twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజేంద్ర ప్రసాద్‌కు మోడీ పేరు ఎందుకు పెట్టామంటే.. క్లైమాక్స్‌పై దర్శకుడు భవానీ శంకర్ క్లారిటీ

    |

    డ్రీమ్‌ చిత్రంతో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకొన్న దర్శకుడు భవానీ శంకర్‌ రూపొందించిన చిత్రం క్లైమాక్స్‌. నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం కైపాస్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ పతాకంపై రాజేశ్వర్‌ రెడ్డి, కరుణాకర్‌ రెడ్డి నిర్మించారు. సాషా సింగ్‌, '30 ఇయర్స్‌' పృథ్వీ, శివశంకర్‌ మాస్టర్‌, శ్రీరెడ్డి ,రమేశ్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం మార్చి 5న (శుక్రవారం) మూవీ విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు భవానీ శంకర్‌ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

    క్లైమాక్స్ అని ఎందుకు పేరు పెట్టారనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. సినిమా కథ మొత్తం తెలిసేది క్లైమాక్స్‌లో కాబట్టి క్లైమాక్స్‌ అని టైటిల్‌ పెట్టాం. అనేక మలపులు తిరుగుతూ సాగే మర్డర్‌ మిస్టరీ. రాజేంద్రప్రసాద్‌గారికి ఓ వైపు సాషా సింగ్‌, శివశంకర్‌ మాస్టర్‌... మరోవైపు శ్రీరెడ్డి, పృథ్వీగారు ఉంటారు. అటు, ఇటు ఉన్నవాళ్లు మర్డర్‌ మిస్టరీలో అనుమానితులు. అందుకని, అలా డిజైన్‌ చేశాం. ఎవరు మర్డర్‌ చేశారనేది క్లైమాక్స్‌లో రివీల్‌ అవుతుంది.

    Director Bhavani Shankar About Rajendra Prasads Climax

    మర్డర్‌ రాజేంద్రప్రసాద్‌గారిదే. అయితే, ఆయన సినిమా అంతా ఉంటారు. మాములుగా మర్డర్‌ మిస్టరీ స్టోరీలన్నీ ఇన్వెస్టిగేటివ్‌ జానర్‌లో వెళ్తుంటాయి. కొత్తరకంగా తీయాలనే ఉద్దేశంతో తీసిన చిత్రమిది. ఇన్వెస్టిగేటివ్‌ పంథాలో వెళ్లకుండా కామెడీగా తీయవచ్చా అని ఆలోచించి చేసిన ఓ ప్రయోగం ఇది. కామెడీ, థ్రిల్‌, టెన్షన్‌ పెట్టే అంశాలూ ఉన్నాయి అని భవానీ శంకర్ తెలిపారు.

    ఇక కథ విషయానికి వస్తే.. ఓ మల్టీ మిలీనియర్‌ ఇంట్లో ఉండకుండా... స్టార్‌ హోటల్‌లోని సూట్‌ రూమ్‌లో ఉంటాడు. భార్యాబిడ్డలు ఉన్నా ఇంట్లో ఉండడు. అతని లైఫ్‌ స్టయిల్‌ అలా ఉంటుంది. స్టార్‌ హోటల్‌లో సూట్‌ రూమ్‌లో 500 కోట్ల రూపాయలు పెట్టి ఉంటారు. ఆయన సడన్‌గా చనిపోతారు. డబ్బు కనిపించదు. డబ్బు ఏమైంది? ఎవరు చంపారు? అన్నది కథ అని అన్నారు.

    హీరోకి మోడీ అని పేరు పెట్టడం వెనుక కారణాన్ని వివరిస్తూ .. ఆ విషయాన్ని చెబితే సినిమా క్లైమాక్స్‌లో థ్రిల్‌, కిక్‌ ఉండదు. సినిమా చూసిన తర్వాత ఎవరైనా సరే... మోడీ అని పేరు పెట్టడం సరైన నిర్ణయమని కచ్చితంగా చెబుతారు. తప్పని ఎవరూ అనరు. సెన్సార్‌ సమయంలోనూ 'మోడీ అని ఎందుకు పేరు పెట్టాలి? ఇన్ని పేర్లు ఉన్నాయి కదా' అనే ప్రశ్న ఎదురైంది. సినిమా చూశాక... సెన్సార్‌ వాళ్లు ఆ ప్రశ్న అడగలేదు. ట్రైలర్‌ టైమ్‌లో కొంత అభ్యంతరం వచ్చింది. మోడీ పేరుకు సినిమాలో ప్రాముఖ్యం ఉంది. అదేంటో ఎండింగ్‌ వరకూ తెలియదు అని భవానీ శంకర్ తెలిపారు

    English summary
    Sr. Hero, Versatile Actor Dr. Rajendra Prasad & Acclaimed Writer/Director/Producer Bhavani Shankar’s upcoming Multi-genre flick 'Climax' ready for the release on March 5th with U/A. Garnering a huge response to the Trailer, Climax stars Sri Reddy, Prudhvi Raj and Shivashankar Master in prominent roles in P.Rajeshwar Reddy & K.Karunakar Reddy production under Kaipas Film Production House.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X