Anil Ravipudi: పిచ్చోళ్లే.. శ్రీలీల డ్యాన్స్ కోరుకుంటారు: అనిల్ రావిపూడి
Anil Ravipudi: నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన తాజా చిత్రం భగవంత్ కేసరి. అక్టోబర్ 19వ తేదీ రోజున విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. బాక్సాఫీసును షేక్ చేస్తూ.. ముందెకెళ్తోంది. అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్ బాలకృష్ణ హీరోగా రావడంతో ఈ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలు నమోదు అయ్యాయి. వీరిద్దరి కాంబోలో సినిమా ఎలా ఉంటుందోనని అంతా తెగ ఆసక్తిగా ఎదురు చూశారు. టీజర్, పోస్టర్లు, ట్రైలర్లు, పాటలు చూసి సినిమా కచ్చితంగా చూడాలని ఫిక్స్ అయిపోయారు. ఈక్రమంలోనే పెద్ద ఎత్తున థియేటర్లకు వెళ్తున్నారు.
తండ్రీకూతుళ్ల అనుబంధం ప్రధానంగా రూపొందిన ఈ సినిమాలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ నటించారు. బాలకృష్ణ కూతురుగా.. శ్రీలీల కనిపించింది. అలాగే ప్రియురాలి పాత్రలో కాజర్ అగర్వాల్ తెగ సందడి చేస్తోంది. యాక్షన్ తో పాటు ఎమోషన్ పాళ్లు ఎక్కువగా ఉన్న ఈ సినిమాపై కొందరు తమకు నచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో గ్లామరస్ బ్యూటీ శ్రీలీలను పెట్టుకొని ఆమె అందాన్ని పెద్దగా హైలెట్ చేయలేకపోయారని, అలాగే ఆమెతో మాంచి మాస్ స్టెప్పులు కూడా వేయించలేరని అన్నారు. దీనిపై డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పందించారు.

ఇలాంటి యాక్షన్ అండ్ ఎమోషనల్ సినిమాలో కూడా శ్రీలీల డ్యాన్స్ కావాలనుకునే వాళ్ల మానసిక పరిస్థితి ఎలా ఉందో, వారికే తెలియాలంటూ చెప్పుకొచ్చారు. ఫోబియాతో భయపడే ఓ అమ్మాయి, ఆర్మీ ఆఫీసర్ గా కనిపించే అమ్మాయి.. మాస్ స్టెప్పులు వేయడం ఏంటని అన్నారు. ఇలాంటి చిత్రంలో కూడా శ్రీలీల గ్లామర్, డ్యాన్స్ కావాలనుకునే వాళ్లు నిజంగా పిచ్చోళ్లే అంటూ అనిల్ రావిపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న శ్రీలీల మాత్రం.. డైరెక్టర్ అన్న మాటలు వింటూ తెగ నవ్వుకుంటోంది. అనిల్ రావిపూడి చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

మరోవైపు ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీసు వద్ద డీసెంట్ ఓపెనింగ్స్ ని అందుకుంది. ఇతర చిత్రాలన నుంటి గట్టి పోటీ ఉన్నప్పటికీ కూడా మంచి ఓపెనింగ్స్ దక్కించుకుంది. ముఖ్యంగా రెండు రోజుల్లో రూ.50 కోట్లకు పైగా సంపాధించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.51.12 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. అమెరకాలో 800కే డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.6.65 కోట్లు రాబట్టింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా రెండో రోజు రూ.18 కోట్ల గ్రాస్ వచ్చింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో భగవంత్ కేసరి చిత్రాన్ని రెండు రోజుల్లో రూ.30 కోట్లకు పైగా షేర్ వచ్చిందని ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆంధ్రాలో రూ.15 కోట్లు, సీడెడ్ లో రూ.8 కోట్లు, రూ.8 కోట్లు నైజాంలో రూ.10 కోట్లు వసూలు చేసినట్లు స్పష్టం చేశారు. ఇలా ప్రపంచ వ్యాప్తగా రూ.51.12 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు. రాబోయే వారం రోజుల్లో మరింత ఎక్కువ కలెక్షన్లు సాధిస్తాయని అంతా అంచనా వేస్తున్నారు. చూడాలి మరి బాలకృష్ణ చేసిన ఈ సినిమా ఏ రేంజ్ లో బాక్సాఫీసును షేక్ చేస్తుందో.


Click it and Unblock the Notifications











