twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోరిక తీర్చుకోవడానికి రేప్ చేయలా? అక్కడ అంటరానితనం గుర్తుకు రాదా? డైరెక్టర్ డాక్టర్ మోహన్ ఆవేదన (ఇంటర్వ్యూ)

    |

    సమాజంలో జరుగుతున్న అరాచకాలకు ముగింపు పలికే విధంగా సినీ విమర్శనాస్త్రంగా రూపొందిన చిత్రం 1997. విభిన్నమైన కథ, కథనాలతో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 26న గ్రాండ్ గా విడుదల అవుతుంది. డాక్టర్ మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో నటించారు., డాక్టర్ మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్‌పై 1997 చిత్రం తెరకెక్కింది.

    ఈ సినిమాలో అవినీతి పోలీస్ అధికారిగా భిన్నమైన పాత్రలో నటించిన శ్రీకాంత్ అయ్యంగార్ సినిమా విడుదల సందర్బంగా మీడియాతో శ్రీకాంత్ అయ్యంగార్ ఇంటర్వ్యూ విశేషాలు ...

    ప్రశ్న: 1997 సినిమా గురించి చెప్పండి?

    ప్రశ్న: 1997 సినిమా గురించి చెప్పండి?

    జవాబు: ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కథ. నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో ఈ కథ ఉంటుంది. ఇందులో ఒక అమ్మాయిని రేప్ చేసిన తరువాత ఆమె పడే మానసిక వేదన, ముఖ్యంగా ఆమె తల్లి తాలూకు ఎమోషన్ ఎలా ఉంటుంది. ఒక అమ్మాయిని రేప్ చేసాక చంపేస్తున్నారు. ఎందుకు? అమ్మాయిని రేప్ చేయడానికి కారణం కామం.

    ఆ కామాన్ని తీర్చుకోవాలంటే చాలా దారులు ఉన్నాయి. అలాంటప్పుడు ఎందుకు అమ్మాయిలను రేప్ చేస్తున్నారు. ఇది ఓ డోరా అహంకారానికి బలైన ఓ అమాయకురాలు కథను చెప్పే ప్రయత్నం. అయితే తక్కువ కులానికి చెందిన వాళ్ళను ఇంట్లోకి రానివ్వరు, గుడిలోకి రానివ్వరు కానీ ఆమెతో లైంగిక వాంఛ తీర్చుకోవడానికి పనికి వస్తుందా ? ఇక్కడ లేని అంటరానితనం అన్నది ఎందుకు అక్కడ లేదు అన్న అంశంతో ఈ సినిమా ఉంటుంది.

     ప్రశ్న: అంటే ఈ కథ 1997 లో జరిగిందా?

    ప్రశ్న: అంటే ఈ కథ 1997 లో జరిగిందా?

    జవాబు: 1997 లో జరిగిన కథ కాదు.. నేను ఆ సమయంలో విన్న కథ, నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివాను, హాలిడేస్ కు ఊరికి వెళ్ళినప్పుడు మా తాతగారు చెప్పిన కథ ఇది. అప్పటినుండి ఆ కథ నా మైండ్ లో అలా ఉండిపోయింది. ఆ కథను తెరపై ఆవిష్కరించాలని ఉద్దేశంతో సినిమాగా తీసాను. ఇలాంటి సంఘటనలను ప్రజలకు చెప్పాలనే ప్రయత్నమే.

    ప్రశ్న: అసలు ఈ సినిమా ఎలా సెట్స్ పైకి వచ్చింది?

    ప్రశ్న: అసలు ఈ సినిమా ఎలా సెట్స్ పైకి వచ్చింది?

    జవాబు: ఈ కథ ఆలోచన వచ్చాక దాన్ని రాసుకున్నాను . ఆ తరువాత నటుడు జీవి నాకు ఫ్రెండ్ ఆయనను కలిసాను, కథ విన్నాకా అయన కూడా చాలా బాగుంది అన్నారు. మరి దీన్ని ఎలా తెరపైకి తేవడం అన్న ఆలోచనలో నిర్మాతలను కలవడం అదంతా వర్కవుట్ అవ్వదన్న ఆలోచనతో మనమే చేయాలనీ మొదలెట్టాం. అలాగే దర్శకత్వం విషయంలో కూడా వేరే దర్శకులను అడిగాను. కానీ నేను చెప్పాలనుకున్న కథను మరోలా చెప్పే ప్రయత్నం చేయడంతో ఇలా కాదు అని నేనే చెప్పాలని దర్శకత్వం చేశాను.

    ప్రశ్న: ఇలాంటి సంఘటనల గురించి ఏమి చెప్పాలని మీ ప్రయత్నం?

    ప్రశ్న: ఇలాంటి సంఘటనల గురించి ఏమి చెప్పాలని మీ ప్రయత్నం?

