‘రాంగోపాల్ వర్మ హత్యకు కుట్ర.. ఆర్జీవిని చంపడానికి ఆయనఅలాంటి ప్లాన్’
కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు శివ లాంటి కల్ట్ సినిమాలు తెరకెక్కించిన ఈ దర్శకుడు ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయకపోయినా వివాదాస్పద కామెంట్స్ తో తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. త్వరలోనే ఏపీలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ గీతా కృష్ణ ఆర్జీవిపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆర్జీవిని చంపాలని ప్లాన్ వేశారు అంటూ ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. మరి ఇంతకీ ఈ ప్లాన్ కథ ఏంటో మనమూ తెలుసుకుందాం పదండి.
డైరెక్టర్ గీతా కృష్ణ తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మపై జరిగిన మర్డర్ ప్లాన్ గురించి బయట పెట్టారు. ఆర్జీవిని చంపాలనుకున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులో ఎంతవరకు నిజం ఉంది ? అనే యాంకర్ ప్రశ్నకు డైరెక్టర్ గీతా కృష్ణ స్పందిస్తూ... రాంగోపాల్ వర్మ పెయిడ్ అనే విషయం అందరికీ తెలిసిందే అన్నారు.

తనకు డబ్బులు అందుతాయి కాబట్టే ఆయన వైసీపీకి సపోర్టివ్ గా మాట్లాడుతూ ఉంటాడు. అలాగే తరచుగా టిడిపికి ఎగైనెస్ట్ గా పోస్టులు చేస్తూ రెచ్చగొడుతూ ఉంటాడు. ఇదంతా తెలిసిందే. అయితే ఆయనను ఎదుర్కోవడానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం మాత్రం కరెక్ట్ కాదు. లోకేష్ ఏకంగా అతన్ని చంపాలని ప్లాన్ చేయడానికి బదులు అతన్ని ఎదుర్కొని ఉండొచ్చు అంటూ నారా లోకేష్ ఆర్జీవిని చంపడానికి ప్లాన్ చేశాడు అనే వార్తలు నిజం అనిపించేలా మాట్లాడారు గీతా కృష్ణ.
వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నాడు, సినిమాలు తీస్తున్నాడు అనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్లు వేస్తే, మరి ఆయన తండ్రి చంద్రబాబు నాయుడుని, పవన్ కళ్యాణ్ ని బండ బూతులు తిడతారు. కానీ వాళ్ళు ఇలా రియాక్ట్ అవ్వట్లేదు. మరి ఇతను మాత్రం ఇలాంటి ప్లాన్ ఎందుకు చేశాడు? అంటూ ప్రశ్నించారు.
నిజానికి రోడ్డు మీద వెళ్తుంటే ఎంతో మంది నానా రకాలుగా మాట్లాడుతారు. దానివల్ల వచ్చే నష్టం ఏమీ ఉండదు. అది తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు అసలు ఆర్జీవిని పట్టించుకోలేదు. కానీ లోకేష్ వాళ్ళలా ఆలోచించకుండా ఏకంగా చంపాలనుకోవడం, దానికి ప్లాన్ చేయడం చూస్తేనే ఆయనను తన తండ్రికి మధ్య ఉన్న తేడా ఏంటో అర్థం అవుతుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇక రాంగోపాల్ వర్మ తరచుగా సోషల్ మీడియా వేదికగా టిడిపికి, పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా పోస్టులు చేస్తూ వాళ్ళ అభిమానులను రెచ్చగొడతారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో సినిమాలు చేయడం బాగా తగ్గించిన ఆర్జీవి వ్యూహం లాంటి వైసీపీ సపోర్టివ్ సినిమాలతో కాలం గడుపుతున్నారు.
ఇక తరచుగా పవన్ కళ్యాణ్ ని, టిడిపిని డైరెక్ట్ గా టార్గెట్ చేసే వర్మ వైసిపి అంటే తనకు ఇష్టం అని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తాడు. ఇక ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ వేడి నేపథ్యంలో ఆర్జీవిని లోకేష్ చంపాలనుకున్నాడు అంటూ వస్తున్న వార్తలు దుమారం రేపుతున్నాయి.


Click it and Unblock the Notifications











