twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆయన నన్ను రౌడీ సంజన అని పిలిచేవారు!

    |

    Recommended Video

    Rajugadu Movie Director Sanjana Reddy Interview

    రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం రాజుగాడు. సంజనారెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన అమైరా దస్తూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సంధర్భంగా రాజుగాడు దర్శకురాలు సంజనా రెడ్డి తో ఇంటర్వ్యూ...

    ఆ అనుభవంతో సొంతంగా

    ఆ అనుభవంతో సొంతంగా

    మాది శ్రీకాకుళం. చదువు పూర్తి అయ్యాక కొంతకాలం మాథ్స్ సబ్జెక్టు టీచర్ గా వర్క్ చేసాను. ఆ తరువాత ఆంధ్రజ్యోతి లో కొంతకాలం జర్నలిజం చేసాను. తరువాత రామ్ గోపాల్ వర్మ గారిదగ్గర రౌడి సినిమాకు దర్శకత్వ శాకలో పనిచెయ్యడం జరిగింది. ఆ అనుభవంతో సొంతంగా కథ రాసుకున్నాను.

    రాజ్ తరుణ్ అయితే బాగుంటుంది

    రాజ్ తరుణ్ అయితే బాగుంటుంది

    నేను కథ రాసుకున్నప్పుడు ఈ కథకు ఎవరు సెట్ అవుతారని చూస్తున్నప్పుడు... రాజ్ తరుణ్ అయితే బాగుంటుంది అనిపించింది. రాజ్ తరుణ్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో సినిమా చేయ్యబోతున్నాడని తెలిసి రాజ్ తరుణ్ కు స్టోరీ చెప్పడం జరిగింది.

    రాజు కావున రాజుగాడు

    రాజు కావున రాజుగాడు

    నేను స్టోరీ నరేట్ చేసినప్పుడు రాజ్ తరుణ్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. నిర్మాత అనిల్ సుంకర గారికి కథ బాగా నచ్చడంతో సినిమా వెంటనే ప్రారంభం అయ్యింది. సినిమాలో హీరో పేరు రాజు కావున రాజుగాడు పేరు పెట్టడం జరిగింది.

    క్లెప్టోమేనియా అనే వింత వ్యాధితో

    క్లెప్టోమేనియా అనే వింత వ్యాధితో

    రాజుగాడు చిత్రంలో రాజ్ తరుణ్ క్లెప్టోమేనియా అనే వింత వ్యాధితో ఉంటాడు. ఈ వ్యాధి లక్షణం ఏంటంటే.. తనకు తెలియకుండానే దొంగతనం చేయడం. మన చుట్టుపక్కల ప్రతి పది మందిలో ఒకరు ఈ వ్యాధితో ఉంటారు.

    రాజ్ తరుణ్, రాజేంద్రప్రసాద్

    రాజ్ తరుణ్, రాజేంద్రప్రసాద్

    రాజుగాడు సినిమాలో రాజ్ తరుణ్ పేరెంట్స్ గా రాజేంద్ర ప్రసాద్, సితార నటించడం జరిగింది. రాజ్ తరుణ్, రాజేంద్రప్రసాద్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. గతంలో వారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాగా ఆడడం జరిగింది.

    మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ

    మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ

    నాకు ఇష్టమైన దర్శకులు మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ. వారిద్దరూ గతంలో క్లాసిక్స్ తీయ్యడం జరిగింది. వారి సినిమాలను అనుసరిస్తూ గతంలో చాలా సినిమాలు వచ్చాయి. వారి సినిమాలు చూసి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను.

    ఒక లేడి అసిస్టెంట్ డైరెక్టర్ కావాలి

    ఒక లేడి అసిస్టెంట్ డైరెక్టర్ కావాలి

    రామ్ గోపాల్ వర్మ దగ్గర చెయ్యడానికి ఒక లేడి అసిస్టెంట్ డైరెక్టర్ కావాలి అన్నారు. ఆ సమయంలో నేను రాముని కలవడం జరిగింది. రౌడి సినిమాకు తన దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు మోహన్ బాబు నన్ను రౌడీ సంజన అని పిలిచేవారు.

    English summary
    Young actor Raj Tarun, who has stuttered in recent times after an encouraging start to his film career, is looking to bounce back with his last films. his latest film rajugadu coming theaters very soon. on this we have a interview with director sanjana reddy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X