శబరి అంటే సంస్కృతంలో అర్ధం ఏమిటంటే? ఆ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఎందుకంటే..దర్శకుడు అనిల్ కాట్జ్

దక్షిణాదిలో యాంగ్రీ యంగ్ ఉమెన్ వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన శబరి చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో మే 3న సినిమా పాన్ ఇండియా రిలీజ్ కానున్నది. ఈ నేపథ్యంలో దర్శకుడు అనిల్ కాట్జ్ తెలుగు ఫిల్మీ‌బీట్‌తో ప్రత్యేకంగా మాట్లాడుతూ..

నా పేరు అనిల్ కాట్జ్ అంటే వినే వారికి, చూసే వారికి కొత్తగా ఉంటుంది. అయితే మా ఇంటి పేరు కాట్రపాటి. asterix అనే కార్టూన్ సిరీస్ వచ్చేది. అందులో ప్రతి క్యారెక్టర్ పేరు చివర 'X' లేదా 'Z'తో ముగిసేవి. అప్పట్లో నేను సెంట్రల్ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ చేసేటప్పుడు ట్రెండిగా ఉంటుందని నా ఇంటి పేరు చివరన X తగిలిస్తే.. అనిల్ కాట్రపాటి కాస్త కాట్జ్ అయింది అని తెలిపారు.

Director Anil Katz reveals story behind Sabari and Pan India Release

నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. చదువుకొనే రోజుల్లో మణిరత్నం, రాంగోపాల్ వర్మ, వంశీ లాంటి దర్శకుల సినిమాలు చూవాను. ఫిలిం కోర్సు చేయాలని అనుకొనే రోజుల్లో సెంట్రల్ యూనివర్సిటీలో మాస్ కమ్యునికేషన్ కోర్సు ఉంది. అందులో వీడియో ప్రొడక్షన్ ఉంటుంది అని తెలిసింది. అయితే ఆ కోర్సులో చేరిన తర్వాత మా సీనియర్ శరత్ మరార్ పరిచయం అయ్యారు. ఆయన సపోర్టు కూడా లభించింది. ఆ తర్వాత లీనియర్ ఎఢిటింగ్ నేర్చుకొని చెన్నైలో కొన్ని సినిమాలకు పనిచేశాను అని అనిల్ తెలిపారు.

Director Anil Katz reveals story behind Sabari and Pan India Release

తెలుగులో చాలాకాలం ప్రముఖ దర్శకులు బీ గోపాల్, రవికుమార్ చౌదరీ, మదన్ లాంటి వారి దగ్గర పనిచేశాను. కల్యాణ్ రామ్ నటించిన ఎంత మంచి వాడవురా సినిమాకు సతీష్ వేగేశ్న మూవీకి పనిచేశాను. ఆ తర్వాత వరలక్ష్మీ శరత్ కుమార్‌కు కథ చెప్పించి ఒప్పించడంతో శబరి సినిమాతో పరిచయం అవుతున్నాను అని తెలిపారు.

నాలుగేళ్ల క్రితం శబరి సినిమా కథకు బీజం పడింది. ప్రాణానికి మించి మనం దేనిని అయినా ప్రేమిస్తే... అది ప్రాణం తీసేంత ద్వేషంగా మారే అవకాశం ఉంది అనే సింగిల్ పాయింట్‌తో కథ మొదలైంది. ప్రేమకు స్వచ్ఛమైన రూపం మాతృత్వం. తల్లి కుమార్తె ప్రేమ నేపథ్యంలో ఆ పాయింట్ చెబితే బావుంటుందని కథ రాసుకున్నా అని అన్నారు.

Director Anil Katz reveals story behind Sabari and Pan India Release

శబరి టైటిల్ పెట్టడం వెనుక ప్రధాన కారణం.. రామాయణంలో శబరికి రాముడు కొడుకు కాదు. కానీ ఆయన కోసం ఎన్నో ఏళ్లు వేచి చూసింది. రుచికరమైన ఫలాలను ఇవ్వాలనే కోరికతో.. ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగకూడదని ముందు జాగ్రత్తగా తాను ఎంగిలి చేసి తనకు తినిపిస్తుంది. ఆమె ప్రేమలో నిజాయితీ ఉంది. శబరి అంటే సంస్కృతంలో ఆడపులి. వరలక్ష్మీ పోషించిన పాత్రలో ఆ లక్షణాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమాకు టైటిల్ పెట్టాను అని చెప్పారు.

సినిమా స్టార్ట్ అయినప్పుడు పాన్ ఇండియా మూవీ కాదు. వరలక్ష్మీ గారికి తమిళంలో మార్కెట్ ఉంది కాబట్టి.. తెలుగు, తమిళం భాషల్లో చేయాలని అనుకొన్నాం. మా నిర్మాత మహేంద్రనాథ్ పాన్ ఇండియా రిలీజ్ చేద్దామన్నారు. సినిమా స్టార్ట్ చేసేటప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ మొదలు అయ్యింది. కథలో యూనివర్సల్ అప్పీల్, ఆ పొటెన్షియల్ ఆయన చూశారు. నేను ఓకే అన్నాను అని చెప్పారు. కేవలం ఈ సినిమా థ్రిల్లర్ మాత్రమే కాదు.. ఎమోషనల్ సినిమా. శబరి మంచి భావోద్వేగాలను, థ్రిల్లింగ్ అంశాలను పంచుతుంది అని అనిల్ కాట్జ్ అభిప్రాయపడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X