్నాయి. టాలీవుడ్‌లో పరిస్థితులు మారాయి. అప్రోచ్ మారాయి. ఇంకా నలుగురైదురు ఉంటే ఇంకా పాజిటివ్ అప్రోచ్ కనిపిస్తుంది. అంతేకాకుండా మన తెలుగువాళ్లే హీరోయిన్లు ఉండాలనే అభిప్రాయం కలుగుతుంది. గతంలో జయసుధ, జయప్రద లాంటి వాళ్లు ఉండేవాళ్లు. ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ తెలుగు హీరోయిన్లకు ప్రోత్సాహం లభిస్తున్నది. ఇంకా మార్పు రావాలని కోరుకొంటున్నాను అని డింపుల్ హయతి చెప్పారు.


Click it and Unblock the Notifications











