‘ఎన్టీఆర్ వెన్నుపోటు ఆధారంగా మయసభనా? ఊహించుకుంటే తప్పేమీ లేదు’
ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సోనీ లివ్ (Sony Liv) అందిస్తున్న డిఫరెంట్ వెబ్ సిరీస్‌తో మయ సభ. రైజ్ ఆఫ్ ది టైటాన్స్ ట్యాగ్ లైన్. సామాజిక స్పృహతోపాటు సెన్సేషనల్ కంటెంట్‌తో సినిమాలు రూపొందించే దేవా కట్టా షో రన్నర్‌గా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో రూపొందింది. హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష రూపొందించారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 7వ తేదీన స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో దర్శకుడు దేవా కట్టా.. హీరోలు ఆది పినిశెట్టి, చైతన్య రావు ఫిల్మీబీట్ ఎడిటర్ రాజబాబు అనుములతో ముచ్చటించారు. మయ సభ సృష్టి వెనుక వారి విజన్ ఏమిటనే విషయంలోకి వెళితే..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రియల్ లైఫ్ క్యారెక్టర్లను స్పూర్తిగా చేసుకొని వారి మధ్య స్నేహాన్ని, రాజకీయ పరమైన వైరాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించిన మయసభ వెబ్ సిరీస్‌లో సాయి కుమార్, బాలీవుడ్ నటి దివ్య దత్తా, శ్రీకాంత్ అయ్యంగార్, రవీంద్ర విజయ్, శత్రూ, తన్య రామచంద్రన్ తదితరులు నటించారు. ఇటీవల రిలీజైన టీజర్‌లోని డైలాగ్స్ రాజకీయంగా, సినిమా రంగాల్లో సంచలనం రేపాయి.

మయసభ వెబ్ సిరీస్‌లో పొలిటిషియన్‌గా మారిన ఓ లెజెండరీ యాక్టర్ పాత్రను డైలాగ్ కింగ్ సాయికుమార్ పోషిస్తున్నారు. అయితే అందరూ ఆ పాత్రను స్వర్గీయ ఎన్టీఆర్ అని ఊహించుకోవడంలో తప్పు లేదు. నేను రాసుకొన్న కథ ఓ ఫ్యామిలీ స్టోరీ. ఒకవేళ నేను ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ఆర్ కథ అని చెబితే.. దానికి నేను పూర్తిగా బాధ్యత వహించాలి. అందుకే ప్రస్థానం ఓ చిన్న ఫ్యామిలీ కథ అయితే.. మయసభ పెద్ద ఫ్యామిలీ కథ అని చెప్పగలుగుతాను అని దర్శకుడు దేవా కట్టా తెలిపారు.
ఇక ప్రస్థానం సినిమా తీసినప్పుడు ఆ సినిమాను తమిళ రాజకీయ కథ అన్నారు. హిందీలో తీసినప్పుడు నార్త్‌లో బీహర్ కథ అనుకొన్నారు. ఓ పొలిటికల్ జర్నీలో ఏ రాష్ట్రంలో రాజకీయాలు ఇద్దరు ప్రత్యర్థుల మధ్య కొనసాగుతాయి. ఓ కథను ఎవరికి వారు తమకు నచ్చిన విధంగా ఊహించుకోవడంలో తప్పు లేదు. మయసభ విషయంలో కూడా అలాంటి ఊహగానాలు తప్పనిసరిగా వస్తుంటాయి అని ఆయన చెప్పారు.
నేను రిపబ్లిక్ సినిమా తీసినప్పుడు కూడా ఏపీ రాజకీయాలను కథగా రూపొందించారని విడుదలకు ముందు అందరూ అనుకొన్నారు. కానీ ఒకసారి రిలీజ్ తర్వాత వారి అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. ఓటీటీలోకి వచ్చిన తర్వాత బీహార్ నుంచి చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లందరూ కాల్ చేసి ప్రశంసల వర్షం కురిపించారు. రాజకీయ నేతల మధ్య కలెక్టర్ల అవస్థలను బాగా చూపించారని చాలా మంది కాల్స్ చేశారు అని దేవా కట్టా చెప్పారు.
మయసభ ఇద్దరు స్నేహితుల కథ పొలిటికల్ జర్ని. 1975 నుంచి 1983 వరకు వారి జీవితాల్లో జరిగిన సంఘటనలను ఊహించుకొని రాసుకొన్న కథ. ఎవరి బయోపిక్ తీసినా.. అందులో నిజం ఉండదు. ఎవరూ కూడా నిజాలు చెప్పారు. అందులో అంతా అవాస్తవాలే ఉంటాయి. కాబట్టి మయసభను ఓ ఫ్యామిలీ స్టోరీలా చూడండి. మంచి అనుభూతిని అందిస్తుంది అని దేవా కట్టా తన వాదనను వినిపించారు.


Click it and Unblock the Notifications











