twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా కొడుకుకు మహేష్ పాత్ర పేరునే ఎందుకు పెట్టానంటే.. అనిల్ రావిపూడి క్లారిటీ

    |

    మీడియం రేంజ్‌ బడ్జెట్‌ చిత్రాలతో సరిపెట్టుకొంటున్న సమయంలో భారీ బడ్జెట్ చిత్రంతో రూపొందించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం దర్శకుడు అనిల్ రావిపూడికి అద్భుతమైన అనుభూతులను మిగిల్చింది. కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని అందుకోవడం పక్కన పెడితే.. సూపర్ స్టార్ మహేష్‌బాబుతో పనిచేయడం, అదే సమయంలో తన వారసుడు ఇంట్లోకి అడుగుపెట్టడం లాంటి అంశాలు అనిల్ రావిపూడికి 2020 ఓ మ్యాజిక్ మూమెంట్స్‌ను అందించాయి. అలాంటి ఫీలింగ్స్ మధ్య తన కుమారుడికి సరిలేరు నీకెవ్వరులోని మహేష్ బాబు పోషించిన అజయ్ కృష్ణ పాత్రను పెట్టడం మీడియాలోను, సినిమా పరిశ్రమలోనూ చర్చనీయాంశమైంది. ఈ సందర్బంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ..

    మహేష్‌బాబుతో పనిచేయాలని

    మహేష్‌బాబుతో పనిచేయాలని

    నేను ఎప్పుడూ మహేష్‌బాబుతో కలిసి పనిచేయాలనే కోరికతో ఉండేవాడిని. నా కల సాకారమవ్వడమే కాదు. .సరిలేరు నీకెవ్వరు చిత్రం బ్రహ్మండమైన అనుభూతిని మిగ్చిల్చింది. ఈ విజయం నాకు మరింత మానసిక ధైర్యాన్ని ఇచ్చింది. నా జీవితానికి సరిపోయే విలువైన అనుభవాన్ని అందించింది. సినిమా రిలీజ్ సమయంలోనే నాకు కొడుకు పుట్టడం కూడా జరిగింది అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు.

     జనవరి 3న ఆడియో రిలీజ్ రోజునే

    జనవరి 3న ఆడియో రిలీజ్ రోజునే

    నా కుమారుడికి అజయ్ కృష్ణ అనే పేరు పెట్టడానికి అసలు కారణం ఏమిటంటే.. నా భార్య భార్గవి జనవరి 3న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. నా కూతురు శ్రేయాస్వికి సోదరుడు రావడంతో కుటుంబ సభ్యులంతా ఆనందంలో మునిగిపోయారు. నా బిడ్డ పుట్టిన రోజే సరిలేరు నీకెవ్వరు సినిమా ఆడియో ఫంక్షన్. నా సినిమా సక్సెస్‌కు నా బిడ్డ పుట్టడం శుభసూచకంగా భావించాను. సినిమా రిలీజై బ్లాక్‌బస్టర్ టాక్ సొంతం చేసుకొన్న తర్వాత నేను భార్గవి నా కొడుకుకు అజయ్ కృష్ణ అనే పేరును పెట్టాలని నిర్ణయించుకొన్నాం అని అనిల్ రావిపూడి తెలిపారు.

    నా హృదయానికి దగ్గరగా

    నా హృదయానికి దగ్గరగా

    వాస్తవానికి సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మేజర్ అజయ్ కృష్ణ పోషించిన పాత్ర నా హృదయానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఆ పాత్రలోని నిజాయితీ, క్రమశిక్షణ, ధైర్యం, మహిళలంటే గౌరవం నన్ను బాగా ఆకట్టుకొంటాయి. అందుకే నా కుమారుడికి అలాంటి క్వాలిటీస్ రావాలని, ఉండాలని కోరుకొంటూ ఆ పేరు పెట్టాం. నాకు అంతేకాకుండా నాకు కొడుకు పుట్టడం వల్ల నాకు మంచి విజయంతోపాటు భారీ రెమ్యునరేషన్ కూడా తెచ్చిపెట్టాడని భావించాను అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు.

    Recommended Video

    Allu Arjun's Pushpa Breaks NTR Record With Most Liked First Look Poster
    F3 ఎలా ఉంటుందంటే

    F3 ఎలా ఉంటుందంటే

    ప్రస్తుతం కరోనావైరస్ కారణంగా అమలవుతున్న లాక్‌డౌన్ నేపథ్యంలో అనిల్ రావిపూడి తన స్వస్థలం చిలుకురివారిపాలెంలో స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు. ప్రస్తుతం F3 సినిమా స్క్రిప్టు రాయడంలో నిమగ్నమయ్యారు. అయితే F2 సినిమాకు సీక్వెల్ మాత్రం కాదు. కథను బట్టి పాత్రల ఎంపిక జరుగుతుంది. స్టోరి చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. పూర్తిస్థాయిలో కథపై కసరత్తు చేస్తున్నాను. అన్‌లిమిటెడ్ ఫన్ ఉంటుందని గ్యారెంటీగా చెప్పగలను అని అనిల్ రావిపూడి అన్నారు.

    English summary
    Director Anil Ravipudi shows gratitude to Mahesh babu after Sarileru neekevvaru. In the time of Sarileru neekevvaru movie release, Anil Ravipudi blessed with a baby boy. Now this director named his son is Ajay Suryavansh after role of Ajay Krishna in Sarileru Neekevvaru.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X