చిరంజీవి జడ్జిమెంట్ అలాంటిది.. వాల్తేరు వీరయ్యతో బ్లాక్‌బస్టర్ గ్యారంటీ.. దర్శకుడు బాబీ ఇంటర్వ్యూ

చిరంజీవి, శృతి హాసన్ హీరో, హీరోయిన్లుగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాణ సారథ్యంలో దర్శకుడు బాబీ రూపొందిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలయిక ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. టీజర్లు, ట్రైలర్లు సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి. జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్దమైన నేపథ్యంలో దర్శకుడు బాబీ కొల్లి మీడియాతో మాట్లాడుతూ..

నాపై ఒత్తిడి లేదు అంటూ బాబీ

నాపై ఒత్తిడి లేదు అంటూ బాబీ


నా దర్శకత్వంలో వస్తున్న చిరంజీవి చిత్రం వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ఒకేసారి సంక్రాంతికి రిలీజ్ కావడం నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఆ రెండు చిత్రాల మధ్య పోటీ లేదు. సంక్రాంతికి రెండు పండుగ లాంటి చిత్రాలే. ఈ సినిమాకు నిర్మాతలు వేరే అయితే కంగారు ఉండేది. ఈ రెండు సినిమాలకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కావడంతో ఫలితాలు రెండు బాగా ఉండాలని కోరుకొంటున్నాం అని బాబీ అన్నారు.

 2023లో నా కల నిజమైంది

2023లో నా కల నిజమైంది


చిరంజీవికి నేను వీరాభిమానిని. ఒక ఫ్యాన్‌గా సినిమా పరిశ్రమలో నా జర్నీ 2003లో ప్రారంభమైంది. చిరంజీవి సినిమాకు పనిచేయాలనేది నా కల. 2023లో నా కల నిజమైంది. నేను చిరంజీవిని డైరెక్ట్ చేసిన సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతున్నది. నా జీవితంలో మరిచిపోలేనటువంటి మూమెంట్. స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి, రవితేజ మాదిరిగానే.. నేను ఎవరి సపోర్ట్ లేకుండా ఎదిగాను. వాళ్లిద్దరితో సినిమా చేయడం నా అదృష్టం. మాస్ ఆడియెన్స్ ఏం కోరుకొంటున్నారో.. ఆ అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టి చేసిన సినిమా వాల్తేరు వీరయ్య అని బాబీ చెప్పారు.

చిరంజీవి బ్యాలెన్స్‌గా

చిరంజీవి బ్యాలెన్స్‌గా


చిరంజీవి సినిమా అనేసరికి ఖచ్చితంగా హిట్టు కొట్టాలనే ఒత్తిడి నాకు లేదు. మెగాస్టార్ ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను, అపజయాలను చూశారు. జయపజయాలకు అతీతంగా బ్యాలెన్స్‌గా ఉంటారు. రవితేజ కూడా అలానే ఉంటారు. అయితే సినిమా కమిట్ అయితే.. దానికి ఎంత న్యాయం చేయాలి? ఎంత కష్టపడాలో అంత కష్టపడుతారు. మిగితాది ప్రేక్షకులకు వదిలేస్తారు అని బాబీ అన్నారు.

లాక్‌డౌన్‌లో కథ మారిపోయింది..

లాక్‌డౌన్‌లో కథ మారిపోయింది..


వాల్తేరు వీరయ్య స్టోరిని లాక్‌డౌన్‌కు ముందు చెప్పాను. అంతలోనే లాక్‌డౌన్ వచ్చింది. ఆ తర్వాత ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయి. దాంతో డిఫరెంట్ కంటెంట్‌తో సినిమా చేయాలని అనుకొన్నాం. అలా ఆలోచించినప్పుడు వచ్చిన క్యారెక్టరే రవితేజది. ఫ్యాన్ బాయ్ మూమెంట్‌తో ఇద్దరి పాత్రలను చక్కగా డిజైన్ చేశా. ఇందులో చివరి వరకూ కథే గొప్పగా కనిపిస్తుంది. బీ, సి సెంటర్ల ఆడియన్స్‌తోపాటు మల్టీప్లెక్స్ ప్రేక్షకులను కూడా అలరించే అన్ని అంశాలు వాల్తేరు వీరయ్యలో ఉన్నాయి అని బాబీ పేర్కొన్నారు.

వాల్తేరు వీరయ్య‌తో బ్లాక్ బస్టర్ పక్కా

వాల్తేరు వీరయ్య‌తో బ్లాక్ బస్టర్ పక్కా

నేను ఫస్ట్ కాపీ చూడటం పక్కన పెడితే.. 153 సినిమాలు చేసిన చిరంజీవి గారు వాల్తేరు వీరయ్య సినిమా చూస్తున్నారనే విషయం తెలిసినప్పుడు నాకు రెండు రాత్రుల నిద్రలేదు. ఆయన జడ్జిమెంట్‌ పక్కాగా ఉంటుంది. వాల్తేరు వీరయ్య చూసి బ్లాక్ బస్టర్ కొడుతున్నాం బాబీ అని అన్నారు. ఆ రోజు నేను చాలా గర్వంగా ఫీలయ్యాను. ఆయన నన్ను ఓ తమ్ముడిగా దగ్గరకు తీసుకుని ఆత్మీయతను కురపించడం నా జీవితంలో మర్చిపోలేను. చిరంజీవి లాంటి మాస్ మూలవిరాట్ నన్ను కౌగలించుకొని ముద్దు పెట్టుకోవడం సర్రియల్ మూమెంట్. ఆ ఫోటోని ఫ్రేమ్ కట్టించుకున్నా అని బాబీ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X