Agent తెలుగు ఫ్యాన్స్ ఒక్కసారి ప్రేమిస్తే.. జీవితాన్ని ఇస్తారు.. నాగార్జున, చిరంజీవి గురించి.. డినో మారియా
బాలీవుడ్‌లో రొమాంటిక్ హీరో డినో మారియా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా ద్వారా ఆయన తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఏజెంట్ చిత్రంలో గాడ్ అనే పవర్ ఫుల్ పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో డినో మారియా తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..
రాంచరణ్ ద్వారా అఖిల్ పరిచయం: ఏజెంట్ సినిమాకు ముందే నాకు అఖిల్ తెలుసు. ముంబైలో ఓ పార్టీలో రాంచరణ్ ద్వారా పరిచయమయ్యారు. అప్పుడు సన్నగా చిన్న పిల్లాడిలా ఉండేవాడు. ఏజెంట్ షూటింగ్‌లో అఖిల్‌ను చూసి షాక్ అయ్యాను.హైట్, లావుగా, ఫిట్‌గా, సిక్స్ ప్యాక్ బాడీతో ఆయనను చూసి అఖిలేనా అనుకొన్నాను.

అఖిల్‌తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. టాలీవుడ్‌లో ఏజెంట్ సినిమా కొత్త జోనర్ అవుతుంది. ఎంపైర్ సినిమా చూసి నాకు సురేందర్ రెడ్డి, అనిల్ సుంకర కాల్ చేశారు. దాంతో అఖిల్‌తో చేసే అవకాశం లభించింది అని డినో మారియా తెలిపారు.
ప్రతీ సినిమా పరిశ్రమలో: ఏజెంట్ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెడుతున్నాను. ప్రతీ ఇండస్ట్రీలో అంతా సేమ్ ఉంటుంది. కానీ వేరే భాష నుంచి వచ్చిన నాకు ఈ సినిమా పరిశ్రమలో నాకు లభించిన గౌరవం గొప్పగా ఉంది. ప్రతీ సినిమా పరిశ్రమలో క్రియేటివ్ టీమ్ అంతా సేమ్ ఉంటుంది. భాష ఒక్కటే మార్పు. ప్రతీ సినిమా కోసం నా క్యారెక్టర్‌తో ప్రిపేర్ అయి వచ్చినట్టే అన్ని భాషలకు అదే చేస్తుంటాను అని డినో మారియా చెప్పారు.

పఠాన్ సినిమాలో మాదిరిగానే..: స్పై థ్రిల్లర్ సినిమాలో బ్యాక్ డ్రాప్ వేరే ఉంటుంది. స్టోరిలో ట్విస్టులు, జర్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. యాక్షన్, సౌండ్, మ్యూజిక్, ఫైట్స్ అన్ని కోత్తగా ఉంటాయి. పఠాన్ సినిమాలో మాదిరిగానే ఏజెంట్ మూవీలో కూడా ముగ్గురు ఏజెంట్లు ఉంటారు. మేము పఠాన్ సినిమా కంటే ముందుగానే మా సినిమాను మొదలుపెట్టాం. కానీ పఠాన్ సినిమా ముందు వచ్చింది. కానీ ఏజెంట్ సినిమా ట్రీట్‌మెంట్ చాలా కొత్తగా ఉంటుంది. సురేందర్ రెడ్డి టేకింగ్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది అని డినో మారియా చెప్పారు.

తెలుగు అభిమానులు ఎలాంటి వారంటే?: వరంగల్‌లో జరిగిన ఏజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లాను. నాకు సరికొత్త అనుభూతి కలిగింది. అక్కడ అభిమానుల స్పందన చూసి థ్రిల్ అయ్యాను. తెలుగులో అభిమానుల లాయల్టీ చాలా గొప్పగా ఉంటుంది. ఒక హీరోను ఒకసారి ప్రేమించడం మొదలుపెడితే.. జీవితకాలం అలానే ఉంటారు.
హీరోను అభిమానిస్తే జీవితాన్ని ఇచ్చేస్తారు. నాగార్జున, చిరంజీవి లాంటి హీరోలకు భారీ సంఖ్యలో అభిమానులు, ఫ్యాన్స్ క్లబ్ ఉన్నాయి. ఇక్కడి ప్రేక్షకులు సినిమాను విశేషంగా అభిమానిస్తారు అని డినో మారియా అన్నారు.


Click it and Unblock the Notifications