    జవాబు: ఏ మధ్య కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వాంఛ తీర్చుకోవడానికి అమ్మాయిని రేప్ చేయాలా? వాంఛ తీర్చుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయ్ కదా. అలాగే తక్కువ జాతి వాళ్లపై జరుగుతున్న లైంగిక దాడుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. అయితే ఈ సినిమా అంత ఘాడంగా ఏమి ఉండదు. చాలా కూల్ గా సినిమా సాగుతుంది. సీన్స్ కూడా చాలా సహజంగా అనిపిస్తాయి. సెన్సార్ వాళ్ళు అప్రిసియేట్ చేసారు. చాలా బాగుంది. మంచి పాయింట్ ఎంచుకుని తీసారని అన్నారు . అక్కడ మహిళా సభ్యులైతే కన్నీళ్లు పెట్టించావని అన్నారు.

    ప్రశ్న: మొదటి సినిమాకే నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా చేయడం రిస్క్ అనిపించలేదా?

    ప్రశ్న: మొదటి సినిమాకే నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా చేయడం రిస్క్ అనిపించలేదా?

    జవాబు: 1997 సినిమా కోసం కథ అనుకున్నాకా ఇందాక చెప్పినట్టు కథ ఎలాగైనా తెరపై కనిపించాలంటే మనమే రిస్క్ చేయాలనీ ఫిక్స్ అయ్యాను. నిజం చెప్పాలంటే వేరే దారిలేక నేనే చేయాల్సి వచ్చింది. ఇందులో నేను ఐపీఎస్ పాసై అప్పుడే ఓ ఉరికి వెళ్లిన పోలీస్ అధికారిగా కనిపిస్తాడు. ఊర్లలో జరుగుతున్న ఈ సంఘటనలను ఆపేందుకు ప్రయత్నం చేసే పోలీస్. అని రకాల షేడ్స్ ఉంటాయి.

    ఇది కూడా కమర్షియల్ వే లోనే చెప్పే ప్రయత్నం చేసాం. ఇప్పుడు ఈ కథను చెప్పుకుంటే పొతే ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. కాబట్టి .. దాన్ని కమర్షియల్ హంగులతో చూపించే ప్రయత్నం చేసాం. అయితే ఇందులో ఐటెం సాంగ్, అమ్మాయి ఎక్స్పోజింగ్ లాంటివి ఉండవు.

    ప్రశ్న: కోటి మ్యూజిక్ గురించి?

    ప్రశ్న: కోటి మ్యూజిక్ గురించి?

    జవాబు: నాకు మొదటి నుండి కోటిగారంటే చాలా పరిచయం. ఈ కథ అయన విన్నాక చాలా బాగుందని చెప్పారు. ఆ తరువాత నువ్వు సినిమా మొదటి సారి చేస్తున్నావు కాబట్టి సినిమా చేయి మొదటి కాపీ వచ్చాక చేస్తానని అన్నారు . ఆ తరువాత సినిమా చూసి మోహన్ ఈ సినిమాకు నేను మ్యూజిక్ చేస్తున్నాను చాలా గొప్పగా తీశావని అన్నారు. అయన ఆర్ ఆర్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. అలాగే ఏమి బతుకు సాంగ్ మంగ్లీ పాడింది. అది 8 మిలియన్ వ్యూస్ వరకు వెళ్లడం చాలా ఆనందంగా ఉంది.

    ప్రశ్న: నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్ ల గురించి?

    ప్రశ్న: నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్ ల గురించి?

    జవాబు: ఇందులో నవీన్ చంద్ర నా పై అధికారిగా కనిపిస్తాడు. నవీన్ చంద్ర నటన గురించి చెప్పాల్సిన పనిలేదు. అద్భుతంగా చేసాడు. ఇక శ్రీకాంత్ అయ్యంగార్ నటుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయన ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతారు. కాబట్టి ఇందులో చారి అనే పోలీస్ గా అదరగొట్టాడు. ఈ సినిమాలో నేను, నవీన్ చంద్ర హీరోలం కాదు ఈ సినిమాకు కథే హీరో.

    ప్రశ్న: ఈ సినిమా విషయంలో నటుడిగా , డైరెక్టర్ గా ఏది సంతృప్తి ఇచ్చింది?

    ప్రశ్న: ఈ సినిమా విషయంలో నటుడిగా , డైరెక్టర్ గా ఏది సంతృప్తి ఇచ్చింది?

    జవాబు: నాకు ఏ పని చేసిన అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయి చేయడం ఇష్టం. ఈ సినిమా విషయంలో నటుడిగా, దర్శకుడిగా నాకు రెండు సంతృప్తి ఇచ్చాయి. ఇవే కాదు నేను డాక్టర్ గా ఉన్నా, లేక మాకు లీల గ్రూప్ పేరుతొ స్కూల్, బట్టల బిజినెస్ లు ఉన్నాయి. ఈ బిజినెస్ విషయంలో కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఆ పని చేశాను. ప్రస్తుతం ఈ సినిమా పైనే ఫోకస్ పెట్టాము. ఇది విడుదలైన తరువాత మిగతా సినిమా గురించి ఆలోచిస్తా.

    English summary
    Director and Actor Mohan revealed his emotinal things of sexual abuse in 1997 movie. 1997 movie is set to release on November 26. In this occassion, Dr. Mohan speaks to media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X