ఆయ్ కథను చాలా మంది హీరోలు రిజెక్ట్ చేశారు.. ఆయన లేకుంటే సినిమానే లేదు.. డైరెక్టర్ అంజి
కంటెంట్ వచ్చే చిన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి భారీగా ఆదరణ దక్కుతున్నది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమిటీ కుర్రోళ్లు మూవీ భారీ విజయం సాధించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పేక మేడల్లా కూలిన సందర్భంలో వచ్చిన ఆయ్ సినిమా మరో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా థియేటర్లలో దిగ్విజయంగా ప్రదర్శిస్తున్న నేపథ్యంలో తొలి చిత్ర దర్శకుడు అంజీ కే మణిపుత్ర మీడియాతో తన సంతోషాన్ని పంచుకొంటూ..
ఆయన్ సినిమా నచ్చడానికి నా జీవితంలో గోదావరి జిల్లాలో చూసిన వాస్తవ సంఘటనలే. మధ్య తరగతి కుటుంబంలో జరిగే సంఘటనలు, ఆ ప్రాంతంలో ఉండే కులాలు, పరువు లాంటి అంశాలను అందర్నీ ఆకట్టుకొన్నాయి. పెద్ద సినిమాలు కూడా సరిగ్గా ఆడటం లేదనుకున్న సమయంలో చిన్న సినిమా అయినా అందరూ వచ్చి చూశారు. డబ్బులు ఎక్కువ వచ్చినందుకు నిర్మాతగా బన్నీ వాసు హ్యాపీగా ఫీల్ అయ్యారు అని అన్నారు.

ఆయ్ కథ రాసిన తర్వాత చాలా మంది హీరోలను కలిశాను. కానీ ఎవరూ ఈ సినిమా చేయడానికి ముందుకు రాలేదు. కొన్ని కారణాల వల్ల నార్నే నితిన్ కలిశారు. ఆయన కథ చెప్పగానే వెంటనే ఒప్పుకొన్నారు. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో చూసిన తర్వాత ఆయన లేకపోతే సినిమానే లేదు అనే ఫీలింగ్ కలిగింది. నేను ఈరోజు మీ ముందు ఇలా కూర్చున్నానంటే కూడా దానికి కారణం ఆయనే. నాకు తొలి దర్శకుడిగా అవకాశం ఇచ్చిన అతడిని జీవితంలో ఎన్నడూ మర్చిపోలేను అని అంజి అన్నారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూసిన తర్వాత మమ్మల్ని ప్రశంసించి తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కామెడీని బాగా డీల్ చేశావని మెచ్చుకొన్నారు. ఇక అల్లు అర్జున్ రెస్పాన్స్ మాకు మరింత కాన్ఫిడెన్స్‌ను ఇచ్చింది. మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తావని మీరు మరోసారి నిరూపించారు. రెండో సినిమా ఎప్పుడని అడిగారు అని అంజి తెలిపారు.
ప్రస్తుతం ఆయ్ సినిమాను ఎంజాయ్ చేస్తున్నాను. ప్రస్తుతం నా వద్ద రెండు కథలు ఉన్నాయి. అందులో ఏది ఓకే అయితే అది చేయడానికి రెడీగా ఉన్నాను. రెండో సినిమా అంటే నిర్మాతల్లోను ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉంటాయి. వారిని ముందు ఒప్పించాలి. ఆ తర్వాతే చేయాలి అని అంజి తన మనసులో భావాలను వెల్లడించారు.
ఆయ్ సినిమాలో కామడీ పండిందంటే.. అందుకు కారణం కసిరెడ్డి, అంకిత్. వారిద్దరిని తీసుకోవాలనే నిర్ణయం నాదే. వాళ్లిద్దరూ బాగా నటిస్తారు. అంకిత్ విషయంలో బన్నీ వాసు అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత అంజి నువ్వే రైట్.. నేను పొరపాటు పడ్డాను అని అన్నారు. ఏది ఏమైనా నా నమ్మకం వారిద్దరు నిలబెట్టారు అని అన్నారు.


Click it and Unblock the Notifications











