RX 100 టైటిల్ వెనుక చాలా పెద్ద తతంగం.. ఎమోషనల్‌గా.. అగ్రెసివ్‌గా!

By Rajababu

Recommended Video

RX 100 Movie Director Ajay Bhupathi Exclusive Interview With Filmibeat Telugu

ఇటీవల కాలంలో యువ డైరెక్టర్ల చిత్రాలు ఎంత హంగామా చేస్తున్నాయో తెలిసిందే. పెళ్లిచూపులతో తరుణ్ భాస్కర్, అర్జున్‌రెడ్డితో సందీప్ వంగ, తొలిప్రేమతో వెంకీ అట్లూరి సెన్సేషనల్ విజయాలను సొంతం చేసుకొన్నారు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి ప్రస్తుతం ఆర్ఎక్స్ 100 అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం రిలీజ్‌కు ముందే మంచి టాక్‌తో దూసుకెళ్తున్నది. విభిన్నమైన టైటిల్ పెట్టడానికి వెనుక ఆసక్తికరమైన విషయాలను దర్శకుడు అజయ్ భూపతి తెలుగు ఫిల్మ్‌బీట్‌కు వెల్లడించారు.

నేటివిటితో ప్రేమ కథ

నేటివిటితో ప్రేమ కథ

తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో అనేక రకాలైన నేటివిటీలు ఉన్నాయి. వాటిపై సరిగా ఎవరూ దృష్టిపెట్టడం లేదు. పూర్తిస్థాయిలో నేటివిటి ఆధారంగా సినిమాను తెరకెక్కించాలని తొలి ప్రయత్నంలోనే బలంగా అనుకొన్నాను. గోదావరి జిల్లా నేటివిటితో పూర్తిస్థాయి ప్రేమకథను రూపొందించాను.

అప్పుడే ఫిక్స్ అయ్యాను

అప్పుడే ఫిక్స్ అయ్యాను

కథ రాసినప్పుడే యమాహా ఆర్ఎక్స్ 100 అనే టైటిల్ పెట్టాలని ఫిక్స్ అయ్యాను. హీరో, నిర్మాతకు కథ చెప్పినప్పుడు ఈ విషయాన్ని స్పష్టం చేశాను. ఆ తర్వాత లీగల్‌గా చిక్కులు వస్తాయేమోనని ఆలోచించి హైదరాబాద్‌లోని యమహా కంపెనీ ఉద్యోగులను సంప్రదించాం. పెద్దగా వారు పట్టించుకోలేదు. చివరికి చెన్నైలోని సౌత్ విభాగంతో చర్చించాం.

యమహా కంపెనీతో చర్చలు

యమహా కంపెనీతో చర్చలు

సౌత్ మార్కెటింగ్ విభాగం కూడా ఆర్‌ఎక్స్ 100 టైటిల్‌ పెట్టుకోవచ్చా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. దాంతో జపాన్‌లోని యమహా కంపెనీ వారికి మెయిల్ రాశాం. మా మెయిల్‌కు స్పందించిన వారు కొంత అభ్యంతరం చెప్పారు. పలుమార్లు ఉత్తరప్రత్యుత్తరాలు జరిగాయి. ఆ తర్వాత టైటిల్ నుంచి యమహా తొలగించి RX 100 పెట్టుకోవచ్చని సూచించారు. దాంతో మాకు టైటిల్‌పై టెన్షన్ తగ్గిపోయింది.

హీరో క్యారెక్టర్ ఆధారంగానే

హీరో క్యారెక్టర్ ఆధారంగానే

ఆర్ఎక్స్ 100 టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందనే విషయంపై దర్శకుడు అజయ్ భూపతి క్లారిటీ ఇచ్చారు. సాధారణంగా ఆర్ఎక్స్ 100 బైక్ నడిపే వారు చాలా ఎమోషనల్‌గా, ఉద్రేకపూరితంగా ఉంటారు. నా కథలో హీరో కూడా అలాంటి వాడే. అతడు కూడా ఈ వాహనాన్ని నడుపుతాడు. కథలో బైక్‌కు ప్రాధాన్యం ఉంది. అందుకే దానికి ఆ టైటిల్ పెట్టాల్సి వచ్చింది అని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X